Wednesday, July 9, 2008

జ్ఞాపకాలు

అవునండి ఈ రోజేయ్ నాకు మా కంపెనీ లో సంవత్సరాలు పూర్తి అయ్యింది.ఒక్కసారి గతం లోకి వెళ్దాము. సంవత్సరాల క్రితం.
జూలై 8 ,2006
రాత్రి :11:45
స్థానం : ఢిల్లీ
రైల్వే స్టేషన్రైలు దిగిన తర్వాత ఫోన్ బూత్ కోసం వేట. మనకు ఫోన్ లేదు కదా.ఇంకొక విషయం మా చుట్టాలు ఢిల్లీ లో వున్నారు. మనకు హిందీ రాదు. పోనీ ఇంగ్లీష్ అయినా అంతే మనకు విజయవాడ స్టైల్ లో వచ్చు.ఇక ఆటో వాడిని అడిగితేయ్ స్టేషన్ నుండి ద్వారకా ,అదే నండీ మా అక్క వాళ్ల ప్లేస్..అక్కడికి 250 అడిగాడు. ఇంకొక 250 వీసుకుంటే మళ్లీ హైదరాబాద్ వెల్లిపోతాను కదా అనుకున్నా. అలా మన ఎంట్రన్స్ జరిగింది.
జూలై 9
వుదయం :8:00
మా బావ గారికి ఒక అనుమానం వచ్చింది.నీకు కంపెనీ చిరునామా తెలుసా అన్నారు. హ హ్హ హ్హ , ఈ మాత్రం తెలియకుండా వస్తానా అని నా ఆఫర్ లెటర్ తీసి చూపించా. దానిలో నాకు ఆక్సిడెంట్ఐతే ఏమి చేస్తారో రాసుంది కాని చిరునామా మాత్రం రాసి లేదు.మొదటి సారి నాకు కోపం వచ్చింది (నా మిద నాకు ).
ఇంతలోనే ఒక చిన్న ఐడియా , మన గూగుల్ వుంది కదా అని.నిజంగానే ఇది పని చేసింది. ఇక చూసు కొండి. నన్ను తీసుకుని ఒక కార్ లో మా అక్క వాళ్ల ఫ్యామిలీ మొత్తం నోయిడా వచారు. ఇన్తలో మా మేన కోడలికి ఒక చిన్న అనుమానం వచ్చింది ,మామయ్యా నీకు కార్ రాదా అని, రాదు అన్నాను. సైకిల్ వచ్చా అంది .వచ్చు అన్నాను. ఐతే కార్ కూడా వస్తుంది చాల సింపుల్ అంది.
========================
నోయిడా: క్లుప్తంగా :
రెండు వర్గాల ప్రజలు.
1.బాగా డబ్బు వున్నవాళ్ళు (సాఫ్ట్ వారె కంపెనీ లో చేసేవాళ్ళు )
2.పైన చెప్పిన వాళ్ల ఇంట్లో పని చేసే వాళ్లు
ఇంకా ఒక వైపు పెద్ద పెద్ద బుల్దింగ్స్. మరో వైపు కంపెనీ లు. నీను గమనించిన ముఖ్య విషయం రెండు కంపేనీలు మాత్రం ఎక్కడకు వెళ్ళినా కనపడతాయిHCL,CSC.కొన్ని చోట్ల కాదు కాదు చాల చోట్ల ఆ కంపెనీ ల కన్నా విజయవాడ ఆటో నగర్ 100 రెట్లు బెటర్. అంత చెత్త గా వుంటుంది. ఇంకా కొన్ని తుంటరి ఆలోచనలు కూడా వచాయి. అక్కడ చాల ఖాళి స్థలాలు వున్నాయి. మన హైదరాబాద్ నుండి రౌడీ లను తీసుకు వెళ్లి కబ్జా చేద్దామ్ కదా అని.ఇంకా ఇంట్రెస్ట్ విషయం : ఇక్కడ మన ఆంధ్ర ఆమ్మాయిలు : 90% బాగోరు 10 % చాలా బాగుంటారు చూడటానికి.అక్కడ 97% చాలా చాలా బాగుంటారు 3% అస్సలు బాగోరు .
కాని మన వాళ్ల ముఖం లో కళ వుంటుంది అది ఈ ప్రపంచంలో ఎవ్వరికీ వుండదు అని మా ఫ్రెండ్ పెద్ది గాడు చెప్పాడు లెండి (ఇక్కడికి తిరిగి వచ్చిన తర్వాత నా బాధ చూడలేక వాడు అలా చెప్పాడు. ఇప్పుడు ఇప్పుడే నేను మన గాల్స్ ని చూడగలుగు తున్నాను)వాడు చెప్పింది నిజమే.
ఇంకా అక్కడ జీవితం నాకు చాలా కృత్రిమమగా అని పించింది. నిజం చెప్పాలి అంటీ యు ఎస్ కి తక్కువ ,హైదరాబాద్ కి చాల చాలా ఎక్కువగా వుంది.అలా ఒక 6 నెలలు అక్కడ గడిపాను.
నాకు ఇంటర్ నుండి ఒక సందేహం వుండీది, మన హీరో ఇన్ లు వీసుకునే బట్టలు ఎవరు వీసుకుంటారు అని. నోయిడా లో నాకు సమాధానం దొరికింది.అక్కడ 80% అలాంటి సగం సగం బట్టలు వీసుకున్టారు.మిగతా వాళ్లు ఇంకా మారలేక మన గాల్స్ వేసుకుంటున్న పంజాబీ డ్రెస్ వేసుకుంటారు.మన ఆంధ్ర వాళ్లు అన్నింట్లో నార్త్ ని ఫాలో అవుతున్నారు కాబట్టి ఆ బట్టలు కూడా ఇక్కడికి త్వరలో దిగుమతి కావచు. ఇంకొక చిన్న వుదాహరణ మా పనిమనిషి లిప్ స్టిక్ వీసుకుని వచెది.ఇంకా rikshaw వాడు ఇన్ షర్టు వీసుకుంటాడు. ఈ వుదాహరణ చాలు అక్కడ సినిమాలు జనాల్ని ఎలా ప్రభావితం చేస్తున్న యో చెప్పటానికి.
అలా పిచి పిచి గా వుంటుంది నోయిడా లో . ఫుడ్ అంటారా ఒకే ఒక ఆంధ్ర మెస్ వుంది. వాడు మమ్మల్ని బతికించిన రోజులు చాలా వున్నాయి.
if anybody wants that Andhra mess num in Noida mail me @ramana_meet@yahoo.co.in.(tat number is still working, last week when I went Noida I got food from the same mess).

No comments: