Tuesday, November 26, 2024

కనపడని Reservations మాకు కావాలోయ్ ! - Part 1

                                           రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యం మన దేశానికి ఎలా వచ్చింది! Divide and Rule.....!కుల , మతం , ప్రాంతము , ఇవన్ని వాళ్ళు పెట్టలేదు! మన దగ్గర ఉన్నాయ్! వాళ్ళు use చేసుకున్నా రు.

                                                                 పోయిన సంవత్సరం Vijayawada లో ఒక Doctor గారూ నన్ను అడిగి ప్రశ్న-  మీ అమెరికా లో కులాలు బాగా ఉన్నాయి అంట కదా ! శ్రీరెడ్డి , నాయకుడు , మనోడే! ఇలా ఉంటారు అంట కదా, అని అడిగారు. నీ అభిప్రాయం ఏంటి అని అడిగారు! ఆ Doctor గారి అమ్మాయి Philippines లో MBBS చదువుతుంది . తనకి చాలా డబ్బు పంపించాలి అని మరో పక్కా చెప్పారు. అక్కడ,  కుల పిచ్చి ఎక్కువ అంట కదా అన్నారు !

                                                                  నా సమాధానం కులాలు కావాలి sir, అని మొదలు పెట్టాను! ఒక student విధేశాలు వెళ్లి 2 years చదువుకోవడానికి 30 లక్షలు అవుతాయి అనుకుంటా! Fresher లాగ ఉద్యోగం సంపాదించి , ఆ అప్పు తీర్చడానికి చాలా కాలం పడుతుంది. అదే తెలిసిన వాళ్ళు ఉద్యోగం ఇప్పిస్తే , కొంత త్వరగా బయట పడతారు. 

                                                        ఇంకా ఇక్కడ  Degree చదివిన అమ్మాయిలు BTech వీరులు కావాలి అనుకుంటారు! BTech చదివిన అమ్మాయిలు Foreign Countries లో ఉన్న అబ్బాయిలు కావాలి అనుకుంటారు! మరి అక్కడ (US/Canada/Australia) చదువుకున్న అమ్మాయిలు , ఎవరిని పెళ్లి చేసుకుంటారు? తెల్ల వాళ్లనా!, నల్ల వాళ్లనా! లేక పక్క రాష్ట్రం వాళ్ళని? ఇక్కడే మన తల్లి దండ్రులకి కులం ఉపయోగ పడుతుంది ! అక్కడున్న మన అబ్బాయిలకు కూడా ఇక్కడ కులం ఉప్యోగపడుతుంది!

                                ఇంకా ఇక్కడ మన ఇంటి తలుపు తీసి బయటకి వెళితే , ఒక సుబ్బారావు గారు లేక ఎల్ల రావు గారు కనపడతారు! అదే కెనడాలో ఉన్నా మా 30 అంతస్థుల Apartment లో , మా తలుపు తియ్యగా , ఎదురింట్లో నల్ల వాడు ! పక్కింట్లో తెల్ల ముసలాయన! అటు పక్కనా చైనీస్ జంట! ఇంకో పక్కా అరబ్బులు! ఇలా ప్రపంచ దేశాలు అన్నీ నుండి వచ్చిన జనాలు అందరూ కనపడతారు! ఇక మీకు చిన్న పిల్లలు ఉంటే, పరిస్థితి ఇంకా నరకం! వీళ్లు ఎవరితో ఆడుకుంటారో జారత్తగా కనిపెట్టాలి, వాళ్ళు ఏమి చేస్తారో మనం చూస్తూ ఉండాలి! మొన్నా అమెరికాలో ఒక Friend ఇంటికి వెళితే , వాళ్ళు ఒక చిన్నా Community లో ఉంటున్నారు ఓక 10 Telugu Families (వాళ్లంత TCS కులం) కలిసి , పిల్లల కోలాహలం బాగుంది! మా Friendఆ గూడేనికి పెద్ద! పిల్లల్ని అందరినీ బయటకి పంపించారు ఆడుకోవటానికి ! అలా ఎలా పంపిస్తావు ? బయట ఎవరు ఉంటారో తెలియదు కదా అని అదిగాను?  వాడు ఒక నవ్వు నవ్వి ! ఇది  మన గూడెం! పిల్లలు బయటకి వెళ్ళిన దగ్గర నుండి , మన గూడేనికి ఆ చివరి నుండి , ఈ చివరి వరకు ఉన్న మన తెలుగు Moms and Dads ఒక కన్ను వేసి ఉంచుతారు! ఆడుకుని పిల్లలు ఇంటికి వచ్చేస్తారు!అని చెప్పాడు వాడు.

                                    ఇప్పుడే చెప్పండి సార్! కులాలు India లో మీకు వద్దేమో! , మాకు అమెరికాలో కావాలి అని చెప్పాను!

                                      నువ్వు చెప్పింది నిజమేనో ! ఇక్కడి వాళ్ళు , ఆ హీరో , నేను ఈ హీరో అని కొట్టుకుంటారు!కానీ హీరోలు అందరూ కలిసి మెలిసి ఉంటారు! ఎవడి బ్రతుకు వాడిది అని వీళ్ళకు ఎప్పటికి తెలుసుంటారో!అని ముగించారు.

No comments: