Monday, July 28, 2008

ఆటో

నేను మొదటి సారి విజయవాడ వచినప్పుడు నాకు చాలా చాలా బాగా నచిన vehicle :Auto.

నాకు చాలా సరదాగా వుండీది ఆటో లో తిరగటం అంటే. నేను అనుకునే వాడిని విజయవాడ వెళితే బాగుండు, ఆటో లో తిరగవచు అని!మా వూరిలో అస్సలు ఆటో లు లేవు లెండి. [ ఇది నేను 3వ తరగతి చదువు తున్నప్పుడు సంగతి.]

=================

మళ్లి మనం Inter చదవటం కోసం విజయవాడ వ చాం. అప్పుడు కూడా అనుకునే వాడిని "ఆటో లో వూరు మొత్తం తిరుగుదాము" అని. కాని తెలిసిందే కదా ఇంటర్ అంటే పెద్ద నరకం. బాగా చదవాలి, మంచి మార్కులు తెచ్చు కోవాలి.నా టార్గెట్ BITSPILANI లెండి. Inter 1st year:447 marks.అప్పుడు తెలిసింది అది మన వల్ల కాదు , మనకి యమ సెట్ [EAMCET] మాత్రమె దిక్కు అని.ఇంకా నా ఇంజనీరింగ్ కూడా అక్కడే కదా. కాని అప్పుడు మనం బస్ తప్ప మరొకటి ఎక్కటం జరగలిదు. అప్పుడప్పుడు bikes కూడా.

ఇంజనీరింగ్ లో నా రూట్ బందర్ road.

విజయవాడ తెలిసిన వాళ్ళకి ఇది బాగా సుపరిచితం. [తెలియని వాళ్ళకి : విజయవాడ లో 2 మెయిన్ రూట్ లు వుంటాయి. ఒకటి బందర్ road రెండు ఏలురు road.]నేను ఏలురు రోడ్ వెళ్ళింది ఆ 6 సంవత్సరాలు లో కేవలమ్ 3 సార్లు మాత్రమె.[అది కూడా మా వినేష్ (engineerng friend)గాడి ఇల్లు అటు వైపు కాబట్టి ].

===================================

ఒకసారి అనుకోకుండా అటు వెళ్ళాల్సి వచ్చింది ,మా ఫ్రెండ్స్ కూడా లేరు. ఇక చూసుకూండి ఒక ప్లేస్ కి బస్ లో వెళ్లాను అక్కడి నుండి ఇంకొక ప్లేస్ కి వెళ్ళాలి, అక్కడ బస్ లు కూడా సరిగ్గా రావు.[strike rate :Bunder road 1bus per 2 mins; Eluru road:1 bus per 20 mins-30 mins]

=======================

అప్పుడు మళ్లీ నాకు ఆటో గుర్తుకు వచ్చింది. వెళ్లి ఒక ఆటో వాడిని అడిగాను నాకు కావాల్సిన ప్లసుకి తీసుకు వెళ్ళమని, వాడు నన్ను చూసి 25 రూపాయలు అడిగాడు నేను మాములుగా 20 కి వస్తావా అన్నాను. వాడు కుదరదు సర్ అన్నాడు. దూరమీమో అనుకుని సరే అన్నాను. కాని నన్ను 4 నిముశాలులో అక్కడకు తీసుకు వెళ్ళాడు.

====================

అప్పుడు అనుకున్నా "నేను నిజంగా ఆటో లో విజయవాడ మొత్తం తిరగాలి అంటే మనకు వున్నా ఇల్లు ,ఇంకా మా పక్కింటి వాళ్ల ఇల్లు అమ్మేస్తే ఆ డబ్బులు సరిపోతాయా అని!"

==================

ఇప్పుడు మా వూరు వెళదాము అదేనండి దివిసీమ. పోయిన సంవత్సరం నాకు అవసరం అయ్యి పక్కన వున్నా పల్లెతూరుకి బయలుదేరా, టైంకి మా బైక్ కూడా లేదు, ఇక బస్ మాత్రమె దిక్కు పైగా వర్షం పడుతుంది, ఎలా దీవుడా అనుకుంటున్నప్పుడు నా ఎదురుగా ఒక ఆటో ప్రత్యక్షం అయ్యింది.వాడిని అడిగాను , బాబు నేను xxxx పల్లెటూరికి వెళ్ళాలి అని. వాడు చెప్పాడు : "సర్ ఇది sharing auto".

సరే బాబు నన్ను అక్కడికి తీసుకు వెళ్ళు చాలు అన్నాను.(నిజం చెప్పాలంటే నాకు పల్లెటూరు మనుషుల్ని చెయ్యటం ఇష్టం.)కాని 10 నిముషాలు గడిచినా ఎవ్వరూ రారే!. ఇక నేను వుండలీక అంతనితో చెప్పాను , బాబు నేను తొందరగా వెళ్ళాలి , మొత్తం డబ్బులు నేను ఇస్తాను ,వెళ్లి పూదాం పద అని. తను మాత్రం అస్సలు కుదరదు సర్, జనాలు లేకున్దా ఆటో కదలదు అని అన్నాడు. నాకు నవ్వు వచ్చింది ,నీకు కావాల్సింది నేను ఇస్తాను , నన్ను తీసుకు వెళ్ళవయ్యా బాబు అని అన్నా కాని వినిపించు కోలీదు. ఇక యీమి ఎవరో ఒక father n his two childs ని నేను రిక్వెస్ట్ చేసి వాళ్లకు కూడా నేనె డబ్బులు కట్టి ఆ ఊరికి తీసుకుని వెళ్లాను.
======================================
ఇక మన హైదరాబాద్ 7 seater autos.
ఎక్కడ కావాలంటే అక్కడ ఆపుతారు. ఎక్కడ కావాలంటే అక్కడ దింపుతారు. చిన్న ఆటో ల గురింహి చెప్పనవసరం లేదు. ఈ మధ్యన ఒక sports channel చూసినప్పు నాకు ఒక కొత్త విషయం తెలిసింది. ఇది కనుక మన రెడ్డి గారు కాని బాబు గారు కాని వింటే మన హైదరాబాద్ కి ఇంకొక విషయం లో కూడా బాగా పేరు వస్తుంది.
అదే F1 Race.
మన ఆటో డ్రైవర్స్ కి మాత్రం యేమి తక్కువండి ? 40 km తో వెళ్ళాల్సిన ఆటో ని 60 km తో పూనిస్తారు. యెంత ట్రాఫిక్ వున్నా కాని వాటి మధ్యలో నుండి అందరినీ దాటుకుని వెళ్తారు.ఎవరైనా overtake చేస్తె వాళ్ళని ఎలాగైనా దాటుకుని వెళ్తారు.కాబట్టి వాళ్ళకి సరి ఐన training ఇస్తే వాళ్లు F1 race లో మనకు వొద్దు వొద్దు అన్నా కాని, చాలా చాలా కప్పులు తీసుకుని వస్తారు.
Please spread this message to your friends.Finally it may reach Babu/Reddy/Chiru.

Thursday, July 17, 2008

నేను ఏమి అవుతాను అంటే .........!.....?.......!!!!?

