Thursday, January 1, 2015

నన్ను బాగా ప్రభావితం చేసిన పుస్తకం - Roots (ఏడు తరాలు) - by Alex Haley

                                       8 సంవత్సరాల క్రితం Noida రోడ్ల మీద తిరిగే టప్పుడు , మా ఫ్రెండ్ సత్య చెప్పాడు , ఒకసారి Roots పుస్తకం చదువు అని. అంత ప్రత్యేకం ఏముంది దానిలో అన్నాను.తను  చాలా emotional అయ్యాడు. "అది పుస్తకం కాదు కొన్ని వేల జీవితాలు ఎలా నాశనం అయ్యాయో , ఒక మానవ సమాజం ఎంత బాధకు అన్యాయానికి  గురి అయ్యిందో" అని తెలుసు కోవటానికి ఒక నిఘంటువు (Dictionary).నిజం చెప్పాలి అంటే ఇది Whites Vs Blacks పైన వచ్చిన పుస్తకం అన్నాడు.ఈ పుస్తకం Blacks ఇంట్లో ఇప్పటికి 2nd Bible లాగా చూస్తారు అన్నాడు.


 తనకు English వచ్చింది అంతంత మాత్రమె , అయినా ఒక English పుస్తకం గురించి అలా ఎందుకు చెపుతున్నాడో చూద్దాం అనుకున్నాను.................................................!


తనే మళ్లీ చెప్పాడు , ఈ పుస్తకం తెలుగులో కూడా వచ్చింది చదువు అన్నాడు.


ఒక సంవత్సరం తర్వాత పుస్తకాన్ని KPHB Busstop రోడ్ పక్కన ఉన్న బుక్ స్టాల్ లో  చూసాను. ఆ పుస్తకం కొని ఇంటికి తీసుకు వెళ్లి , రాత్రికి నిద్ర రాకపోతే open చేసాను.ఇది ఒక వ్యక్తీ ఆఫ్రికా నుండి అమెరికా వరకు జరిగిన తన పూర్వీకుల ప్రయాణాన్ని వివరించిన పుస్తకం.ఈ పుస్తకం చదువుతున్న అంతసేపు కళ్ళ నుండి నీళ్ళు వస్తూనే ఉన్నాయి. ఏదో ఒక Hollywood movieని చూస్తున్న feeling వచ్చింది.


పోయిన వారం Hyderaba Books Exhibitionలో ఈ పుస్తకం మళ్ళీ చూసాను....ఒక్కసారే మనస్సు అంతా ఏదోలా అయ్యింది.... ఒక పుస్తకం నిజంగానే మనల్ని కదిల్చి వేస్తుంది.....!
ఈ పుస్తకం రివ్యూ చదవండి ->  http://pustakam.net/?p=10662 
(Thanks to Manogna)

Wikipedia  రివ్యూ చదవండి--> http://en.wikipedia.org/wiki/Roots:_The_Saga_of_an_American_Family



No comments: