ఇది చాలా సరదాగా వుండే ప్రశ్న (నాకు మాతమే)
నేను చిన్నప్పుడు (మనం 3వ తరగతి):మా ఇంటి పక్కన ఒక ముసలమ్మ ఉండేది తను నన్ను అడిగేది :నువ్వు పెద్ద అయ్యిన తర్వాత ఏమి అవుతావు అని!(నిజం చెప్పాలంటే అంతకు ముందు ఎవరైనా అడిగారు ఏమో నాకు గుర్తు లేదు.కాని ఇది మాత్రం గుర్తు వుండటానికి ఒక కారణం వుంది. తనే నాకు జవాబు కూడా చెప్పింది కాబట్టి)
నా జవాబు: మాస్టర్ (మా మామయ్య మాస్టర్ ,అందుకని అలా చెప్పి వుంటా ను )
తన ప్రశ్న:Which subject?
జవాబు:లెక్కలు మనకు రావు :కాబట్టి లెక్కల మాస్టర్ కాదు.
ఆంగ్లము, హిందీ:అస్సలు తెలియదు కాబట్టి అది కూడా కాదు.
సైన్ , సోషల్:కష్టంగా వుంటాయి ,ఇవి కూడా కాదు.
ఇక మిగిలింది తెలుగు: పద్యాలు నా వల్ల అస్సలు కుదరదు
====================
చివరిగా తెలిసింది యీమిటి అంటే మాస్టర్ కావటం నా వల్ల అస్సలు కాదు.
========================
ఇంకా నా జవాబు : పోలీస్ (అప్పుడు పోలీస్ సినిమా అంటే చాలా ఇష్టం , వాళ్ల చేతిలో పిస్టల్ వుంటుంది కదా!)తన ప్రశ్న: మన వూరిలో పెద్ద పెద్ద రోవ్దిలు వున్నారు, మరి నీకు భయం లేదా అని!
మనం ఆలోచించాం: నిజమే మనకు చీకటి అంటే భయం అలాంటిది రౌడీ అంటే అమ్మో..!
ఇక నా జవాబు: lawyer :malle దొంగల భయం :
చిఅవరిగా మన జవాబు: మన వల్ల ఇంకా యీమి కావు , కాబట్టి మా వడ్రంగి [carpenter] పని చీసుకుంటా అని!=================
ట్విస్ట్: తను కూడా ఇదే కరెక్ట్ అని చెప్పింది.
కాని చివరకు తనని సొంత వాళ్లు ఇంట్లో నుండి తరిమి వేసారు.( ఇప్పటికి రోడ్ మీద ఎవరైనా పిచ్చి అమ్మాయ్ కనపడితే తనీనీమో అని చూస్తుంటాను, నేను 10 సంవత్సరాల క్రితం చూసాను.తను చూడటానికి కొద్దిగా పిచిగా వుంటుంది ,కాని తను నాకు ఇష్టం ).
==================================
ఇక స్కూల్ లో మళ్లీ అదే ప్రశ్న: నా పక్కన వాళ్లు అందరు యీదో వొకటి చెప్తున్నారు ,కాబట్టి నేను కూడా చెప్పే వాడిని.
వివరాలు:
6th Class:Lawyer
7th class:IAS
8TH:Police
9TH:Doctor
10th:Engineer(software అని చదువు కో గలరు).
ఇంజనీరింగ్ అయిపూయినప్పుడు కూడా అనుకున్నా ,నేను 10thలో అనుకున్నట్టు Software ఇంజనీర్ అవుతున్నాను అని.
=======================
కాని ఇప్పుడు తెలుస్తూంది :దేనికి పనికి రాకుండా పోయాను అని.
No comments:
Post a Comment