ఇది చాలా సరదాగా వుండే ప్రశ్న (నాకు మాతమే)
నేను చిన్నప్పుడు (మనం 3వ తరగతి):మా ఇంటి పక్కన ఒక ముసలమ్మ ఉండేది తను నన్ను అడిగేది :నువ్వు పెద్ద అయ్యిన తర్వాత ఏమి అవుతావు అని!(నిజం చెప్పాలంటే అంతకు ముందు ఎవరైనా అడిగారు ఏమో నాకు గుర్తు లేదు.కాని ఇది మాత్రం గుర్తు వుండటానికి ఒక కారణం వుంది. తనే నాకు జవాబు కూడా చెప్పింది కాబట్టి)
నా జవాబు: మాస్టర్ (మా మామయ్య మాస్టర్ ,అందుకని అలా చెప్పి వుంటా ను )
తన ప్రశ్న:Which subject?
జవాబు:లెక్కలు మనకు రావు :కాబట్టి లెక్కల మాస్టర్ కాదు.
ఆంగ్లము, హిందీ:అస్సలు తెలియదు కాబట్టి అది కూడా కాదు.
సైన్ , సోషల్:కష్టంగా వుంటాయి ,ఇవి కూడా కాదు.
ఇక మిగిలింది తెలుగు: పద్యాలు నా వల్ల అస్సలు కుదరదు
====================
చివరిగా తెలిసింది యీమిటి అంటే మాస్టర్ కావటం నా వల్ల అస్సలు కాదు.
========================
ఇంకా నా జవాబు : పోలీస్ (అప్పుడు పోలీస్ సినిమా అంటే చాలా ఇష్టం , వాళ్ల చేతిలో పిస్టల్ వుంటుంది కదా!)తన ప్రశ్న: మన వూరిలో పెద్ద పెద్ద రోవ్దిలు వున్నారు, మరి నీకు భయం లేదా అని!
మనం ఆలోచించాం: నిజమే మనకు చీకటి అంటే భయం అలాంటిది రౌడీ అంటే అమ్మో..!
ఇక నా జవాబు: lawyer :malle దొంగల భయం :
చిఅవరిగా మన జవాబు: మన వల్ల ఇంకా యీమి కావు , కాబట్టి మా వడ్రంగి [carpenter] పని చీసుకుంటా అని!=================
ట్విస్ట్: తను కూడా ఇదే కరెక్ట్ అని చెప్పింది.
కాని చివరకు తనని సొంత వాళ్లు ఇంట్లో నుండి తరిమి వేసారు.( ఇప్పటికి రోడ్ మీద ఎవరైనా పిచ్చి అమ్మాయ్ కనపడితే తనీనీమో అని చూస్తుంటాను, నేను 10 సంవత్సరాల క్రితం చూసాను.తను చూడటానికి కొద్దిగా పిచిగా వుంటుంది ,కాని తను నాకు ఇష్టం ).
==================================
ఇక స్కూల్ లో మళ్లీ అదే ప్రశ్న: నా పక్కన వాళ్లు అందరు యీదో వొకటి చెప్తున్నారు ,కాబట్టి నేను కూడా చెప్పే వాడిని.
వివరాలు:
6th Class:Lawyer
7th class:IAS
8TH:Police
9TH:Doctor
10th:Engineer(software అని చదువు కో గలరు).

ఇంజనీరింగ్ అయిపూయినప్పుడు కూడా అనుకున్నా ,నేను 10thలో అనుకున్నట్టు Software ఇంజనీర్ అవుతున్నాను అని.
=======================
కాని ఇప్పుడు తెలుస్తూంది :దేనికి పనికి రాకుండా పోయాను అని.

Sunday, July 13, 2008

నిద్ర.....నిజమే నిద్ర

అవునండి నిద్ర అంటే రాత్రి పూట మాత్రమే నిద్ర పోతారు అని చిన్న ప్పుడు అనుకునే వాడిని.

