Monday, April 9, 2018

నా corporate కథలు... Bench కష్టాలు 1 .......(1.Attitude is life)

ఇప్పటి వరకు కొన్ని Corporate Companies లో పని చేసాను.ఆ అనుభవాలు కొన్ని విచిత్రంగా, ఇంకొన్ని వింతగా , వినటానికే ఏదోలా...... ఉన్నాయి. వాటిలో కొన్ని........

XYZ అనే company లో కొత్తగా join అయ్యాను,మొదటి రోజు స్కూల్ కి వెళ్ళే పిల్లాడిలా తయ్యారు అయ్యి,company లో కి వెళ్లాను.అసలే ఈ corporate company  ఒక గవర్నమెంట్ కంపెనీ అని బయట పెద్ద talk.ఎలా ఉంటుందా! ఎవరు ఉంటారు ? ఎలా రిసీవ్ చేసుకుంటారు! అని వంద సందేహాలతో లోపలకి వెళ్లాను.
అయినా నేను fresherని కాను , నేను ఎందుకు భయపడాలి! అని కూడా అనుకున్నాను.

Day 1:
Resource Manager ని కలిసాను.వారు వెంటనే  మీలాగా కొత్తగా వచ్చిన వారికి ఒక మీటింగ్ ఉంది at 11am. దానికి రండి.మనం మాట్లాడుకుందాం అన్నారు.మొదటి సారిగా నాకు పట్టరాని సంతోషం వేసింది."ఇన్నాళ్ళు ఏ మేనేజర్ ని చూసినా పరాయి భాషలో(Hindi/English) మాట్లాడే వాడే! మొదటి సారి ఒక తెలుగు లో మాట్లాడే మేనేజర్ ని చూసాను".చాలా బాగుంది అనిపించింది.

12:30pm.. నిజమే నండి. మేనేజర్ గారు బిజీ ,అందువల్ల మా మీటింగ్  12:30కి స్టార్ట్ అయ్యింది.వారు చెప్పిన మాటలు మంత్రాల లాగా నా చెవిలో ఇంకా మార్మోగి పోతున్నాయి.
1.మీకు ప్రస్తుతానికి Project లేదు. కాబట్టి ప్రస్తుతానికి Benchలో ఉండండి.
2.ఈ సమయాన్ని బాగా సద్వినియోగం చెయ్యండి.బాగా చదవండి.trainings కి అటెండ్ అవ్వండి. certifications రాయండి.
3.మీరు పని చెయ్యలేక పోయినా నేను పట్టించుకోను, కాని  Attitude లేక పొతే మాత్రం నేను ఒప్పుకోను.
4.మీరు మంచి ఆటిట్యూడ్తో మా company లోకి రండి, ఇక్కడ ఈ రూం లో ఉన్న అందరిని ఇంకో 4 ఏళ్లలో పర దేశానికి (విదేశి యానానికి ) పంపించే బాధ్యతా నాది.
5.Attitude is life.
6.All the best

మనకి చాలా projects ఉన్నాయి.మంచి ప్రాజెక్ట్ వస్తే నేను మిమ్మల్ని పిలుస్తాను.
రోజు మన ఆఫీసు లైబ్రరీలో చదువుకోండి , Morning and evening నా రూం కి వచ్చి  Attendence సంతకం పెట్టి వెళ్ళండి అన్నారు.హమ్మయ్య ఒక మంచి వ్యక్తి చేతిలో మన Future ఉంది అనుకున్నాను.

ఆ రూం లో నా technology మీద వచ్చిన ఇంకో ముగ్గురు (2 guys and 1 girl)పరిచయం అయ్యారు. వారితో ఏమి మాట్లాడాలో అర్థం కాక ఇలా అన్నాను , "మనం ఇవ్వాళే వచ్చాం  కదా, మనకు ఇంకో రెండు రోజుల్లొ project వచేస్తుంది అని".
వాళ్ళు పెద్దగా నవ్వి , మేము వారం క్రితం వచ్చాం అప్పటినుండి ఇలానే చెపుతున్నాడు. ఆ కనపడే చెట్టు కింద మన technology మీద ఇక్కడకు వచ్చిన వాళ్ళు ఇంకా 10 మంది ఉన్నారు వాళ్ళు వచ్చి 2 నెలలు అవుతుంది అన్నారు...........కిం కర్తవ్యమ్ ? అని వాళ్ళనే అడిగాను.వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ప్రతి గురువారం మేము ఆఫీసుకి వచ్చి ఆయనకు కనపడితే చాలు. మిగతా రొజుల్లో పట్టించుకోరు.ఇవ్వాళ గురువారం కాబట్టి వాళ్ళు అందరు వచ్చారు, లేక పొతే వాళ్ళు ఎవ్వరు కనపడరు.

ఐతే నేను మాత్రం మాములుగా వస్తాను అని అన్నాను.వాళ్ళు నీ ఇష్టం అని ఒక పిచ్చ చూపు చూసారు.ఒక రెండు వారాలు continueగా ఆఫీసుకి వెళ్ళిన తర్వాత నాకు జ్ఞానోదయం అయ్యింది. నేను వాళ్ళ లో  join అయ్యాను....అనగా ఆఫీసుకి గురువారం మాత్రమె వెళ్ళాలి.

అలా నేను Bench మీద ఒక 3 నెలలు ఉండాల్సి వచ్చింది.అనగా అర్థం చేసుకోండి ......2 weeks + 10 రోజులు(out of 3 months) ఆఫీసు కి వెళ్ళాల్సి వచ్చింది.

No comments: