Saturday, March 29, 2025

ఒక రాజు గారి కథ - 2 Versions

 మా 3 years అమ్మాయికి నేను చెప్పిన కథ:

                                                                       అనగనగా ఒక వూళ్ళో ఒక రాజు గారు ఉన్నారు. పొద్దున్నే నిద్ర లెగిసి , brush the teeth చెసి, అమ్మ చేసిన ఇడ్లీలు తినేసి, వాళ్ళ అమ్మ ఇచ్చిన అన్నం, పప్పు ఇంకా అప్పు పెరుగు అన్నం ఒక box లో పెట్టుకున్నారు. గుర్రం ఎక్కి  school ground ki వెళ్ళారు.అక్కడికి వాళ్ళ friend రామ చిలుక వచ్చింది. ఇద్దరు కలిసి ఉయ్యాల జంపాల ,  జారుడు బల్ల (slide) ఇంకా monkey bars ఆడుకుంటున్నారు.[We have all these things in Canada School Grounds]

                                                                        అంతలో one కుందేలు వచ్చింది. అదీ పాపం ఏడుస్తుంది! ఎందుకు నువ్వు ఏడుస్తున్నావ్ ? అని రాజు గారు అడిగారు.మా ఇంట్లో పెట్టిన క్యారెట్లు ఎవరో తీసుకువెళ్ళి పోయారు! Please help me, అని ఏడుస్తుంది. Don't worry , We will help you అని  కుందేలుకి చెప్పి, రాజు గారి గుర్రం మీద - రాజు గారు , రామ చిలక ఇంకా కుందేలు ముగ్గురు, Rabbit house కి వెళతారు. నీ carrots ఎక్కడ పెట్టావ్ ? అని అడిగితే , ఒక సంచిలో పెట్టాను అని కుందేలు చెప్పింది.రామ చిలుక, నువ్వు వెళ్లి సంచిని వెతుకు అని చెప్పి రాజు గారు కుందేలు ఇల్లు మొత్తం search చేసారు. అంతలో రామ చిలుక వచ్చి , ఆ సంచి Fox house ముందు ఉంది అని చెప్పింది.రాజు గారు Fox ni డిష్యూం డిష్యూం  అని కొట్టి , క్యారెట్ అన్నీ తెచ్చి Rabbit ki ఇచ్చారు! Rabbit , Thanks రాజు గారు అని చెప్పి, రాజు గారికి 1 carrot , రామ చిలుక కి 1 carrot  ఇంకా రాజు గారి గుర్రానికి 1 carrot  ఇచ్చింది. ఆ carrots తినేసి వీళ్లు ఇంటికి వెళ్లిపోయారు. ఇంకా పాలు తాగేసి బొజ్జుని నిద్రపోయారు! Good job చేసారు.

 మా 3 years అమ్మాయి నాకు చెప్పిన కథ:

   అనగనగా ఒక వూళ్ళో ఒక రాజు గారు ఉన్నారు. పొద్దున్నే నిద్ర లెగిసి , brush the teeth చేసారు. వల్ల నాన్న surprise gift ఇచ్చారు.అప్పుడు అమ్మ చేసిన ఇడ్లీలు తినేసారు. ఇప్పుడు అమ్మ suprise gift ఇచ్చింది. School ground కి వెళ్ళారు.పెద్ద Dinosaurus , Candy shop మీదా attack చేసింది.Candy jars break అయిపోతున్నాయి! రాజు గారు వెళ్ళి, Don't worry Dino , Sharing చేసుకుందాము అని చెప్పి, దానికి Lollipops ఇచ్చారు. Dino వెళ్ళిపోయింది. Shop Owner రాజు గారికి చాలా Candies ఇచ్చాడు , help చేసినందుకు! రాజు గారు ఇంటికి వెళ్లి పాలు తాగి పడుకున్నారు.


Tuesday, November 26, 2024

కనపడని Reservations మాకు కావాలోయ్ ! - Part 1

                                           రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యం మన దేశానికి ఎలా వచ్చింది! Divide and Rule.....!కుల , మతం , ప్రాంతము , ఇవన్ని వాళ్ళు పెట్టలేదు! మన దగ్గర ఉన్నాయ్! వాళ్ళు use చేసుకున్నా రు.

                                                                 పోయిన సంవత్సరం Vijayawada లో ఒక Doctor గారూ నన్ను అడిగి ప్రశ్న-  మీ అమెరికా లో కులాలు బాగా ఉన్నాయి అంట కదా ! శ్రీరెడ్డి , నాయకుడు , మనోడే! ఇలా ఉంటారు అంట కదా, అని అడిగారు. నీ అభిప్రాయం ఏంటి అని అడిగారు! ఆ Doctor గారి అమ్మాయి Philippines లో MBBS చదువుతుంది . తనకి చాలా డబ్బు పంపించాలి అని మరో పక్కా చెప్పారు. అక్కడ,  కుల పిచ్చి ఎక్కువ అంట కదా అన్నారు !

                                                                  నా సమాధానం కులాలు కావాలి sir, అని మొదలు పెట్టాను! ఒక student విధేశాలు వెళ్లి 2 years చదువుకోవడానికి 30 లక్షలు అవుతాయి అనుకుంటా! Fresher లాగ ఉద్యోగం సంపాదించి , ఆ అప్పు తీర్చడానికి చాలా కాలం పడుతుంది. అదే తెలిసిన వాళ్ళు ఉద్యోగం ఇప్పిస్తే , కొంత త్వరగా బయట పడతారు. 

                                                        ఇంకా ఇక్కడ  Degree చదివిన అమ్మాయిలు BTech వీరులు కావాలి అనుకుంటారు! BTech చదివిన అమ్మాయిలు Foreign Countries లో ఉన్న అబ్బాయిలు కావాలి అనుకుంటారు! మరి అక్కడ (US/Canada/Australia) చదువుకున్న అమ్మాయిలు , ఎవరిని పెళ్లి చేసుకుంటారు? తెల్ల వాళ్లనా!, నల్ల వాళ్లనా! లేక పక్క రాష్ట్రం వాళ్ళని? ఇక్కడే మన తల్లి దండ్రులకి కులం ఉపయోగ పడుతుంది ! అక్కడున్న మన అబ్బాయిలకు కూడా ఇక్కడ కులం ఉప్యోగపడుతుంది!

                                ఇంకా ఇక్కడ మన ఇంటి తలుపు తీసి బయటకి వెళితే , ఒక సుబ్బారావు గారు లేక ఎల్ల రావు గారు కనపడతారు! అదే కెనడాలో ఉన్నా మా 30 అంతస్థుల Apartment లో , మా తలుపు తియ్యగా , ఎదురింట్లో నల్ల వాడు ! పక్కింట్లో తెల్ల ముసలాయన! అటు పక్కనా చైనీస్ జంట! ఇంకో పక్కా అరబ్బులు! ఇలా ప్రపంచ దేశాలు అన్నీ నుండి వచ్చిన జనాలు అందరూ కనపడతారు! ఇక మీకు చిన్న పిల్లలు ఉంటే, పరిస్థితి ఇంకా నరకం! వీళ్లు ఎవరితో ఆడుకుంటారో జారత్తగా కనిపెట్టాలి, వాళ్ళు ఏమి చేస్తారో మనం చూస్తూ ఉండాలి! మొన్నా అమెరికాలో ఒక Friend ఇంటికి వెళితే , వాళ్ళు ఒక చిన్నా Community లో ఉంటున్నారు ఓక 10 Telugu Families (వాళ్లంత TCS కులం) కలిసి , పిల్లల కోలాహలం బాగుంది! మా Friendఆ గూడేనికి పెద్ద! పిల్లల్ని అందరినీ బయటకి పంపించారు ఆడుకోవటానికి ! అలా ఎలా పంపిస్తావు ? బయట ఎవరు ఉంటారో తెలియదు కదా అని అదిగాను?  వాడు ఒక నవ్వు నవ్వి ! ఇది  మన గూడెం! పిల్లలు బయటకి వెళ్ళిన దగ్గర నుండి , మన గూడేనికి ఆ చివరి నుండి , ఈ చివరి వరకు ఉన్న మన తెలుగు Moms and Dads ఒక కన్ను వేసి ఉంచుతారు! ఆడుకుని పిల్లలు ఇంటికి వచ్చేస్తారు!అని చెప్పాడు వాడు.

                                    ఇప్పుడే చెప్పండి సార్! కులాలు India లో మీకు వద్దేమో! , మాకు అమెరికాలో కావాలి అని చెప్పాను!

                                      నువ్వు చెప్పింది నిజమేనో ! ఇక్కడి వాళ్ళు , ఆ హీరో , నేను ఈ హీరో అని కొట్టుకుంటారు!కానీ హీరోలు అందరూ కలిసి మెలిసి ఉంటారు! ఎవడి బ్రతుకు వాడిది అని వీళ్ళకు ఎప్పటికి తెలుసుంటారో!అని ముగించారు.

Tuesday, November 19, 2024

Canada వెళ్ళొద్దాం రండి !

 ఒక రకంగా seperate Telangana  రాక ముందు , Delhiలో మా Colleagues నన్ను Madraasi అనేవాళ్ళు.ఇప్పుడు తెలంగాణ అంటారేమో! Canada వచ్చిన కొత్తలో , అమ్మో అక్కడ చలి ఎక్కువ ఉంటుంది కదా అనేవాళ్ళు అందరూ! ఇపుడు ఖలిస్థానీ ! , ఇంకా students ki తిండి కూడా దొరకట్లేదు అని అంటున్నరు !

6 Month back ఒక Punjabi Colleague ని ఖలిస్థానీ ఎందుకు కావాలి మీకు అని అడిగాను! Indian Govt చాల మంది సిక్కులను చంపింది, ఇంకా మాకు ఇప్పటి వరకు ఒక IT Company కుడా రాలేదు, in Punjab. India Government కావాలనీ ఆపేస్తుంది అని చెప్పాడు.ఇంకా Drugs Control చెయ్యట్లేదు , దానితో Youth చెడిపోతుంది అని అన్నాడు. నువ్వు చెప్పింది బాగుంది. ఇందిరా గాంధీ చనిపోయిన తర్వాత అల్లర్లలో చాలా మంది సిక్కులు మరణించారు ! (it happened in Indian History in 1980s, everyone should agree). ఇప్పుడు పరిస్థితి అలా లేదు! Majority people in Indian Army are Sikhs.ఇంకా మా చిన్నప్పుడు న్యూస్ పేపర్స్ లో పంజాబ్లో ఒక ఎకరానికి 40 బస్తాలు పండించారు అని వార్తలు వచ్చేవి.మా వైపు అలా మనం ఎందుకు చెయ్యలేము అని మాట్లాడుకునే వారు. ఒక example ga Punjabis ఉండేవారు అని చెప్పాను. ఇప్పుడు టీవీలో వచ్చే ఖలిస్థానీ వార్తలు జాగ్రత్తగా చూస్తే , వాళ్ళు పెట్టే ఫోటోలు అన్నీ చాల Old వి.

Last 2 years నుండి monthly గురుద్వారా సాహిబ్ కి వెళుతున్నాను. ఎవ్వరు ఏమి అనరు నన్ను.మొన్న ఖలిస్తానీ హిందూస్తానీ బ్యాచ్ తన్ను కోవడం కూడా చూశాను.రాజకీయాలు భారతదేశంలో ఎన్నికల ముందు చాలా చూస్తాం! ఇది కూడా దానిలో భాగమేమో 2025 October లో చూడాలి.

750 Grams పెరుగు డబ్బా 2016 లో 1 dollar in Toronto.750 Grams పెరుగు డబ్బా 2021 లో 1.25 dollar in Toronto. 15 Liters Canola Oil can 16 dollars in Toronto from 2016 till 2021.ప్రభుత్వం Rates పెరగకుండా ఎలా control చేస్తుందో తెలియదనికి ఇది చిన్న ఉదాహరణ! Post Covid , పెరుగు డబ్బా 4 times అయ్యింది! Oil can price double  అయ్యింది! I can not comment on Indian Economy price control.


Food bank ఉపయోగం ఏమిటీ, దానిలోకి Food ఎలా వస్తుంది.ఇది పని చేస్కో లేని వాళ్ళు , అంటే above 65 years old people అక్కడకు వెళ్లి , line లో నుంచుని , వాళ్ళకు 1 week కావాల్సిన సరుకులు తెచ్చుకోవచ్చు.Food ఇచ్చెవాళ్ళు , అక్కడ ఉన్నా racks లో మీరు తినగలిగే type of Food తెచ్చుకోండి అని చెప్పి , మనల్నే తీసుకోమంటారు.నాకు తెలిసి ,ముసలి వాళ్ళ ఆకలి చావులు ఆపటానికి ఇది ఒక ప్రయత్నం! నేను Canada వచ్చిన కొత్తలో మన తెలుగు వాళ్ళు చాలా మంది అక్కడికి వెళ్లి సరుకులు తెచ్చేవాళ్ళు.ఇవి బయట కొనాలి అంటే చాలా డబ్బు, మీరు మాతో రండి అని చెప్పేవారు.ఆ మధ్య (during covid) Food bank బయట  బ్రాండ్ New కార్లు పార్కింగ్ చేసి లైన్ లో నుంచున్న వాళ్లని Tiktok లో famous చేసారు.మన దేశంలో పని చెయ్యగలిగి అడుక్కుని తినే వాళ్ళని ఏమి అంటారో మీ ఊహకే వదిలేస్తున్నా! 
                               ఇక్కడ 1 job కి 100 members lineలో ఉనట్టు చూస్తాం.మరి ఆ 99 మంది ఏమి చేస్తారు! ఇక్కడ 2 ఉద్యోగాలు చెయ్యటం common!కొన్నీ ఉద్యోగాలలో 8 hours నుంచునే పని చెయ్యాలి. India నుండి వచ్చిన వాళ్ళు అవి చెయ్యగలరా! boss బాలేదు అని , colleagues బాలేదు అని job మారడం కూడా common.ఇంకా తక్కువ జితం ఇస్తున్నారు అని కూడా!

ఇంకా studentsకి collegelo తక్కువ రేటు కి సరుకులు కూడా అమ్ముతారు.ఇవన్నీ మా వల్ల కాదు బాబాయ్!మేం లైన్లో నంచుంటాము , Food తెచ్చుకుంటాం ,  this is easy అనుకునే వాళ్ళు బాగా పెరిగారు!

Wednesday, June 12, 2019

Nonveg కావాలా నాయనా....!

అవి 2006 ,Noida లో మాకు  Training ఇస్తున్న రోజులు.......




   కొత్తగా Company లో చేరిన 200 మందికి Induction Program - Radission 5-Start Hotel లో ఇచ్చారు.
మొత్తం Program 1 Week  జరిగింది. మా అందరి ద్రుష్టి మాత్రం .......Lunch మీదే ఉండేది....! అప్పుడో ఇప్పుడో , ఎప్పుడో కప్పుడు , బయట Mess లో తిన్న మాకు , 5-Star Hotel భోజనం , చాలా Super గా నచ్చేసింది. మొదటి రోజు భోజనం చూడగానే .... అన్ని రకాల Food Items చాలా బాగున్నాయి (చూడటానికి ) , కానీ చూడటానికి నచ్చినవి అన్ని , తినటానికి పనికి రాలేదు....!
                               ఆ రాత్రి మాకు పెద్ద మీటింగ్ , చివరగా మేము తేల్చింది ఏంటి అంటే ....... మేము ఒక ప్లాన్ ప్రకారం తినాలి.
                               As per plan , next day - ప్రతి ఒక్కరు 2 Food Items తీసుకుని Taste చేసాం.....After taking feed back from each other ,final గా   మాకు కావాల్సిన Tasty  Food Items plateలో పెట్టుకుని తినేసాం.
ఆలా మా 5-Star Hotel  Non-Veg భోజనం 5 days complete అయ్యింది.




                                    ఇప్పుడు మా Technical Trainings మొదలు అయ్యాయి. వాటితో పాటు మా  భోజనం కస్టాలు కూడా...! ఇప్పడు మాకు Noida Local Mess నుండి Food తెచ్చి పెట్టేవారు. వాడేమో Non-veg అంటే ఒక చిన్న bowl నిండా Gravy , దానిలో కనపడకుండా 2 చిన్న Chichen ముక్కలు వేసీవాడు. అది కూడా Que లో మొదట ఉన్న 30 మంది అదృష్టవంతులకే ...! ఒక 2 days తిన్న తర్వాత నాకు బోధపడింది , ఈ North Indian వంటకాలు ఏవి కూడా తినలేము అని . ఇంతలో ఎవరో నా దగ్గరకు వచ్చి , ఒక Brahmin ఐన నువ్వు Non-veg తినటం బాలేదు అన్నారు...! నాకు షాక్ ! నేను బ్రాహ్మణ అని ఎవరికీ చెప్పలేదు (నిజానికి నేను బ్రాహ్మణ కాదు )...! వీడికి ఎలా తెలిసింది అని ...!  అదే అడిగాను , నీకు ఎలా తెలిసింది ఈ రహస్యం అని ....! నువ్వు తెల్లగా ఉంటావు కదా ...! అందుకని నువ్వు Brahmin అని అన్నాడు ...! Hmm.... వీడి అతి తెలివికి ఏమి చెయ్యాలి అని అలోచించి ....! సరే ప్రతి రోజు నా దగ్గరకు వచ్చి తీసుకు వేళ్ళు అని చెప్పి , రోజు వాడికే ఇచ్చేసాను....!


కొన్నాళ్ల తర్వాత Hyderabad వచ్చేసాను. ఇక్కడ నాకు , నా friend Vamsi గాడికి ఒక చిన్న ఒప్పందం. వాడేమో ఇంటి దగ్గర నుండి తెచ్చుకున్ననా  బాక్స్ తింటాడు... నాకేమో వాడి Lunch Coupon  ఇస్తాడు. ఆ కూపన్ కి ఇంకో 5 Rupees  వేసుకుంటే Chicken బిర్యానీ వస్తుంది .....ఇక మా వంశి గాడికి నా box తో పండగే పండగే ...! Sorry , make it reverse , నాకు రోజుChicken  బిర్యానీ పండగే పండగే...!
                                 తర్వాత మిగిలిన కంపెనీలలో నాకు పెద్దగా ఇబ్బంది లేదు భోజనంతో .... ఎందుకంటే టైం కి భోజనం చేస్తే అది చాలా గొప్ప .... ...! దానిలో వెజ్ ఆ Non-Veg ఆ అని కూడా చూడలేని పరిస్థితి...!


ఇంతలో నేను అనుకోకుండా D--- Technology లో చేరాను. మొదటి రోజు పక్కన ఉన్న Java Developerని అడిగాను , నేను box తెచుకోలేదు , బయట Lunch తినాలి . అప్పుడు నన్ను Canteenకి తీసుకు వెళ్లి చెప్పాడు , ఇక్కడ Food Free . మనం ఎంత కావాలి అంటే అంట తినొచ్చు అని .....! ఇప్పటికే ఇలాంటివి చాలా సార్లు చూసాను , ఎంత కావాలి అంటే అంట తినొచ్చు - కాకపొతే వంట వండేవాళ్లు మాత్రం Noth Indians or Orissa Persons. మొత్తం Hyderabad లో నేను అప్పటికే పని చేసిన 4 MNC Companyలలో కూడా వాళ్ళే...... ఇక్కడ మాత్రం కొత్తగా ఏమి ఉంటుంది లే .....! అనుకుంటుండగా , దూరంగా ఒక మెరుపు , ఆ మెరుపు పక్కనే ఒక borad- Non-veg  అని....! ఈ మెరుపు ఎక్కడ నుండి వచ్చిందా అని చుస్తే , వాళ్ళు Non-veg పెట్టింది ఒక Steel Can, లో....! ఆ Steel can నుండి వచ్చిన మెరుపు అది.....! దానిలో ఏమి ఉంది అంటారా , ఇక్కడే ఒక  Twist - వీళ్ళ దగ్గర non-veg వేసే  small bowls లేవు....! అంటే " మనం ఎంత Non-veg కావాలి అంటే , అంట వేసుకోవచ్చు...! No restrictions. ఇంతలో ఆ Java Developer చెప్పాడు  , ఇక్కడ చేసిది Guntur వాళ్ళు అని ...! ఇంతలో వాళ్ళు వేసే సాంబార్ వాసన ఘుమ ఘుమలు ఆడుతుంది , ఇంకా అప్పడాలు కూడా ...! ఇంకేమి కావాలి ఈ వెధవ జీవితానికి , కావాల్సినంత Chicken Curry ఇంకా కొంచెం సాంబార్ , చివరగా కొంచెం గడ్డ పెరుగు...!ఇది కదా జీవితం.........ఇక జీవితాంతం ఈ Company లోనే ఉంది పోవాలి .....ఇక్కడే Retire అయిపోవాలి ................... అనుకుంటూ , నా ప్లేట్ లో Rice  పెట్టుకుని ........ Non-Veg steel can దగ్గరకు వెళ్లాను ............................................! అది Egg Curry ......................! అప్పుడు గుర్తుకు వచ్చింది ...మన ఇండియా లో Actual Non-veg తినని వాళ్ళకి  Eggఏ కదా Non-Veg.....! అలా Non-veg Shock  తగిలింది నాకు ...!ఈ మాటకి ఆ మాట చెప్పుకోవాలి Veg-curries మాత్రం గా చేసేవాళ్ళు.....అలా ఒక 3 నెలలు అక్కడ గడిపాను...!

Friday, July 13, 2018

నా corporate కథలు... 2.Bench కష్టాలు Part 2

                                                                     అది  Bench లో ఆనందంగా కాలం గడిపేస్తున్నసమయం.ఒక రోజు(బుధవారం) నాకు Resource Manager assistant నుండి ఫోన్ వచ్చింది at 10am. ఎక్కడ ఉన్నారు? అని అడిగారు. ఇక్కడే మా పాత కంపెనీ Managerని కలవ టానికి వచాను అని చెప్పాను.త్వరగా ఆఫీసు కి రండి, మీటింగ్ ఉంది అన్నారు.నాకు ఒక గంట పడుతుంది అని చెప్పాను.పర్వాలేదు రండి అని అన్నారు.

          అనవసరంగా మా వెధవ batch ని  follow అయ్యాను. ఈ రోజు నన్ను పట్టేసుకుంటారు అని అనుకుంటూ , ఆఫీసుకి వెళ్లటానికి రెడీ అయ్యాను.ఈ లోగ ఇంకో ఫోన్.మా batch వాడు. నీకు ఫోన్ వచ్చిందా అన్నాడు, ఆ వచ్చింది అందుకే బయలు దేరాను అని చెప్పాను."ఎంత time లో ఆఫీసు కి వస్తాను అన్నావ్? "అని అడిగాడు.నీకు తెలుసు కదా మా ఇంటి దగ్గరి నుండి ఒక గంట పడుతుంది , అందుకే 1 hour అని చెప్పాను అని అన్నాను.

నువ్వు చాలా ధైర్యవంతుడివి , నేను  10 నిమిషాలు అనే చెప్పాను.ముందు మా ఇంటికి రా, ఇద్దరం కలిసి వెళ్దాం అని అన్నాడు.hmm, వాడి ఇల్లు KPHB, మా ఇల్లు Nizampet Road.ఆ రోజు మా దురదృష్టం ఇంకా బాగుంది.వాడిని తీసుకుని Hitech city వైపు వెళ్తుంటే big traffic jam.

ఆ సమయం లో వాడి ఫోన్ రింగ్ అయ్యింది.వాడు నా బైక్ నడుపుతున్నాడు.ఆ ఫోన్ నాకు ఇచ్చి మాట్లాడు అన్నాడు.ఎవరో అమ్మాయి ఫోన్ చేసింది అన్నాను. పర్వాలేదు మాట్లాడు అన్నాడు.ఆ అమ్మాయి మాతో పాటు bench లో ఉన్న్న అమ్మాయి. తనకి కూడా ఫోన్ వచ్చింది అట.ఎక్కడ ఉన్నావ్ అని అడిగితె , "Resource Manager room బయట ఉన్నాను ! " అని చెప్పింది అట. ఇప్పుడే ఇంటి దగ్గర బయలు దేరాను, ఇంకో 2 గంటల్లో అక్కడ ఉంటాను.వాళ్ళు అడిగితె బయట కనపడ్డాను అని చెప్పండి అని request చేసింది.hmmm, వీళ్ళు నాకన్నా ఘనులే అని అనుకున్నాను.

మేము Meeting Room లోకి వెళ్ళిన ఒక గంట తర్వాత మా Resource Manager వచ్చి same class పీకి (Attitude is life)వెళ్ళారు.ఆ తర్వాత గంటకి ఆ అమ్మాయి వచ్చింది.

నా corporate కథలు... 5.నా విదేశి యానం - U.K/USA/Canada/Malaysia - Part 2

                                                  మరి కొన్ని రోజుల తర్వాత, మళ్లీ మా manager గారు నన్ను పిలిచారు , రమణ గారు మీరు రేపు పొద్దున్న ఒక client interview కి వెళ్ళాలి, రేపు సాయంత్రం USAకి వెళ్ళాలి అని చెప్పారు.సరే అని నా సీట్ దగ్గరికి వెళ్లి కూర్చునాను. మళ్లీ శ్రీనివాస్ గారు congratz  చెప్పారు. ఈ సారి నేను ఎవ్వరికి అసలు విషయం చెప్పలేదు.........(మీకు చెప్పీస్తునాను- నాకు Passport ఇంకా రాలేదు!).
 
USA Chance :
                                తర్వాతి రోజు Client నుండి Phone రాలేదు.నేను వెళ్లి manager గారికి ఆ విషయం చెప్పాను.Manager గారు విషయం కనుక్కుని చెపుతాను అని అన్నారు.తర్వాతి రోజు పొద్దూన్న చెప్పారు, ఆ Project మనకు రాలేదు.మీరు బాధ పడకండి , నేను మీకోసం ఇంకో మంచి Project చూస్తాను అన్నారు.

నేను మాత్రం ప్రశాంతంగా నా seatలో కూర్చొని ఆనందంగా ఉన్నాను. Passport apply చేసే  ప్రయత్నాలు మానలేదు.

అలా Passport లేకుండా U.S.A వెళ్ళే ఛాన్స్ వచ్చి , వెళ్ళింది...................!
Canada Chance:
          ఇంతలో నాకు సంబంధించిన Technology మీద interviews జరిగి , నేను ఇంకో Team లోకి వెళ్లాను.
                       నా passport కూడా చేతికి వచ్చింది.

                                             ఒక రోజు నా పాత colleague , Narasimha కనపడితే ఏవో పిచ్చాపాటి మాట్లాడుతున్నప్పుడు , వాళ్ళు వెతుకుతున్న Technology మీద నేను పని చేసి ఉన్నాను అని అర్థం అయ్యింది. దానితో తాను ఎగిరి గంతు వేసాడు. నాకు ఏమి అర్థం కాలేదు!
వాళ్లకి  Canada వెళ్ళేటందుకు ఒక వ్యక్తి కావాలి. మా General Manager తో మాట్లాడి  phone చేస్తాను అని చెప్పాడు.సరే ఈ సారి ఏమి అయ్యిద్దో చూద్దాం అనుకున్నాను.
                                              సరిగ్గా అర్థ రాత్రి నాకు ఫోన్ వచ్చింది. నరసింహ వాళ్ళ  General Manager గారు మాట్లాడారు...... ఆయనకీ అర్థం అయ్యింది, ఇక ఆలస్యం చెయ్యకుండా మా  General Manager పేరు అడిగారు. ఇంకో 2 రోజుల్లో సిద్ధంగా ఉండండి మా Team లో కి వచ్చేయ్యటానికి అని చెప్పి  phone disconnect చేశారు.

               2 కాస్త 4 అయ్యింది , 4 కాస్త 8 అయ్యింది ...నాకు అర్థం కాలేదు. Narasimhaకి ఫోన్ చేసాను. ఏమి అయ్యిందో తెలియదు రమణ , నాకు 4 Resumeలు పంపించారు. వీటిలో ఒక్కళ్లని Select చేసుకుని Canada తీసుకెళ్లండి అని చెప్పారు. వీళ్లల్లో ఒక్కడికి కూడా నాకు కావాల్సిన Technology రాదు. నువ్వే వెళ్లి మీ General Managerని అడుగు అని చెప్పాడు.
General Manager Meeting:
Me : sir, నేను Onsite - Canadaకి XYZ Team GM అడిగితె,  నా CV పంపించాను.
మీ దగ్గర అది ఆగిందని విన్నాను.
GM:  అవును రమణ , నేనే ఆపాను.
Me: ఎందుకని  sir?
GM:  ఆ Canada chance కేవలం 3 నెలలు మాత్రమే , నాకేమో నిన్ను అమెరికా permanent గా పంపాలని ఉంది!
Me: ముందు Canada చూడండి  sir, వాళ్లకి కావాల్సిన Technology నాకు వచ్చు. అందుకే వాళ్ళు నన్ను అడిగారు.
GM: నువ్వు ఎన్ని ఐన చెప్పు  రమణ , నాకు నిన్ను అమెరికా మాత్రమే పంపాలని ఉంది.
Me: Ok sir, meet you later........
అలా  వెళ్లిన మా GM ఆణిముత్యం team ,  ఒక 6 నెలలు అక్కడ ఉండి , ఏవో కొన్ని Management escalationsతో మళ్ళీ వెనక్కు వచ్చి పడ్డారు.


ఇంతలో  నా Team లో అడిగారు మలేషియా ఎవరు వెళ్తారు అని....!మా Team mate కిరణ్ resign చేసాడు , వెంటనే అతన్ని మలేషియా పంపిస్తాం ఆగు అని చెప్పారు. తాను చాలా తెలివైన వాడు (ఇంతకూ ముందు Team lead గా పని చేసి ఎంతో కొంత  Corporate పొలిటిక్స్ నేర్చుకున్న వాడు).మీ చావు మీరు చావండి. నన్ను వదిలెయ్యండి అని చెప్పాడు. 
                       ఇంతలో నాకు ఒక జాబ్ వచ్చింది. వెంటనే మలేషియా వెళ్ళటానికి నన్ను పట్టుకున్నారు. నేను over- action చేస్తూ ఏమి చెప్పానో తెలుసా ...........................!
                            నేను USA కంపెనీ కి APAC-EMEA టీం కి పని చెయ్యాలి. నేను ప్రతి నెల ఒక Europe, Asia countryకి వెళ్ళాలీ...............!

                       

Sunday, July 1, 2018

నా corporate కథలు... 4.నా విదేశి యానం - U.K/USA/Canada/Malaysia - Part 1

                                                     అలా రెండు నెలలు Project చేసిన తర్వాత మళ్లీ back to bench.ఈసారి bench లో ఉన్నవాళ్ళు హడలి పోయేలా , మా Resource Manager ఒక మెయిల్ పెట్టాడు.ఇంకొక నెలలో మీకు Hyderabadలో జాబు వస్తే చెయ్యండి. లేదంటే నేను ఎక్కడకి పంపిస్తే అక్కడకు(Bangalore/Chennai/Kerala/Mumbai) వెళ్లి job చెయ్య టానికి ready గా ఉండండి.మీకు ఏమైనా  Attitude Problems ఉంటె నా దగ్గరకు రండి అని చెప్పాడు.కొంత మంది పెళ్లి ఐన వాళ్ళు వెళ్లి వాళ్ళ కష్టాలు చెప్పు కున్నారు. "వాళ్ళు అందరికి  మంచి Attitude లేదు " అని ఒక ముద్ర వచ్చింది.ఇక నేను ముందుకు వెళ్ళలేను , వెనక్కి వెళ్ళ లేను. ......................ముందుకు వెళ్తే నాకు Attitude Problem ఉంది అంటారు , వెనక్కి వెళ్తే పక్క రాష్ట్రాలకి వెళ్లి పనులు చెయ్యాలి.అలాంటి సమయంలో మా శ్రీనివాస్ గారు ఒక Project లోకి నన్ను రమ్మన్నారు.ఆ Technology నాకు తెలియదు.కొంచెం కూడా రాదు.దానికి వెళ్ళకపోతే , హైదరాబాద్ దాటి బయటకు వెళ్ళాలి.నా కళ్ళ ముందే ఇద్దరినీ చెన్నై పంపారు.ఇంగ్లీష్ సినిమా లో లాగా only 1 option to stay in Hyderabad.చివరకు నాకు రాక పొఇనా వెళ్ళాను......

వెళ్ళిన మొదటి రోజే కొత్త manager అడిగారు - నీకు technology రాదు కదా! అని. నీర్చుకుంటాను అని చెప్పాను.ఆ అమ్మాయి దగ్గర కొంచెం నేర్చుకో , ఇంకొంచెం ఆ అబ్బాయి దగ్గర నేర్చుకో అని నన్ను పంపించారు.
ఆ అమ్మాయి , చేసే కొంచెం workకి చాలా కష్ట  పడుతున్నట్టు buildup ఇచ్చేది. తన కింద ఉన్న juniors ని కసురుతూ , విసురుతూ ఉండేది................................ ఇంకో కొత్త వెధవ వచ్చాడు, వీడికి కూడా నేర్పించాలా అని మొఖం పెట్టింది......!తన దగ్గ ఒక 10 నిముషాలు ఉన్న తర్వాత నా జీవితం మీద నాకే విరక్తి కలిగింది!....................................మా శ్రీనివాస్ గారికి ఆ విషయం వెంటనే అర్థం అయ్యినట్టు ఉంది. తను వచ్చి ఆ అమ్మాయిని "Technology మీద ఒక పుస్తకం ఉంటె ఇవ్వండి చాలు , మీరు ఇతనికి ఏమి చెప్పనవసరం లేదు అని చెప్పారు."She gave me a book.బ్రతుకు జీవుడా! అని అనుకుంటూ , అక్కడి నుండి నా సీట్ దగ్గరకు వెళ్లాను.

UK Chance :
                            వారం రోజులు గడిచాయి.ఆ manager మళ్లీ   నా దగ్గరకు వచ్చి , రమణ గారు మీరు urgent గా U.K వెళ్ళాలి. మీకు అభ్యంతరం ఏమైనా ఉందా? అన్నారు.నాకు ఏమి లేదు అన్నాను.ఐతే మీరు ఆ అబ్బాయి దగ్గర మిగతా Technology నేర్చుకుని Ready  గా ఉండండి అని చెప్పి, తను వెళ్లి పోయారు.శ్రీనివాస్ గారు వెంటనే congratz చెప్పారు. తనని బయటకి తీసుకు వెళ్లి చెప్పాను- సర్ , "నాకు  Passport లేదు".శ్రీనివాస్ గారు నన్ను Passport Apply చెయ్యండి త్వరగా అని చెప్పారు.
                                     అలా ఒక పక్క రాని Technologyని నేర్చుకొంటూ , ఇంకో పక్క లేని Passport apply చేస్తూ ఉండగా......మా Manager చెప్పారు : రమణ గారు UK Chance వేరే location లో  ఉన్న వాళ్ళు తీసుకున్నారు.ప్రస్తుతానికి మీరు Technology ఇంకా నేర్చుకోండి అని చెప్పారు.
                                         అలా Passport లేకుండా U.K   ఛాన్స్  వచ్చింది , ఇంకా చెప్పాలి అంటే వెళ్ళింది కూడా!