అనుకోవటం ఏమిటి! 6 వ తరగతి వరకు అసలు రాత్రి దూరదషన్ వార్తలు (తెలుగు వార్తలు ) చూడటం వెంటనే నిద్ర పోవటం.వీడు చిన్నప్పుడు వార్తలు ఏమిటి అని అనుకుంటున్నారా! 7 కి మన ట్యూషన్ అవుతుంది. ఇంటికి రాగానే టి వి లో వచ్చే ది మరి అది ఒక్కటే కదా. ఇంకా మా తాతయ్య కూడా అది చూసి నిద్ర పోయేవాడు.నాకు తెలిసి మా పల్లె టూరు లో అందరు అప్పుడే నిద్ర పోయే వారు. (మాది విజయవాడ దాటిన తర్వాత దివిసీమ అనే వూరు).ఇక 7th కి వచ్చిన తర్వాత ముందు స్కూల్ లో గొడవ, మీరు పెద్ద వాళ్లు అయిపోయారు, కాబట్టి 9 వరకు చదవాలి అని. ఇక్కడ ఇంట్లో కూడా గొడవ నువ్వు ఇప్పుడు చదివితే 8th,9th చదవక పోయినా పట్టించు కోము అని. ఇది నాకు చాలా బాగా నచ్చింది.అలా అలా మనం 508 మార్క్స్ సంపాదించాం.కాని స్కూల్ కి వెళ్ళిన తర్వాత తెలిసింది మనకన్నా ఎక్కువ వచ్చిన వాళ్లు చాలా మంది వున్నారు అని.అలా 7thలో నాకు తెలిసింది మా వూరిలో జనాలు రాత్రి 9వరకు లెగిసి వుంటారు అని.

ఇంక టెన్త్.ఇప్పుడు అందరి కళ్లు నా వైపే , నేనే చెప్పాను ఎలాగైనా మంచి మార్క్స్ తెచుకుంటాను అని. బాగా గుర్తు, అది కూడా Half-Yearly:N.S.పరీక్షా. నేను అన్ని రోజులు చదివింది మర్చి పోయా.నాకు చాలా ఆశ్చర్యం ఇంకా చాలా భయం వేసింది.మీరు వూహించేది కొద్దిగా నిజం మా ఫ్రెండ్స్ అందరు రాత్రి మొత్తం చదువుదాం అన్నారు

నేను కూడా సరే అని వాల్లతో కూర్చున్నాను.భయం వల్ల రాత్రి 2 వరకు వున్నాను.కాని మనకు నిద్ర ఆగదు కదా అలా 3 కి నిద్ర పోయా .ఆ రోజు తెలిసింది జనాలు రాత్రి 12:30వరకు లెగిసి వుంటారు అని.(మా ట్యూషన్ పక్కన ఒక సినిమా హాల్ వుంది, అప్పటి వరకు 2nd షో వుంటుంది అని తెలుసు కాని ఎప్పుడు అవుతుంది అని ఆలోచించలేదు, ఆ రోజు తెలిసింది 12:30కి అని ).ఇక ఇంటర్, ఇంజనీరింగ్ లో కూడా ఒక్కసారి కూడా రాత్రి మొత్తం మేలుకుని లేను.
========================
ఇక మనం నోయిడా లో కూడా అలానే. కాని నా ఫ్లాట్ లో వుండే మిగతా వాళ్ళకి (మా కంపెనీ వాళ్లు ) రాత్రి వుద్యోగం వుండేది). నేను 11 అవ్వగానే పడుకునే వాడిని. నన్ను చూసి మిగతా వాళ్లు ( 4గురు) ఎప్పుడు యీదో వొకటి అనే వాళ్లు కాని నేను ఒక్క టే అనుకునే వాడిని :పిల్లి అరిచింది అని.మా శ్రీకాంత్ గాడు ఇంకొక అడుగు ముందుకు వేసి, నా ముందు carrom board పెట్టి నువ్వు గెలిస్తే ఆస్తా (Astha Singhal)నీది ,లేక పోతె అది నీ చెల్లి అనే వాడు. వాడి కోసం కాక పోయినా ఆస్తా కోసం కష్ట పడి రాత్రి వరకు వుండి వాడిని వోడించి ,నిద్ర పోయేవాడిని.(ఆస్తా :నా లవర్ ,నా సైడ్ మాత్రమే ;నాకు నోయిడా లో నచిన ఒకే ఒక రాజస్తాన్ పిల్ల, మా ఆఫీసులో నే)అలా నేను రాత్రి వరకు వుండే వాడిని.ఇక ఆస్తా కి ఏదో ఒకటి చెపుదాం అనుకున్న రోజు మా మేనేజర్ ఇచిన షాక్: రమణ నువ్వు హైదరాబాద్ కి వెళ్లి పొవచు.
ఇక హైదరాబాద్ వచ్చిన 6 నెలలకు తెలిసింది ,మనకు Nightshft వుండి అని. నీను కూడా చేయాలి అని.మొదటి రాత్రి చాలా బాగుంది. (Double meaning కి క్షమించండి ). కాని రెండవ రోజు నా వల్ల కాలేదు........కాని ఇప్పుడు మనం పూర్తిగా Nightshift లో వుంటున్నాం.
===========================
నా ఇంజనీరింగ్ వరకు అస్సలు పగలు నేను నిద్ర పోయిన రోజులు వేళ్ళ పైన లెక్క పెట్ట వచ్చు.అప్పుడు ఎవరైనా పగలు నిద్ర పొతే ,రాత్రి ఏమి పీకావ్ అని అడిగే వాడిని.ఇప్పుడు నాకు తెలుస్తూంది: ఏమైనా పీక వచ్చు అని!
========================
tats the end of Nidra...!

Wednesday, July 9, 2008

జ్ఞాపకాలు

అవునండి ఈ రోజేయ్ నాకు మా కంపెనీ లో సంవత్సరాలు పూర్తి అయ్యింది.ఒక్కసారి గతం లోకి వెళ్దాము. సంవత్సరాల క్రితం.
జూలై 8 ,2006
రాత్రి :11:45
స్థానం : ఢిల్లీ
రైల్వే స్టేషన్రైలు దిగిన తర్వాత ఫోన్ బూత్ కోసం వేట. మనకు ఫోన్ లేదు కదా.ఇంకొక విషయం మా చుట్టాలు ఢిల్లీ లో వున్నారు. మనకు హిందీ రాదు. పోనీ ఇంగ్లీష్ అయినా అంతే మనకు విజయవాడ స్టైల్ లో వచ్చు.ఇక ఆటో వాడిని అడిగితేయ్ స్టేషన్ నుండి ద్వారకా ,అదే నండీ మా అక్క వాళ్ల ప్లేస్..అక్కడికి 250 అడిగాడు. ఇంకొక 250 వీసుకుంటే మళ్లీ హైదరాబాద్ వెల్లిపోతాను కదా అనుకున్నా. అలా మన ఎంట్రన్స్ జరిగింది.
జూలై 9
వుదయం :8:00
మా బావ గారికి ఒక అనుమానం వచ్చింది.నీకు కంపెనీ చిరునామా తెలుసా అన్నారు. హ హ్హ హ్హ , ఈ మాత్రం తెలియకుండా వస్తానా అని నా ఆఫర్ లెటర్ తీసి చూపించా. దానిలో నాకు ఆక్సిడెంట్ఐతే ఏమి చేస్తారో రాసుంది కాని చిరునామా మాత్రం రాసి లేదు.మొదటి సారి నాకు కోపం వచ్చింది (నా మిద నాకు ).
ఇంతలోనే ఒక చిన్న ఐడియా , మన గూగుల్ వుంది కదా అని.నిజంగానే ఇది పని చేసింది. ఇక చూసు కొండి. నన్ను తీసుకుని ఒక కార్ లో మా అక్క వాళ్ల ఫ్యామిలీ మొత్తం నోయిడా వచారు. ఇన్తలో మా మేన కోడలికి ఒక చిన్న అనుమానం వచ్చింది ,మామయ్యా నీకు కార్ రాదా అని, రాదు అన్నాను. సైకిల్ వచ్చా అంది .వచ్చు అన్నాను. ఐతే కార్ కూడా వస్తుంది చాల సింపుల్ అంది.
========================
నోయిడా: క్లుప్తంగా :
రెండు వర్గాల ప్రజలు.
1.బాగా డబ్బు వున్నవాళ్ళు (సాఫ్ట్ వారె కంపెనీ లో చేసేవాళ్ళు )
2.పైన చెప్పిన వాళ్ల ఇంట్లో పని చేసే వాళ్లు
ఇంకా ఒక వైపు పెద్ద పెద్ద బుల్దింగ్స్. మరో వైపు కంపెనీ లు. నీను గమనించిన ముఖ్య విషయం రెండు కంపేనీలు మాత్రం ఎక్కడకు వెళ్ళినా కనపడతాయిHCL,CSC.కొన్ని చోట్ల కాదు కాదు చాల చోట్ల ఆ కంపెనీ ల కన్నా విజయవాడ ఆటో నగర్ 100 రెట్లు బెటర్. అంత చెత్త గా వుంటుంది. ఇంకా కొన్ని తుంటరి ఆలోచనలు కూడా వచాయి. అక్కడ చాల ఖాళి స్థలాలు వున్నాయి. మన హైదరాబాద్ నుండి రౌడీ లను తీసుకు వెళ్లి కబ్జా చేద్దామ్ కదా అని.ఇంకా ఇంట్రెస్ట్ విషయం : ఇక్కడ మన ఆంధ్ర ఆమ్మాయిలు : 90% బాగోరు 10 % చాలా బాగుంటారు చూడటానికి.అక్కడ 97% చాలా చాలా బాగుంటారు 3% అస్సలు బాగోరు .
కాని మన వాళ్ల ముఖం లో కళ వుంటుంది అది ఈ ప్రపంచంలో ఎవ్వరికీ వుండదు అని మా ఫ్రెండ్ పెద్ది గాడు చెప్పాడు లెండి (ఇక్కడికి తిరిగి వచ్చిన తర్వాత నా బాధ చూడలేక వాడు అలా చెప్పాడు. ఇప్పుడు ఇప్పుడే నేను మన గాల్స్ ని చూడగలుగు తున్నాను)వాడు చెప్పింది నిజమే.
ఇంకా అక్కడ జీవితం నాకు చాలా కృత్రిమమగా అని పించింది. నిజం చెప్పాలి అంటీ యు ఎస్ కి తక్కువ ,హైదరాబాద్ కి చాల చాలా ఎక్కువగా వుంది.అలా ఒక 6 నెలలు అక్కడ గడిపాను.
నాకు ఇంటర్ నుండి ఒక సందేహం వుండీది, మన హీరో ఇన్ లు వీసుకునే బట్టలు ఎవరు వీసుకుంటారు అని. నోయిడా లో నాకు సమాధానం దొరికింది.అక్కడ 80% అలాంటి సగం సగం బట్టలు వీసుకున్టారు.మిగతా వాళ్లు ఇంకా మారలేక మన గాల్స్ వేసుకుంటున్న పంజాబీ డ్రెస్ వేసుకుంటారు.మన ఆంధ్ర వాళ్లు అన్నింట్లో నార్త్ ని ఫాలో అవుతున్నారు కాబట్టి ఆ బట్టలు కూడా ఇక్కడికి త్వరలో దిగుమతి కావచు. ఇంకొక చిన్న వుదాహరణ మా పనిమనిషి లిప్ స్టిక్ వీసుకుని వచెది.ఇంకా rikshaw వాడు ఇన్ షర్టు వీసుకుంటాడు. ఈ వుదాహరణ చాలు అక్కడ సినిమాలు జనాల్ని ఎలా ప్రభావితం చేస్తున్న యో చెప్పటానికి.
అలా పిచి పిచి గా వుంటుంది నోయిడా లో . ఫుడ్ అంటారా ఒకే ఒక ఆంధ్ర మెస్ వుంది. వాడు మమ్మల్ని బతికించిన రోజులు చాలా వున్నాయి.
if anybody wants that Andhra mess num in Noida mail me @ramana_meet@yahoo.co.in.(tat number is still working, last week when I went Noida I got food from the same mess).

Sunday, July 6, 2008

వర్షం

వర్షం
ఇది ఇప్పుడు మన ఆంధ్ర లో పెద్ద హాట్ టాపిక్ లెండి.వర్షాలు పడటం లేదు, కాబట్టి కరెంటు వుండటం లేదు.అలా హాట్ టాపిక్ అయ్యింది.
మన చిన్న ప్పుడు వర్షం పడాలని ప్రతి రోజు దేవుదుని కోరుకునెయ్ వాడిని, దేవుదితో ఇలా చెప్పే వాడిని, దేవుదా వర్షాలు బాగా పడాలి పంటలు బాగా పండాలి.బాగా పెద్ద పెద్ద వర్షాలు పడాలి అని మాత్రం చెప్పీవాడిని.కాని మనసులో మాత్రం మా బడి గ్రౌండ్ మునిగే తంటా పెద్ద వర్షం చాలు అని అనుకునే వాడిని.మీకు అర్థం అయ్యే వుంటుంది.మా గ్రౌండ్ మునిగితే మాకు హాలిడే కదా!కాని ఒక సంవత్సరం 1996 అనుకుంటా పెద్ద వర్షం...... చాలా పెద్ద వర్షం ,మా వూరిలో అందరి చెరువులూ పోయాయి.మావి కూడా.అంతే అదే చివరి సారి ఇంకెప్పుడూ అలా కూరుకో లేదు.
=======
మళ్లీ ఇప్పుడు ఈ హైదరాబాద్ లో అనిపిస్తుంది , ప్రతి రోజు కొద్దిగా వర్షం పడితే ,అది కూడా మనం ఆఫీసు నుండి ఇంటికి వెళ్తున్నప్పుడు ,అలా పడుతుంటే ...మనం కాబ్ విండో ఓపెన్ చేసి బయటకు చూస్తుంటే ...బయట ఒక అందమైన అమ్మాయి (కాదు కాదు చాలా మంది అందమైన అమ్మాయిలు) కనపడితే .......అబ్బా చాలా చాలా బాగుంటుంది. ఇది సినిమాలో కాపీ కొట్టింది కాదు మన సొంత అభిప్రాయం.
==========
కలాం గారు చెప్పారు , కలలు కనటం మానవద్దు అని ,నేను కూడా అంతే మానను ...ఎప్పుడైనా అలాంటి ఛాన్స్ వస్తుంది నాకు కూడా .......కాని మరింత త్వరగా రావాలని కూరుకుంటో ఈ రోజుకు శలవు.
=================
మరీ ఈ వెధవ రాత్రి పని (night shift)వల్ల బొత్తిగా కళా పోషణ లేకుండా పోతుంది.
ఇట్లు
రమణ

