Saturday, March 14, 2009

దెయ్యం .........భూతం ....ఆత్మ! [Ramana certificate:U/U]

మీరు దేవుణ్ణి నమ్ముతారా! ఐతే దెయ్యాన్ని కూడా నమ్మాలి.
Proof : గాలిని చూపించు , ప్రాణాన్ని చూపించు.......దేవుణ్ణి చూపించు , దెయ్యం కూడా అంతే!
నీకు ఏమి పోయేకాలమ్ వచ్చింది వీటి పైన పడ్డావ్ అంటారా!మొన్న అరుంధతిలో ఈ డైలాగ్ విన్న వెంటనే , నేను చిన్నప్పుడు చదివిన ఒక article గుర్తుకు వచ్చింది.It is worth of reading......
-------------------------------------
దెయ్యాలు నిజంగానే వున్నాయి అండి. వాటి ఫ్రెండ్స్ మన భూతాలు మరియు ఆత్మలు.
Question : ఇంతకూ దెయ్యాలు ఎలా వస్తాయి!
Answer : పిచ్చి వాడా ఇది కూడా తెలియదా ? ఎన్ని సినిమాలలో చూసాం. ఎవరికి అయినా బాగా తీరని కోరికలతో చని పోయినప్పుడు, లేక వాళ్ళను పిచ్చి పిచ్చిగా బాధ పెట్టి చంపీస్తే వాళ్ళు ఇలా తయ్యారు అవుతారు.
Good answer , మీకు నిజంగానే cinema knowledge బాగా వుంది.
ఒక్కసారి మనం మన ఆదివారాన్ని గుర్తు చేసుకుందాం. అంటే దెయ్యాలు ఆదివారం వస్తాయి అని కాదు. సాధారణంగా చాలా మంది ఆదివారం మాంసాహారానికి వెళ్తారు కదా. అది ఎలా వస్తుంది? కొన్ని కోళ్ళు , చేపలు , మేకలు , గొర్రెలు ........ఇలా వాళ్ళ వాళ్ళ ఆనందాన్ని బట్టి .......వాటి వాటి ప్రాణాల్ని తీసీస్తారు కదా.......
చాలా బాగా చెప్పావ్ నువ్వు , ఇప్పుడైనా ఈ మాంసం తినే వెధవలకి బుధి వస్తుంది .......అని అనుకోవద్దు.
జగదీస్ చంద్రబోస్ అనే ఆటను మొక్కలకి కూడా ప్రాణం వుంటుంది అని చెప్పారు............!
ఇలా మొక్కలు , జంతువులు అని మనం తేడా లేకుండా చంపేస్తూ వుంటే , అవి కూడా మనల్ని చంపే ఈ మనుషుల్ని యీమైనా చెయ్యాలి అనే తీరని కొరికతో చచ్చి పోతాయి........
So as per our normal theory->"ఎవరికి అయినా బాగా తీరని కోరికలతో చని పోయినప్పుడు, లేక వాళ్ళను పిచ్చి పిచ్చిగా బాధ పెట్టి చంపీస్తే వాళ్ళు దెయ్యాలుగా మారతారు".
అలా మన చుట్టూ కొన్ని వేల....కాదు కాదు కొన్ని లక్షల ..... hmmmm,ఇది కూడా తక్కువే...... కొన్ని కోట్ల ఆత్మలు తిరుగుతూ వుండాలి.
మరి దెయ్యాలు నిజం ఐతే , మన తెలుగు సినిమా వాళ్ళు కోడి పగ , గొర్రి ఆత్మ, మేక చేసిన సవాల్ ....ఇలాంటి సినిమాలు తియ్యాలి.
కాని నేను ఇప్పటి వరకు ఇలాంటివి(movies) చూడ లేదు. కాబట్టి నేను దెయ్యాల్ని నమ్మటం కొద్దిగా కష్టం.......ఇంకా చెప్పాలి అంటే , కనపడే మీ మేనేజర్ ( మేనేజర్లు ఎవరైనా ఈ పోస్ట్ చదివితే క్షమించండి! సాధారణంగా employs కి మేనేజర్ లు అలానే అనిపిస్తూ వుంటారు !) దెయ్యం అంటే నమ్ముతానేమో కాని , కనపడని దెయ్యాల్ని ఎలా నమ్మాలి అండి!
-----------------------------
నాకు తెలిసి నా చిన్నప్పటి నుండి ఒకే ఒక్క దెయ్యం వుంది ......అది కూడా కొరివి దెయ్యం..... మళ్లీ ఇది ఎక్కడి నుండి వచ్చింది అంటారా .....మరి నా ఫ్రెండ్స్ చెప్పీవారు, వాళ్ళు స్మశానంలో ఏమి లేక పోయినా మంటలను చూసాం అని. మరీ ఫ్రెండ్స్ని నమ్మక పొతే ఇంకా ఎవర్ని నమ్ముతాము .......
కాని మా 7th క్లాసు లో మా సైన్సు సర్ ఏడుకొండల రావు గారు అది కూడా తప్పు అని చెప్పేసారు.
గాలి ( ఆక్సిజెన్) + calcium (bones)-> కొరివి దెయ్యం అదేనండి "మంటలు " అని తీల్చి చెప్పేసారు......
---------------------
ఇక అప్పటి నుండి మనకు దెయ్యం లేదు భూతం లేదు....... యీమైనా వుంటే మేనేజర్ మాత్రం వున్నారు!

10 comments:

Anonymous said...

దెయ్యం లేదు భూతం లేదు....... యీమైనా వుంటే మేనేజర్ మాత్రం వున్నారు!

:). Correct. Manager ni minchina deyyamaa?? Never..:D

Mahitha said...

managers lo kuda manchi vallu untaru.

:)

Mahitha said...
This comment has been removed by the author.
Ramana said...

అరుణ గారు,
మీరు కూడా దెయ్యం బాధితులే అన్నమాట.....!
సర్లెండి, మనకు టైం వస్తుంది , మనము దెయ్యం అవుతాము......అదేనండి మేనేజర్!

మహి గారు,
దెయ్యాల్లో మంచి దెయ్యాలు కూడా వుంటాయి అంటారు........okay,agreed...
కాని ఇప్పటి వరకు మంచి దెయ్యం ఒక్కటి కూడా తగల్లేదు అండి!

సూర్యుడు said...

@Ramana:

దెయ్యం పోయి భూతం పట్టుకుంటే అప్పుడు తెలుస్తుంది (తగిలాయని) ;)

Ramana said...

సూర్యుడు గారు ,
ఆల్రెడీ ఇక్కడ ఒక దెయ్యం నన్ను పట్టుకుంది అండీ,( మా మేనేజర్!)
మీరు ఇంకా భూతం కూడా అని భయపెట్టకండి! plz...
:)

Anonymous said...

hehehehe..

nenu ippatiki Dayyala(maa manager) veta lone unnanu :(

Ramana said...

Nelabaaludu gaaru,

may god bless u with a gud ghost.....

Anonymous said...

deyyala naku chaaaaaalllllaaaaaa bayam............. ilantivi raasi bayapettakandi..... ee bayam tho raathri puta nidra pokunda office lo day time nidra pothuna...... nenu lechesariki yedurugu maa tl vachi korimi deyyam la nilabadathadu..... sarlendi yem chestham meeru alage deyyala gurinchi raasthu undandi..... eelopu nenu maa tl ni yelabayapettala ani alochistha.....

Ramana said...

:)