మొన్న Satish ఇచిన Partylo కూడా అనుకున్నాను ...ఏమైంది ఇతనికి , U.K. వెళ్ళాక ముందు బానే ఉన్నాడు , అక్కడ ఉన్నన్నాళ్ళు కుడా బానే ఉన్నట్టు చెప్పీ వాడు, కాని India రాగానే ఇలా అయిపోయాడు..........
ఇక్కడ సతీష్ = మా సీనియర్ ..... ఏదో పని మీద U.K వెళ్లి 2 నెలలు తర్వాత ఇండియాకి వచ్చి మాకు "రాయల సీమ రుచులు " అనే Restaurant lo ఒక మంచి పార్టీ ఇచ్చారు.
బహుసా ఆ Restaurant వాడు తిండి వడ్డిన్చాటానికి చాలా టైం తీసుకున్నాడు , అక్కడకు ప్రతి అర గంటకు వాడికి క్లాస్ ఇచ్చాము , చివరగా గుంటూరు మిరప కోడి విషయంలో కూడా వాడు మమ్మల్ని మోసం చేసాడు.
మిరప కోడి taste = బిర్యాని taste = పనీర్ కర్రీ taste = బెల్లం taste = తీపి.
మధ్యాహ్నం 1 కి వెళ్లి , వాడు 2:30 కి Food పెట్టటం వల్ల మా టీం అందరకి ఆ Taste వచ్చింది ఏమో అనుకుంటూ తినేసాము...........
ఇంకా ఆ విషయాన్ని గుర్తు చేసుకుని Feel అవుతున్నాడు ఏమో ...... ఇతనికి " గతం గతః " అని ఎలా చెప్పాలా అని తెగ ఆలోచించాను.
===========
ఇంతలో మా రమేష్ వచాడు మా floor కి.రావటం తోనే పెద్ద గొడవ చేసాడు.
మొన్న వాళ్ళ familyతో బదినాథ్ సినిమాకి వెళ్ళాడు అట.
దానిలో హీరో గాలిలోకి అలా పైకి , పై పైకి ఎలా వెళ్ళాడో అస్సలు అర్థం కాలేదు అట...... !
ఇంకా ఒక కొండ మీద నుండి ఇంకో కొండ మీదకు ఎలా ఎగిరాడో కూడా అర్థం కాలీదు అట.....!
ఇంకా ఒక కత్తి పట్టుకుని , మెషిన్ guns విరకోట్టేస్తాడు ఇది కూడా అ ........!
అయినా దేవుడు = గొప్పవాడు , ఇంకా అందర్నీ రక్షించే వాడు , మళ్ళీ ఆయనకు ఇంకొక రక్షకుడా.. ........!
ఇలా ప్రశ్నల వర్షం కురిపిస్తున్నాడు......అది విని నేను ఒక్క సారిగా పైకి లేచి ....Practice makes a man Perfection అంటారు.అందుకనే కదా హీరో చిన్నప్పటి నుండి ప్రకాష్ రాజ్ దగ్గర traning తీసుకున్నాడు. నువ్వు కూడా training తీసుకుంటే , నువ్వు కూడా గాల్లో ఎగురుకుంటా officeకి వచ్చే వాడివి. ఇంకా ఎక్కడకు వెళ్ళాలి అన్నా గాల్లో ఎగురుకుంటా వెళ్ళీ వాడివి అన్నాను.
అయినా రమేష్ వెనక్కు తగ్గలేదు. ఇక లాభం లేదు అని మా సుబ్బు గారు రంగంలోకి దిగారు.
సుబ్బు : ఏమయ్యా రమేష్ ! Hollywood సినిమాలో హీరో గాల్లోకి ఎగిరితే ఏమి మాట్లాడావ్ , ఇక్కడ మన తెలుగు వాళ్ళే aa stunts చేస్తే మాత్రం పీర్లు పెడతావా..... నిజంగా మీ లాంటి వాళ్ళ వల్ల మన తెలుగు సినిమా కి పీరు రావటం లేదయ్యా అన్నారు..........
===============
ఇక మనం వెనక్కి తగ్గోచు అనుకుంటూ సతీష్ గారిని చూసాను ...ఆయన మనసులో ఏదో గొనుగుతున్నారు........ కాస్త పైకి చెప్పండి అన్నాను.... అప్పుడు సతీష్ గారు చెప్పారు " నేను U.K. నుండి వస్తున్నప్పుడు flightలో వరుడు సినిమా చూసాను! . ఇంటికి వచ్చిన తర్వాత మా family అంతా కలిసి బద్రీనాథ్ సినిమా కి వెళ్లాం."
1 comment:
paapam sathish aa shock nunchi inkaa tearukoledu anukuntaa
Post a Comment