Saturday, July 5, 2008

అలా హైదరాబాద్ వచ్చిన 2 వారాలకి ఒక జాబు ఫెయిర్ జరగటం, నేను వాళ్ళని లోకల్ కంపెనీ కదా అని అడిగి మరీ నా రెసుమే ఇచ్చాను.(పేరెంట్స్ కండిషన్ :హైదరాబాద్ దాటి బయటకు వెళ్లొద్దు అని).
అక్కడ .నెట్ ట్రైనింగ్ సెంటర్ లో కొత్త కష్టాలు. మనం 50 మంది వున్న క్లాసు రూమ్ లో నే పాఠాలు వినం. కాని ఇక్కడ మా ఊరి అమ్మవారి జాతర లో వున్నట్లు టన్నుల కొద్దీ జనాలు. (అయినా బాగానే వుంది లెండి కంటికి ఇంపుగా అమ్మాయిలు). మళ్ళి ఒక పక్కన , ఎదురుగా వున్న అమ్మాయిని చూడాలని అనిపిస్తుంది, ఇంకొక పక్కన జాబు రాలీదు అన్న బాధ. నిజం చెప్పాలి అంటే మా కాలేజీ లో 7 కాంపస్ ఇంటర్వియూస్ ఫెయిల్ అయినప్పుడు కూడా ఇంతలా ఫీల్ అవ్వలేదు.
ఈ లోపు మనకు 2 కంపెనీ ల నుండి కాల్స్, ఇంటర్వ్యూ కి రా అని.మీకు చెప్పటం మర్చి పోయా ఒక కంపెనీ పేరు చందమామ....... సోలుషన్స్ (పేరు మార్చటం అయినది).చాలా అందమైన పేరు(మీరు కూడా వొప్పు కూండి).వీళ్ళు బయట x రేట్ కి దొరికేయి కోర్సుని 3x రేట్ కి మనకు చెపుతారు అంట.ఇంకా మనల్ని కొన్ని కంపెనీ ల ఇంటర్వియూస్ కి పంపిస్తారు అట.కాని వీళ్ళకు తెలియని విషయం ఒకటి వుంది నా దగ్గర X కూడా కష్టం ఇంకా 3X కావాలంటే నేను వీళ్ళ కంపెనీ లో నే దొంగతనం చెయ్యాలి.చివరికి ఇంకొక చిన్న కంపెనీ లో నాకు జాబు వచ్చింది.చిన్నది అంటే నాకు కోపం వస్తుంది. IBM కన్నా కొద్దిగా చిన్నది.
ట్విస్ట్: మా హెచ్ ఆర్ చివరగా చెప్పిన మాట మీకు మన దేశ రాజధాని లో జాబు ఇస్తున్నాం. ఇది విని నవ్వాలో లేక ఇంకేం చెయ్యాలో అర్థం కాని పరిస్థితి.(ముందే చెప్పా కదా : జార్జి బుష్ ఆంధ్రా ప్రెసిడెంట్ అయినా, చంద్రబాబు యు ఎస్ ప్రెసిడెంట్ అయినా , రమణ గాడు హైదరాబాద్ దాటకూడదు ; ఇది పేరెంట్స్ ఆర్డర్ )తరవాత వాళ్లు అర్థం చేసుకున్నారు లెండి.
=====================
అలా మనకు ఒక చిన్న కంపెనీ లో జాబు వచ్చి 2 సంవత్సరాలు అయ్యింది.

Friday, July 4, 2008

2 సంవత్సరాలు వయస్సు

అవునా , నిజమీనా అనిపిస్తూంది.కాని కొన్ని నిజాలు అలానే వుంటాయి.ఇంతకూ నీను చెప్పీది నాకు ఈ జాబు వచ్చి 2 సంవత్సరాలు అయ్యింది అని.
సరిగ్గా 2 యేల్ల క్రితం జాబు వస్తెయ్ చాలు దేవుధా తిరుపతి వచ్చి నావి నా ఫ్రెండ్ పెద్ది గాడివి తలనీలాలు ఇస్తాను అని మొక్కుకునే వాడిని.ఇంకా మన అమీర్ పేత్ మైత్రివనంలో ఒక కోర్సు కూడా చేరాను.
ఇంతకూ నా గూరిచి చెప్పలేదు కదా, రమణ ఇంజనీరింగ్ 2006 పాస్ ఔట్ ఎవరు అడిగినా అడగక పోయినా సిద్దార్థ విజయవాడ అని చెప్పటం నా అలవాటు(ఇప్పటికి కూడా).
ఈ స్టేట్లో అందరి స్టూడెంట్స్ లాగానే నేను కూడా ఒక సాఫ్ట్వేర్ జాబు సంపాదిద్దాం అని కలలు కంటూ మన రాజధానికి వచేసాను.కాని వచ్చిన తర్వాత తెలిసింది, దీనికి డబ్బు+తెలిసిన వాళ్లు+అదృష్టం ఈమూడు కావాలని.కాని యేమి చేస్తాము మనకు ఇవి మాత్రమే లేవు.అయినా ఒక నమ్మకం వుంది. మనకు జాబు రాక పోయినా యేదో ఒక ఇంజనీరింగ్ కాలేజీ లో లెక్చరర్ కావచ్చు అని.
నిద్ర వస్తుంది, మిగతాది ఇంకొకసారి.......