Sunday, June 12, 2011

నీరు ............ ఉచితం -> అనుచితం -> ప్రియం-> ? Wat Next

"విజయవాడ Bus-stand లో ఎలాగైనా సరే మంచి నీళ్ళు పట్టుకుని తాగాలి " అని అనుకుంటూ మా ఊరి bus దిగాను. దిగి , దిగటం తోనే పరిగెత్తుకుంటూ మ0చి నీళ్ళ ట్యాంక్ దగ్గరకు వెళ్లాను.......... వెళ్తున్నప్పుడు నా పక్కన ఉన్న Cool Drinks shop ని గమనించలేదు , వాడి దగ్గర టన్నులు టన్నులు గా ఉన్న మంచి నీళ్ళ TIN లను అస్సలు గమనించలేదు.........
ఆశ్చర్యం!.......అక్కడ నీళ్ళు రావటం లేదు.పాపం ఇది చెడిపోయింది ఏమో .....! పక్కన ఉన్న ఇంకో water tank దగ్గర చూద్దాం అని వెళ్లాను.....అది కూడా పని చెయ్యటం లేదు.....ఒక పక్కన మంచి నీళ్ళు బాగా అవుతున్నాయి, ఏమి చేద్దాం అని తల పక్కకి తిప్పి చూడగానే , ఇంకో Cool Drink shop కనిపించింది....హమ్మయ్య అని ప్రాణం పైకి వచ్చింది........వెంటనే ఇంకో ఆలోచన లేకుండా వాడి దగ్గర కి వెళ్లి నా నిండా చల్లని మంచి నీళ్ళు పోయిన్చుకున్నాను.

మనకు ఈ మధ్య లోకంలో అన్ని విషయాల మీద ఆసక్తి పెరిగిపోయింది కదా... వెంటనే ఆ వాడిని అడిగాను, ఏమయ్య పక్కనే water tank పెట్టుకుని మరీ మంచి నీళ్ళు ఎలా అమ్ముతున్నావ్ అని అడిగాను....వాడు ఒక నవ్వు నవ్వి అది "బిజినెస్ సేక్రేట్ సర్" అన్నాడు!


బాబు నేనేమి cool drink shop పెట్టుకోను, ముందు ముందు కూడా పెట్టె ఆలోచన లేదు కాబట్టి నాకు నిరభ్యంతరంగా చెప్పొచు అని అభయం ఇచేసాను. ఏదో రహస్యం చెపుతున్నట్టు చిన్న గొంతుతో చెప్పాడు ..... "ఈ Bus stand మొత్తం మీద ఒక్క water tank కూడా పని చెయ్యదు. మీరు జాగ్రత్తగా observe చేస్తే , ప్రతి water tank పక్కన ఒక cool drink shop ఉంటుంది....."అదే మా సేక్రేట్ ఇక మీరు వెళ్ళండి అన్నాడు.

"అప్పుడు అర్థం అయ్యింది బ్రహ్మం గారు చెప్పినట్టు మంచి నీళ్ళు దొరక్క , చచినట్టు వీళ్ళ దగ్గర water కొంటారు."
======================
ఇందుకనేనేమో Railway station లో కూడా ఒక్క Tap కూడా పనిచెయ్యదు.అది మన భారత దేశం మొత్తం ఒక్క ఒక్క bus station లేదా railway లో కూడా మంచి నీళ్ళు దొరకవు. కాబట్టి మొత్తం travelling జనాలు అందరు తప్పని సరిగా మంచి నీళ్ళు కొనుక్కుని తాగుతారు.
================
ఇదే విషయం రేపల్లెలో ఉండే నా ఫ్రెండ్ రాజేష్ కి ఫోన్ చేసి చెప్పాను.వాడు వెంటనే అవునురా మాకు కుడా "సుజలాం సుఫలాం" వచ్చింది అన్నాడు. వీడికి ఏదో అయ్యింది , బహుశా నిద్రలో ఉన్నాడేమో అనుకుని , మళ్లీ నేను చెప్పాను " ముందు ఈ మంచి నీళ్ళ company (Kinley,Bibo) వాళ్ళని ban చేస్తే బాగుంటుంది , వాళ్ళ bottles అమ్మటం కోసం జనాలకి ఉచితమగా దొరికే మంచి నీళ్ళను ఈ shop వాళ్ళు చెదగోడుతున్నారు ,ఇది మన దేశం మొత్తం ఉంది అని అనుకుంటుంటే చాల బాధగా ఉంది రా అన్నాను.................... మళ్ళీ వాడు (Rajesh) " మా ఊరిలో సుజలాం సుఫలాం ఉందిగా "అన్నాడు.....
నాకు ఎక్కడో కాలింది , మీ ఊరికేరా , అది కృష్ణ నది ఒడ్డున ఉంది కాబట్టి చక్కగానే "సుజలాం" గానే ఉంటుంది , పచగా పొలాలు ఉంటాయి కాబట్టి "సుఫలాం" గానే ఉంటుంది అన్నాను...... మా వాడు ఒక్కసారి నవ్వి "సుజలాం సుఫలాం" అంటే పల్లెటూర్లలో మంచి నీళ్ళు అమ్మే Government company లు అన్నాడు.నాకు ఒక్క సారే shock . "అయినా పల్లెటూర్లలో మంచి నీళ్ళు ఎవరు కొంటారు రా....! "అని అడిగాను. అందుకనే కదా మీ హైదరాబాద్ లో 20 lires bottle = 25 Rs ..ఇక్కడ మాకు only 2 Rupees అన్నాడు.....................................
ఓహో ప్రగతి పథంలో మన రాష్ట్రం అంటే ఇదేనేమో అనుకున్నా...!
==================
అలా అనుకుంటూ నిద్రపోయాను...... ఒక్కసారిగా బస్సు ఆగిపోయింది , నాకు అర్థం కాలేదు..అప్పుడే హైదరాబాద్ వచామా అని అనుకుని బస్సు దిగాను.....ఎదురుగా బాలకృష్ణ సినిమా షూటింగ్ జరుగుతుంది,

జయప్రకాశ్ రెడ్డి : బాలయ్యని చూస్తూ అంటున్నాడు : బాలయ్య ,నువ్వు మా ఊరు వచ్చావ్ , మా ఇంటికి వచ్చావ్ , మానట్టింటికి వచ్చావ్ ......మా సిమ్రాన్ ని తీసుకు పోయావ్ ....అయినా నేను పట్టించుకోలేదు.... కాని నువ్వు మా ఇనుప బీరువాలో దాచుకున్న మంచి నీళ్ళు తాగేసావ్ ......అందుకేరా మీ ఇంటి మీద బాంబు వేసాను.

బాలయ్య : తప్పు చేసావ్ జయప్రకాశ్ రెడ్డి , మంచి నీళ్ళు తాగుతున్న సింహాన్ని లేపావ్ . ఇప్పుడు మీ ఇంట్లో దాచిన నీళ్ళనే కాదు , మా పక్కింట్లో , ఇంకా ఎదురు ఇంట్లో దాచుకున్నా నీళ్ళను కుడా తాగేస్తాను .......నువ్వేమి చేస్తావో చూస్తాను అని తోడ కొట్టాడు .

పక్కనే ఉన్నN.T.R (Junior) గట్టిగా క్లాప్స్ కొట్టి , బాబాయ్ మొన్న పోకిరి పార్ట్-4 లో మహేష్ బాబు చెప్పిన : ఒక్కసారి కమిట్ ఐతే "నువ్వు మంచి నీళ్ళు ఇచినా కాని" నీ మాట నేను వినను అనే dialogue కన్నా ఇది చాలా బాగా వచ్చింది అన్నాడు.


బాలయ్య : ఏహా , అది కాదు Junior మొన్న Indra - Part2 లో చిరు చెప్పిన " సై అంటే సెకను కి ఒక వాటర్ బాటిల్ తాగుతా "అనే dialogue కన్నా బాగుందా అని అడిగాడు.

N.T.R : మొన్న బృందావనం-part 5 లో నేను చెప్పిన " సిటీ వాడు కదా సాఫ్ట్ గా ఉంటాడు కదా అని అనుకుంటున్నారేమో ...... క్యారెక్టర్ కొత్తగా ఉంది కదా అని గ్లాస్ తో water తాగుతున్నా , లోపల దాహం అలానే ఉంది ...అది పైకి తీసానో పీపాలు పీపాలే....." దీనికన్నా నీ dialogue బాగుంది బాబాయి అన్నాడు.

అయినా బలయ్యకి ఇంకా ఎక్కడో సందేహంగానే ఉంది , అది గమనించిన పరుచూరి సోదరుడు అన్నాడు : బాలయ్య , నువ్వేమి దిగులు పడొద్దు మొన్న అల్లు అర్జున్ వేదం part 4 లో చెప్పిన " ఛి దీనమ్మ జీవితం దొబ్బెయ్యటానికి బీరు బాటిల్ అయినా దొరుకు తుంది కాని మంచి నీళ్ళ బాటిల్ మాత్రం దొరకటం లేదు" - ఈ dialogue కన్నా మనదే చాలా బాగుంది అన్నాడు.

ఇంకా బాలయ్య అనుమానంగా చూస్తుంటే , ఇక లాభం లేదు అని డైరెక్టర్ B.Gopal బాలయ్య జిందాబాద్ అని అరిచాడు , పక్కనే ఉన్న unit వాళ్ళు అంతా బాలయ్య జిందాబాద్ అనారు , నేను కుడా వాళ్ళతో పాటు " బాలయ్య జిందాబాద్ , బాలయ్య జిందాబాద్ అని అరవటం ప్రారంభించాను"...... ఇంతలో ఒక్క సరిగా నా మొహం మీద నీళ్ళు పడ్డాయి ..........

===================================
నాకు చాల కోపం వచ్చింది ....... "నీళ్ళు చాలా అముల్యమైనవి , వాటిని నా మొహం మీద ఎవడ్ర చల్లింది అని చూసాను" ....


నా పక్కన ఉన్న వాళ్ళు అందరు విచిత్రంగా నన్ను చూసి హైదరాబాద్ వచ్చింది నిద్ర లెగిసి , బస్సు దిగు అన్నారు....!

No comments: