Saturday, July 5, 2008

అలా హైదరాబాద్ వచ్చిన 2 వారాలకి ఒక జాబు ఫెయిర్ జరగటం, నేను వాళ్ళని లోకల్ కంపెనీ కదా అని అడిగి మరీ నా రెసుమే ఇచ్చాను.(పేరెంట్స్ కండిషన్ :హైదరాబాద్ దాటి బయటకు వెళ్లొద్దు అని).
అక్కడ .నెట్ ట్రైనింగ్ సెంటర్ లో కొత్త కష్టాలు. మనం 50 మంది వున్న క్లాసు రూమ్ లో నే పాఠాలు వినం. కాని ఇక్కడ మా ఊరి అమ్మవారి జాతర లో వున్నట్లు టన్నుల కొద్దీ జనాలు. (అయినా బాగానే వుంది లెండి కంటికి ఇంపుగా అమ్మాయిలు). మళ్ళి ఒక పక్కన , ఎదురుగా వున్న అమ్మాయిని చూడాలని అనిపిస్తుంది, ఇంకొక పక్కన జాబు రాలీదు అన్న బాధ. నిజం చెప్పాలి అంటే మా కాలేజీ లో 7 కాంపస్ ఇంటర్వియూస్ ఫెయిల్ అయినప్పుడు కూడా ఇంతలా ఫీల్ అవ్వలేదు.
ఈ లోపు మనకు 2 కంపెనీ ల నుండి కాల్స్, ఇంటర్వ్యూ కి రా అని.మీకు చెప్పటం మర్చి పోయా ఒక కంపెనీ పేరు చందమామ....... సోలుషన్స్ (పేరు మార్చటం అయినది).చాలా అందమైన పేరు(మీరు కూడా వొప్పు కూండి).వీళ్ళు బయట x రేట్ కి దొరికేయి కోర్సుని 3x రేట్ కి మనకు చెపుతారు అంట.ఇంకా మనల్ని కొన్ని కంపెనీ ల ఇంటర్వియూస్ కి పంపిస్తారు అట.కాని వీళ్ళకు తెలియని విషయం ఒకటి వుంది నా దగ్గర X కూడా కష్టం ఇంకా 3X కావాలంటే నేను వీళ్ళ కంపెనీ లో నే దొంగతనం చెయ్యాలి.చివరికి ఇంకొక చిన్న కంపెనీ లో నాకు జాబు వచ్చింది.చిన్నది అంటే నాకు కోపం వస్తుంది. IBM కన్నా కొద్దిగా చిన్నది.
ట్విస్ట్: మా హెచ్ ఆర్ చివరగా చెప్పిన మాట మీకు మన దేశ రాజధాని లో జాబు ఇస్తున్నాం. ఇది విని నవ్వాలో లేక ఇంకేం చెయ్యాలో అర్థం కాని పరిస్థితి.(ముందే చెప్పా కదా : జార్జి బుష్ ఆంధ్రా ప్రెసిడెంట్ అయినా, చంద్రబాబు యు ఎస్ ప్రెసిడెంట్ అయినా , రమణ గాడు హైదరాబాద్ దాటకూడదు ; ఇది పేరెంట్స్ ఆర్డర్ )తరవాత వాళ్లు అర్థం చేసుకున్నారు లెండి.
=====================
అలా మనకు ఒక చిన్న కంపెనీ లో జాబు వచ్చి 2 సంవత్సరాలు అయ్యింది.

No comments: