Sunday, July 6, 2008

వర్షం

వర్షం
ఇది ఇప్పుడు మన ఆంధ్ర లో పెద్ద హాట్ టాపిక్ లెండి.వర్షాలు పడటం లేదు, కాబట్టి కరెంటు వుండటం లేదు.అలా హాట్ టాపిక్ అయ్యింది.
మన చిన్న ప్పుడు వర్షం పడాలని ప్రతి రోజు దేవుదుని కోరుకునెయ్ వాడిని, దేవుదితో ఇలా చెప్పే వాడిని, దేవుదా వర్షాలు బాగా పడాలి పంటలు బాగా పండాలి.బాగా పెద్ద పెద్ద వర్షాలు పడాలి అని మాత్రం చెప్పీవాడిని.కాని మనసులో మాత్రం మా బడి గ్రౌండ్ మునిగే తంటా పెద్ద వర్షం చాలు అని అనుకునే వాడిని.మీకు అర్థం అయ్యే వుంటుంది.మా గ్రౌండ్ మునిగితే మాకు హాలిడే కదా!కాని ఒక సంవత్సరం 1996 అనుకుంటా పెద్ద వర్షం...... చాలా పెద్ద వర్షం ,మా వూరిలో అందరి చెరువులూ పోయాయి.మావి కూడా.అంతే అదే చివరి సారి ఇంకెప్పుడూ అలా కూరుకో లేదు.
=======
మళ్లీ ఇప్పుడు ఈ హైదరాబాద్ లో అనిపిస్తుంది , ప్రతి రోజు కొద్దిగా వర్షం పడితే ,అది కూడా మనం ఆఫీసు నుండి ఇంటికి వెళ్తున్నప్పుడు ,అలా పడుతుంటే ...మనం కాబ్ విండో ఓపెన్ చేసి బయటకు చూస్తుంటే ...బయట ఒక అందమైన అమ్మాయి (కాదు కాదు చాలా మంది అందమైన అమ్మాయిలు) కనపడితే .......అబ్బా చాలా చాలా బాగుంటుంది. ఇది సినిమాలో కాపీ కొట్టింది కాదు మన సొంత అభిప్రాయం.
==========
కలాం గారు చెప్పారు , కలలు కనటం మానవద్దు అని ,నేను కూడా అంతే మానను ...ఎప్పుడైనా అలాంటి ఛాన్స్ వస్తుంది నాకు కూడా .......కాని మరింత త్వరగా రావాలని కూరుకుంటో ఈ రోజుకు శలవు.
=================
మరీ ఈ వెధవ రాత్రి పని (night shift)వల్ల బొత్తిగా కళా పోషణ లేకుండా పోతుంది.
ఇట్లు
రమణ

No comments: