అవునండి నిద్ర అంటే రాత్రి పూట మాత్రమే నిద్ర పోతారు అని చిన్న ప్పుడు అనుకునే వాడిని.
అనుకోవటం ఏమిటి! 6 వ తరగతి వరకు అసలు రాత్రి దూరదషన్ వార్తలు (తెలుగు వార్తలు ) చూడటం వెంటనే నిద్ర పోవటం.వీడు చిన్నప్పుడు వార్తలు ఏమిటి అని అనుకుంటున్నారా! 7 కి మన ట్యూషన్ అవుతుంది. ఇంటికి రాగానే టి వి లో వచ్చే ది మరి అది ఒక్కటే కదా. ఇంకా మా తాతయ్య కూడా అది చూసి నిద్ర పోయేవాడు.నాకు తెలిసి మా పల్లె టూరు లో అందరు అప్పుడే నిద్ర పోయే వారు. (మాది విజయవాడ దాటిన తర్వాత దివిసీమ అనే వూరు).ఇక 7th కి వచ్చిన తర్వాత ముందు స్కూల్ లో గొడవ, మీరు పెద్ద వాళ్లు అయిపోయారు, కాబట్టి 9 వరకు చదవాలి అని. ఇక్కడ ఇంట్లో కూడా గొడవ నువ్వు ఇప్పుడు చదివితే 8th,9th చదవక పోయినా పట్టించు కోము అని. ఇది నాకు చాలా బాగా నచ్చింది.అలా అలా మనం 508 మార్క్స్ సంపాదించాం.కాని స్కూల్ కి వెళ్ళిన తర్వాత తెలిసింది మనకన్నా ఎక్కువ వచ్చిన వాళ్లు చాలా మంది వున్నారు అని.అలా 7thలో నాకు తెలిసింది మా వూరిలో జనాలు రాత్రి 9వరకు లెగిసి వుంటారు అని.
ఇంక టెన్త్.ఇప్పుడు అందరి కళ్లు నా వైపే , నేనే చెప్పాను ఎలాగైనా మంచి మార్క్స్ తెచుకుంటాను అని. బాగా గుర్తు, అది కూడా Half-Yearly:N.S.పరీక్షా. నేను అన్ని రోజులు చదివింది మర్చి పోయా.నాకు చాలా ఆశ్చర్యం ఇంకా చాలా భయం వేసింది.మీరు వూహించేది కొద్దిగా నిజం మా ఫ్రెండ్స్ అందరు రాత్రి మొత్తం చదువుదాం అన్నారు
నేను కూడా సరే అని వాల్లతో కూర్చున్నాను.భయం వల్ల రాత్రి 2 వరకు వున్నాను.కాని మనకు నిద్ర ఆగదు కదా అలా 3 కి నిద్ర పోయా .ఆ రోజు తెలిసింది జనాలు రాత్రి 12:30వరకు లెగిసి వుంటారు అని.(మా ట్యూషన్ పక్కన ఒక సినిమా హాల్ వుంది, అప్పటి వరకు 2nd షో వుంటుంది అని తెలుసు కాని ఎప్పుడు అవుతుంది అని ఆలోచించలేదు, ఆ రోజు తెలిసింది 12:30కి అని ).ఇక ఇంటర్, ఇంజనీరింగ్ లో కూడా ఒక్కసారి కూడా రాత్రి మొత్తం మేలుకుని లేను.========================
ఇక మనం నోయిడా లో కూడా అలానే. కాని నా ఫ్లాట్ లో వుండే మిగతా వాళ్ళకి (మా కంపెనీ వాళ్లు ) రాత్రి వుద్యోగం వుండేది). నేను 11 అవ్వగానే పడుకునే వాడిని. నన్ను చూసి మిగతా వాళ్లు ( 4గురు) ఎప్పుడు యీదో వొకటి అనే వాళ్లు కాని నేను ఒక్క టే అనుకునే వాడిని :పిల్లి అరిచింది అని.మా శ్రీకాంత్ గాడు ఇంకొక అడుగు ముందుకు వేసి, నా ముందు carrom board పెట్టి నువ్వు గెలిస్తే ఆస్తా (Astha Singhal)నీది ,లేక పోతె అది నీ చెల్లి అనే వాడు. వాడి కోసం కాక పోయినా ఆస్తా కోసం కష్ట పడి రాత్రి వరకు వుండి వాడిని వోడించి ,నిద్ర పోయేవాడిని.(ఆస్తా :నా లవర్ ,నా సైడ్ మాత్రమే ;నాకు నోయిడా లో నచిన ఒకే ఒక రాజస్తాన్ పిల్ల, మా ఆఫీసులో నే)అలా నేను రాత్రి వరకు వుండే వాడిని.ఇక ఆస్తా కి ఏదో ఒకటి చెపుదాం అనుకున్న రోజు మా మేనేజర్ ఇచిన షాక్: రమణ నువ్వు హైదరాబాద్ కి వెళ్లి పొవచు.
ఇక హైదరాబాద్ వచ్చిన 6 నెలలకు తెలిసింది ,మనకు Nightshft వుండి అని. నీను కూడా చేయాలి అని.మొదటి రాత్రి చాలా బాగుంది. (Double meaning కి క్షమించండి ). కాని రెండవ రోజు నా వల్ల కాలేదు........కాని ఇప్పుడు మనం పూర్తిగా Nightshift లో వుంటున్నాం.
===========================
నా ఇంజనీరింగ్ వరకు అస్సలు పగలు నేను నిద్ర పోయిన రోజులు వేళ్ళ పైన లెక్క పెట్ట వచ్చు.అప్పుడు ఎవరైనా పగలు నిద్ర పొతే ,రాత్రి ఏమి పీకావ్ అని అడిగే వాడిని.ఇప్పుడు నాకు తెలుస్తూంది: ఏమైనా పీక వచ్చు అని!
========================
tats the end of Nidra...!