Saturday, November 7, 2015

ఇక నుండి శ్రీమతి missed call ఇవ్వదు, misses call ఇస్తుంది....!

                                                                   మొన్న ఆ మధ్య వరకు T.V.  లో ఈ కొత్త advertisement ప్రతి రోజు చూసాను.మీరు కూడా చూసే ఉంటారు లెండి.వినటానికి భలే తమాషాగా ఉంది, ఒకసారి మనం కుడా Super Active Wheel కొని  చూద్దాం అనుకున్నాను.ఒక k.g. surf కొంటె వాడు ఇచ్చేది, ఒక 10 Rupees Talk time .అది కూడా ఒక సీక్రెట్ కోడ్ ఇస్తాడు, దాన్ని online లో recharge  చేసుకోవాలి.ఇన్ని కస్టాలు పడితే , వాడు ఇచ్చే Talk time తో నిజంగా శ్రీమతి ఏమి మాట్లాడు తుంది? ఎంత సేపు మాట్లాడు తుంది...!నిజంగా online లో recharge  చేసుకునే వాళ్ళు ఎంత మంది ఉంటారు...!ఏమో చాలా భేతాళ ప్రశ్నలు వస్తున్నాయి.....!
                                             Rajani Kanth dialogue "ఇచ్చేది గోరంత , చెప్పుకునేది కొండంత ...!"

ఇంకో add - PERK Chocolate:
                                   ఒక teenage అమ్మాయి ,ఒక చిన్న బడ్డి కొట్టు వ్యక్తిని పక్కన ఉన్నcar  చూడమని చెప్పి పక్కకు వెళ్తుంది. ఆ car  నిజమైన owner వచ్చి దానిలో కూర్చో గానే , బడ్డి కొట్టు వ్యక్తీ , వీడు దొంగోడు అనుకుని ,కిందకు దిగు అంటాడు. అప్పుడు ఆ teenage అమ్మాయి వచ్చి, uncle  మిమ్మల్ని car చూడమని మాత్రమె చెప్పాను అని అంటుంది...!అప్పుడు ఆ బడ్డి కొట్టు వ్యక్తికీ అర్థం అవుతుంది ఈ అమ్మాయి తనను బకార చేసింది అని...!
                                    ఇది చూడగానే  నాకు చికాకు వేసింది....ఆ advertsement చేసిన వెధవని , దాన్ని approve  చేసిన వెధవని ఇద్దర్ని కలిపి కొట్టాలి అన్నంత కోపం వచ్చింది...!


ఇంకా చెప్పాలి అంటే తాగే బొట్టు బొట్టులో నిజాయితి ఉండాలి ....అంటే ఏంటో అర్థం కాలేదు...!
సంస్కార వంతమైన సబ్బులే వాడాలి..... సబ్బులకి ఏమి సంస్కారం ఉంటుందో తెలియటం లేదు!


పైవన్నీ చెపుతుంటే మా పక్కింటి బామ్మ గారు అన్నారు "బంగారం పైన రుణాలు అంటే , బంగారం కొనుక్కోవటానికి రుణాలు ఇస్తారేమో అనుకున్నాను...!" మన దగ్గర ఉన్న బంగారం లాక్కుని రుణాలు ఇస్తారు అట కదా ?.....!


ఇంకా Fair&Lovely ఐతే చెప్పనవసరం లేదు. ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల (US,Japan,Dubai...etc)లతో పోటి పడి, మన దేశంలోని Fair& Lovely  మాత్రమె గెలిచింది.మీరు ప్రపంచంలో Number 1 - cream వాడుతున్నారు అని T.V. లో చెప్పేస్తున్నారు.
మన దేశంలోcream మన దేశంలో ఉన్నతెల్ల  అమ్మాయిల మీద బాగా పని చేస్తుంది. ఎందుకంటే మిగతా దేశాల cream లు  అక్కడి వాతా వరణం మీద ఆధార పడి ఉంటాయి కదా! అవి ఇక్కడ ఎలా పని చేస్తాయి?.......


మన advertisers creativity reached to the max limit i.e. SKY.....! కాని మనం మాత్రం ఇంకా భూమి మీదే ఉన్నాం!
           


No comments: