Monday, April 9, 2018

నా corporate కథలు... 2.Bench కష్టాలు Part 3

                                                                  ఒక Friday evening Resource Manager Assistant నుండి కాల్ వచ్చింది.సారాంశం : Monday morning at 11am వచ్చి కలువు అని.ఆ రోజు వారి దర్సనం కాగానే , evening శాంతి గారిని కలువు అన్నారు.అలానే వెళ్లాను.శాంతి గారు ఒక పెద్ద list of technologies ఇచ్చారు. ఇవన్ని వచ్చా నీకు అన్నారు?వాటిలో 60% వరకు వచ్చు.మిగతావి నాకు రావు అన్నాను.సరే మిగతా వాటి గురించి నేను చూసుకుంటాను , ముందు నీకు వచ్చినవి మళ్లీ చదువుకుని రా అన్నారు.మిగతా 40% ఈ క్రింద links లో చదువు అని ఒక మెయిల్ పంపించారు.ఆనందంగా ఆ links click చేస్తే అవన్నీWikiPedia కి దారి తీసాయి.వాటిని చూసి , బూతులు తిట్టలేక , ఆమెకు technology గురించి వివరించలేక interview ఎప్పుడు? అని అడిగాను.Next day , interview పెట్టారు. Result - Interview Filed.

                                ఆ తర్వాత రోజు మా Resource Manager  గారు నన్ను పిలిచారు.బాధ పడకు రమణ అన్నారు.ఇలాంటివి జరుగుతూ ఉంటాయి, నీకు ఇంకో మంచి profile చూస్తాను అన్నారు.Its ok sir, అని బయటకు వెళ్తుంటే , ఆ interview లో అడిగిన ప్రశ్నలు మిగతా వాళ్లకి ఇవ్వు.నీకు వచ్చిన technologies అన్నీ వాళ్లకు చెప్పు, ఒక 4 నెలల నుండి వెతుకుతున్నాం , ఒక్కరు కూడా ఈ interview attempt చెయ్యటం లేదు.ఆ interview లో మిగతా వాళ్లకి కూడా same result.

మళ్లీ కొన్నాళ్ళకి Resource Manager assistant నుండి ఒక ఫోన్,ఇంటర్వ్యూ ఉంది వెళ్ళు అని.Technology details కావాలి ఇవ్వండి అన్నాను.Details are Highly secret అని చెప్పారు. Interview attempt చెయ్యాల్సింది నేను.Interview Technology దేని మీదో చెప్పండి అని అడిగాను. అది చెప్పను అని తను అంది.నాకు చికాకు వచ్చి Resource Managerని కలిసి Job Profile కావాలి అని అడిగాను.ముందు నువ్వు వెళ్లి ఇంటర్వ్యూ చేసే వ్యక్తిని కలువు తను Job Profile చెపుతాడు అన్నారు.తెగే దాకా లాగ కూడదు కదా! అనుకోని అక్కడికి వెళ్లాను.తనకి కావాల్సిన Technology నాకు రాదు.హమ్మయ్య అనుకోని next day ఆఫీసుకి వెళ్లాను to sign on Attendence.

    Resoucre Manager రూం లో ఒక అమ్మాయి ఏడుస్తుంది! నాకు పరిచయం లేదు, అందుకని మా శ్రీనివాస్ గారు వయసులో కొంచెం పెద్దవారు.తను ఏమయ్యింది అని అడిగారు.తను ఒక్కసారే పెద్దగా ఏడవటం మొదలు పెట్టింది. తనని కాసేపు సముదాయిస్తే , ఇలా చెప్పింది.......................తను Windows అనే Technology మీద పని చేసి ఇక్కడ join అయ్యింది.తనని ఇప్పటి వరకు 2 interviewలకు పంపారు.ఒక్కటి కూడా సెలెక్ట్ కాలేదు. ఇలా ఐతే ఎలా ?, నీకు ఏమి రాదు!  మా company లో ఎలా ఉద్యోగం చేస్తావ్. నీకు jobs వెతకలేక పోతున్నాను.నీలాంటి వాళ్ళు సుద్ధ దండగ! ఎందుకు వస్తారో తెలియదు.... మమ్మల్ని చంపుకు తింటారు అని మా Resource Manager గారు తిట్టారు అట. ఇంకా తను join అయ్యి 6 months అయ్యింది.
                    మా శ్రీనివాస్ గారు, "బాధ పడ వద్దు మీరు, మీకు మoచి రోజులు వస్తాయ్! బాగా ప్రిపేర్ అవ్వండి , తర్వాత interview లో తప్పక select అవుతారు "అని ధైర్యం చెప్పారు.దానికి ఆ అమ్మాయి చెప్పిన సమాధానం --> సర్ , వీళ్ళు నన్ను జావా మరియు dotnet interviews కి పంపారు. ఆ రెండు నాకు రావు. గడిచిన 5 సంవత్సరాలుగా నేను windows platform మీద పని చేసి వచాను......!అది విని నేను మా శ్రీనివాస్ గారు Shock.

Shock ఎందుకు అంటారా ...అప్పటికే నాకు benchలో 3 months గడిచాయి ఇంకా 2 interviews చేసాను.

No comments: