Saturday, March 29, 2025

ఒక రాజు గారి కథ - 2 Versions

 మా 3 years అమ్మాయికి నేను చెప్పిన కథ:

                                                                       అనగనగా ఒక వూళ్ళో ఒక రాజు గారు ఉన్నారు. పొద్దున్నే నిద్ర లెగిసి , brush the teeth చెసి, అమ్మ చేసిన ఇడ్లీలు తినేసి, వాళ్ళ అమ్మ ఇచ్చిన అన్నం, పప్పు ఇంకా అప్పు పెరుగు అన్నం ఒక box లో పెట్టుకున్నారు. గుర్రం ఎక్కి  school ground ki వెళ్ళారు.అక్కడికి వాళ్ళ friend రామ చిలుక వచ్చింది. ఇద్దరు కలిసి ఉయ్యాల జంపాల ,  జారుడు బల్ల (slide) ఇంకా monkey bars ఆడుకుంటున్నారు.[We have all these things in Canada School Grounds]

                                                                        అంతలో one కుందేలు వచ్చింది. అదీ పాపం ఏడుస్తుంది! ఎందుకు నువ్వు ఏడుస్తున్నావ్ ? అని రాజు గారు అడిగారు.మా ఇంట్లో పెట్టిన క్యారెట్లు ఎవరో తీసుకువెళ్ళి పోయారు! Please help me, అని ఏడుస్తుంది. Don't worry , We will help you అని  కుందేలుకి చెప్పి, రాజు గారి గుర్రం మీద - రాజు గారు , రామ చిలక ఇంకా కుందేలు ముగ్గురు, Rabbit house కి వెళతారు. నీ carrots ఎక్కడ పెట్టావ్ ? అని అడిగితే , ఒక సంచిలో పెట్టాను అని కుందేలు చెప్పింది.రామ చిలుక, నువ్వు వెళ్లి సంచిని వెతుకు అని చెప్పి రాజు గారు కుందేలు ఇల్లు మొత్తం search చేసారు. అంతలో రామ చిలుక వచ్చి , ఆ సంచి Fox house ముందు ఉంది అని చెప్పింది.రాజు గారు Fox ni డిష్యూం డిష్యూం  అని కొట్టి , క్యారెట్ అన్నీ తెచ్చి Rabbit ki ఇచ్చారు! Rabbit , Thanks రాజు గారు అని చెప్పి, రాజు గారికి 1 carrot , రామ చిలుక కి 1 carrot  ఇంకా రాజు గారి గుర్రానికి 1 carrot  ఇచ్చింది. ఆ carrots తినేసి వీళ్లు ఇంటికి వెళ్లిపోయారు. ఇంకా పాలు తాగేసి బొజ్జుని నిద్రపోయారు! Good job చేసారు.

 మా 3 years అమ్మాయి నాకు చెప్పిన కథ:

   అనగనగా ఒక వూళ్ళో ఒక రాజు గారు ఉన్నారు. పొద్దున్నే నిద్ర లెగిసి , brush the teeth చేసారు. వల్ల నాన్న surprise gift ఇచ్చారు.అప్పుడు అమ్మ చేసిన ఇడ్లీలు తినేసారు. ఇప్పుడు అమ్మ suprise gift ఇచ్చింది. School ground కి వెళ్ళారు.పెద్ద Dinosaurus , Candy shop మీదా attack చేసింది.Candy jars break అయిపోతున్నాయి! రాజు గారు వెళ్ళి, Don't worry Dino , Sharing చేసుకుందాము అని చెప్పి, దానికి Lollipops ఇచ్చారు. Dino వెళ్ళిపోయింది. Shop Owner రాజు గారికి చాలా Candies ఇచ్చాడు , help చేసినందుకు! రాజు గారు ఇంటికి వెళ్లి పాలు తాగి పడుకున్నారు.


No comments: