నేను మొదటి సారి విజయవాడ వచినప్పుడు నాకు చాలా చాలా బాగా నచిన vehicle :Auto.
నాకు చాలా సరదాగా వుండీది ఆటో లో తిరగటం అంటే. నేను అనుకునే వాడిని విజయవాడ వెళితే బాగుండు, ఆటో లో తిరగవచు అని!మా వూరిలో అస్సలు ఆటో లు లేవు లెండి. [ ఇది నేను 3వ తరగతి చదువు తున్నప్పుడు సంగతి.]
=================
మళ్లి మనం Inter చదవటం కోసం విజయవాడ వ చాం. అప్పుడు కూడా అనుకునే వాడిని "ఆటో లో వూరు మొత్తం తిరుగుదాము" అని. కాని తెలిసిందే కదా ఇంటర్ అంటే పెద్ద నరకం. బాగా చదవాలి, మంచి మార్కులు తెచ్చు కోవాలి.నా టార్గెట్ BITSPILANI లెండి. Inter 1st year:447 marks.అప్పుడు తెలిసింది అది మన వల్ల కాదు , మనకి యమ సెట్ [EAMCET] మాత్రమె దిక్కు అని.ఇంకా నా ఇంజనీరింగ్ కూడా అక్కడే కదా. కాని అప్పుడు మనం బస్ తప్ప మరొకటి ఎక్కటం జరగలిదు. అప్పుడప్పుడు bikes కూడా.
ఇంజనీరింగ్ లో నా రూట్ బందర్ road.
విజయవాడ తెలిసిన వాళ్ళకి ఇది బాగా సుపరిచితం. [తెలియని వాళ్ళకి : విజయవాడ లో 2 మెయిన్ రూట్ లు వుంటాయి. ఒకటి బందర్ road రెండు ఏలురు road.]నేను ఏలురు రోడ్ వెళ్ళింది ఆ 6 సంవత్సరాలు లో కేవలమ్ 3 సార్లు మాత్రమె.[అది కూడా మా వినేష్ (engineerng friend)గాడి ఇల్లు అటు వైపు కాబట్టి ].
===================================
ఒకసారి అనుకోకుండా అటు వెళ్ళాల్సి వచ్చింది ,మా ఫ్రెండ్స్ కూడా లేరు. ఇక చూసుకూండి ఒక ప్లేస్ కి బస్ లో వెళ్లాను అక్కడి నుండి ఇంకొక ప్లేస్ కి వెళ్ళాలి, అక్కడ బస్ లు కూడా సరిగ్గా రావు.[strike rate :Bunder road 1bus per 2 mins; Eluru road:1 bus per 20 mins-30 mins]
=======================
అప్పుడు మళ్లీ నాకు ఆటో గుర్తుకు వచ్చింది. వెళ్లి ఒక ఆటో వాడిని అడిగాను నాకు కావాల్సిన ప్లసుకి తీసుకు వెళ్ళమని, వాడు నన్ను చూసి 25 రూపాయలు అడిగాడు నేను మాములుగా 20 కి వస్తావా అన్నాను. వాడు కుదరదు సర్ అన్నాడు. దూరమీమో అనుకుని సరే అన్నాను. కాని నన్ను 4 నిముశాలులో అక్కడకు తీసుకు వెళ్ళాడు.
====================
అప్పుడు అనుకున్నా "నేను నిజంగా ఆటో లో విజయవాడ మొత్తం తిరగాలి అంటే మనకు వున్నా ఇల్లు ,ఇంకా మా పక్కింటి వాళ్ల ఇల్లు అమ్మేస్తే ఆ డబ్బులు సరిపోతాయా అని!"
==================
ఇప్పుడు మా వూరు వెళదాము అదేనండి దివిసీమ. పోయిన సంవత్సరం నాకు అవసరం అయ్యి పక్కన వున్నా పల్లెతూరుకి బయలుదేరా, టైంకి మా బైక్ కూడా లేదు, ఇక బస్ మాత్రమె దిక్కు పైగా వర్షం పడుతుంది, ఎలా దీవుడా అనుకుంటున్నప్పుడు నా ఎదురుగా ఒక ఆటో ప్రత్యక్షం అయ్యింది.వాడిని అడిగాను , బాబు నేను xxxx పల్లెటూరికి వెళ్ళాలి అని. వాడు చెప్పాడు : "సర్ ఇది sharing auto".
సరే బాబు నన్ను అక్కడికి తీసుకు వెళ్ళు చాలు అన్నాను.(నిజం చెప్పాలంటే నాకు పల్లెటూరు మనుషుల్ని చెయ్యటం ఇష్టం.)కాని 10 నిముషాలు గడిచినా ఎవ్వరూ రారే!. ఇక నేను వుండలీక అంతనితో చెప్పాను , బాబు నేను తొందరగా వెళ్ళాలి , మొత్తం డబ్బులు నేను ఇస్తాను ,వెళ్లి పూదాం పద అని. తను మాత్రం అస్సలు కుదరదు సర్, జనాలు లేకున్దా ఆటో కదలదు అని అన్నాడు. నాకు నవ్వు వచ్చింది ,నీకు కావాల్సింది నేను ఇస్తాను , నన్ను తీసుకు వెళ్ళవయ్యా బాబు అని అన్నా కాని వినిపించు కోలీదు. ఇక యీమి ఎవరో ఒక father n his two childs ని నేను రిక్వెస్ట్ చేసి వాళ్లకు కూడా నేనె డబ్బులు కట్టి ఆ ఊరికి తీసుకుని వెళ్లాను.======================================
ఇక మన హైదరాబాద్ 7 seater autos.
ఎక్కడ కావాలంటే అక్కడ ఆపుతారు. ఎక్కడ కావాలంటే అక్కడ దింపుతారు. చిన్న ఆటో ల గురింహి చెప్పనవసరం లేదు. ఈ మధ్యన ఒక sports channel చూసినప్పు నాకు ఒక కొత్త విషయం తెలిసింది. ఇది కనుక మన రెడ్డి గారు కాని బాబు గారు కాని వింటే మన హైదరాబాద్ కి ఇంకొక విషయం లో కూడా బాగా పేరు వస్తుంది.
అదే F1 Race.
మన ఆటో డ్రైవర్స్ కి మాత్రం యేమి తక్కువండి ? 40 km తో వెళ్ళాల్సిన ఆటో ని 60 km తో పూనిస్తారు. యెంత ట్రాఫిక్ వున్నా కాని వాటి మధ్యలో నుండి అందరినీ దాటుకుని వెళ్తారు.ఎవరైనా overtake చేస్తె వాళ్ళని ఎలాగైనా దాటుకుని వెళ్తారు.కాబట్టి వాళ్ళకి సరి ఐన training ఇస్తే వాళ్లు F1 race లో మనకు వొద్దు వొద్దు అన్నా కాని, చాలా చాలా కప్పులు తీసుకుని వస్తారు.
Please spread this message to your friends.Finally it may reach Babu/Reddy/Chiru.
1 comment:
నాకూ ఓ సారి మావూరు వెళ్ళటానికి అడిగనంతా ఇస్తాను అన్నాను కాని ఆటో వాడు జనాలనూ ఎక్కించాడు
extra డబ్బులు దొబ్బాడు
Post a Comment