Friday, January 16, 2015

సంక్రాంతి - ఒక రైతు కథ (పండిన పంట - వ్యాపారి - అవసరం! ) - Suggestions are invited!

అనుకోకుండా నా చిన్న నాటి friend ఒకతన్ని నిన్న కలిసాను. తను Vijayawada కి 50km  అవతల చల్లపల్లి కి దగ్గరలో వ్యవసాయం చేసే ఒక రైతు.తన పరిస్థితి ని నాకు ఇలా చెప్పాడు.

-తనకు ఉన్న చిన్న పొలం లో 25 బస్తాల (bpt) వరిని పండించాడు.
-వ్యాపారులు పొలానికి వచ్చారు.ప్రస్తుతానికి అవన్నీ తమకే అమ్మేయమన్నారు.
-వడ్ల రేటు చాల తక్కువ ఉంది కాబట్టి , బస్తాకి 1150 రూపాయల చొప్పున ఇస్తాము అన్నారు.
-25 బస్తాలు  = 25x1150 = 28,750 ఇస్తాము అన్నారు.
-ఇక్కడ  బస్తా =100 కిలోలు.
-తనకి కొన్ని అప్పులు ఉన్నాయి. కాబట్టి పక్కన ఉన్న రైతులు కూడా అదే ధరకు అమ్ముతున్నారేమో అడిగి, ఆ వ్యాపారులకు మొత్తం అన్ని బస్తాలు అమ్మేశాడు.

ఇప్పుడు నేను తనకు చెప్పిన మాటలు:
-ఇక్కడ Hyderabad లో 25 బియ్యం(old rice)  = 1200 రూపాయలు.
-25 వడ్ల బస్తాలు =25x4 = 100 బియ్యం బస్తాలు. ==> 100x1200 = 1,20,000.

తను వడ్లు బియ్యంగా మార్చి ఒక సంవత్సరం నిల్వ ఉంచితే , తను పెట్టిన శ్రమకు ఫలితం ఉంటుంది అని చెప్పాను.

తను ఒక చిన్న విషయం చెప్పాడు.
ఆ బస్తాలు , పొలం నుండి Rice Millకి తీసుకు వెళ్ళాలి.
Rice Mill నుండి బయటకు తీసుకు వెళ్లి అమ్మాలి.
ఇదంతా నా వల్ల అయ్యీ పనేనా అని.....!

So friends , please share your suggestions......with reality.

Monday, January 12, 2015

APS/TPS RTC - Special Service - వేరి స్పెషల్

నిన్న అనుకోకుండా విజయవాడ వెళ్ళటానికి బస్సు book చేసుకున్నాను.Last minute కదా అందుకని Special Services bus మాత్రమే ఉంది.అవసరం మనది. సేవ వారిది.అందుకని ఉన్న దాని మీద 50% ఎక్కువ పెట్టి మరీ APSRTC online లో  కొన్నాను. బస్సు arrival time 11:45pm.బస్సు స్టాప్ లో అడిగితే tickets అమ్మే agent ఆ బస్సు మా listలో లేదు అన్నాడు.Following are events at midnight-
1.12:00am bus లేదు.మీరు ఎవరి దగ్గర ticket కొన్నారు.
2.12:30am bus brokedown.
3.12:45 am new bus ఇంకో 10 minutesలో వచ్చేస్తుంది.
4.1:00am new bus ఇంకో 10 minutesలో వచ్చేస్తుంది.
5.1:15am  new bus ఇంకో 10 minutesలో వచ్చేస్తుంది.
6.1:30am  new bus ఇంకో 10 minutesలో వచ్చేస్తుంది.
7.గంటన్నర తర్వాత మీ కొత్త బస్సు ఇంకో పది నిముషాల్లో వస్తుంది అని చెప్పిన మాటనే మళ్ళి మళ్లీ చెపుతుంటే , మా పక్కన ఉన్న ఒక ముసలాయినకు BP raise అయ్యింది, నా డబ్బులు నాకు ఇచ్చెయ్యి అన్నాడు.Agent MGBS లో collect చేసుకోండి అన్నాడు. ఆ ముసలాయిన తన కూతుర్ని తీసుకుని ఇంటికి వెళ్ళిపోయాడు.
8.1:45am నేను current status అడిగాను.Mr.ప్రభాకర్ రెడ్డి.(RTC employ) చెప్పాడు - new bus ఇంకో 10 minutesలో వచ్చేస్తుంది...........................................................

ఈసారి bp నా వంతు , ఇంకో పది నిముషాలు కాదు ఇంకో 2 గంటలు ఉంటాను , బస్సు ఖచితంగా వస్తుంది అని మీరు చెప్పగలరా అన్నాను. మా వంతు ప్రయత్నం మేము చేస్తున్నాం, మీరు ఉండలేక పొతే రేపు MGBS వెళ్లి మీ డబ్బులు మీరు తెచ్చు కొండి అన్నాడు.
Finally I left to home at 2:00am.

9:00am MGBS వెళ్తే వాళ్ళ సమాధానాలు - As per process,మేము బస్సు పంపాము . మీరు ఆ  timeకి అక్కడ లేరు. తప్పు మీది , మీ దగ్గర తప్పు పెట్టుకుని మమ్మల్ని డబ్బులు ఇమ్మంటే మేము ఎలా ఇస్తాం.......!
ఈ సమాధానం ముగ్గురు చెప్పారు.(APSRTC call centre, MGBS Reservation counter RI,MGBS Station Manager). చివరికి ఆ  బస్సు Vijayawada Autonagar depo థి అని తేలింది. ఆ మేనేజర్ కి ఫోన్ చేస్తే mail చెయ్యండి, మా process ప్రకారం మేము చేస్తాం అన్నాడు.

ఇప్పుడు నాకు అర్థం అయ్యింది - Ambulanceని నడపటానికి APSRTC/TPSRTC ఎందుకు ఉపయోగించు కోవటం  లేదో! వాళ్ళ process ప్రకారం bus/ambulance వస్తుంది వెళ్తుంది(on their timings) , కాని patient బ్రతకటం లేదా చనిపోవటం వాడి(patient) తప్పు ........! కాదు కాదు వాడి(patient) ఖర్మ...




Thursday, January 1, 2015

నన్ను బాగా ప్రభావితం చేసిన పుస్తకం - Roots (ఏడు తరాలు) - by Alex Haley

                                       8 సంవత్సరాల క్రితం Noida రోడ్ల మీద తిరిగే టప్పుడు , మా ఫ్రెండ్ సత్య చెప్పాడు , ఒకసారి Roots పుస్తకం చదువు అని. అంత ప్రత్యేకం ఏముంది దానిలో అన్నాను.తను  చాలా emotional అయ్యాడు. "అది పుస్తకం కాదు కొన్ని వేల జీవితాలు ఎలా నాశనం అయ్యాయో , ఒక మానవ సమాజం ఎంత బాధకు అన్యాయానికి  గురి అయ్యిందో" అని తెలుసు కోవటానికి ఒక నిఘంటువు (Dictionary).నిజం చెప్పాలి అంటే ఇది Whites Vs Blacks పైన వచ్చిన పుస్తకం అన్నాడు.ఈ పుస్తకం Blacks ఇంట్లో ఇప్పటికి 2nd Bible లాగా చూస్తారు అన్నాడు.


 తనకు English వచ్చింది అంతంత మాత్రమె , అయినా ఒక English పుస్తకం గురించి అలా ఎందుకు చెపుతున్నాడో చూద్దాం అనుకున్నాను.................................................!


తనే మళ్లీ చెప్పాడు , ఈ పుస్తకం తెలుగులో కూడా వచ్చింది చదువు అన్నాడు.


ఒక సంవత్సరం తర్వాత పుస్తకాన్ని KPHB Busstop రోడ్ పక్కన ఉన్న బుక్ స్టాల్ లో  చూసాను. ఆ పుస్తకం కొని ఇంటికి తీసుకు వెళ్లి , రాత్రికి నిద్ర రాకపోతే open చేసాను.ఇది ఒక వ్యక్తీ ఆఫ్రికా నుండి అమెరికా వరకు జరిగిన తన పూర్వీకుల ప్రయాణాన్ని వివరించిన పుస్తకం.ఈ పుస్తకం చదువుతున్న అంతసేపు కళ్ళ నుండి నీళ్ళు వస్తూనే ఉన్నాయి. ఏదో ఒక Hollywood movieని చూస్తున్న feeling వచ్చింది.


పోయిన వారం Hyderaba Books Exhibitionలో ఈ పుస్తకం మళ్ళీ చూసాను....ఒక్కసారే మనస్సు అంతా ఏదోలా అయ్యింది.... ఒక పుస్తకం నిజంగానే మనల్ని కదిల్చి వేస్తుంది.....!
ఈ పుస్తకం రివ్యూ చదవండి ->  http://pustakam.net/?p=10662 
(Thanks to Manogna)

Wikipedia  రివ్యూ చదవండి--> http://en.wikipedia.org/wiki/Roots:_The_Saga_of_an_American_Family