హమ్మయ్య ,
ఇకనైనా నేను తమిళియన్ కాదు , మాకు ఒక రాష్ట్రం వుంది. మాది ఆంద్ర ప్రదేశ్ అని మా నార్త్ వాళ్లకు ఇక చెప్పాల్సిన అవసరం ఇక లేదు.
ఒక రెండు వారాల నుండి నేషనల్ న్యూస్ చానెల్స్ వాళ్ళ పుణ్యమా అని నాకు ఒక బాధ తప్పింది.
నిన్న మొన్నటి వరకు నాకు నచ్చనిది , తెలుగు వాళ్లకి ఒక రాష్ట్రం వుంది అని తెలియదు అని చెపితే!
నా పంజాబ్ , ఢిల్లీ colleagues కి ఈ విషయం తెలియదు లెండి.
ఇప్పుడు మన KCR పుణ్యమా అని తెలుగు వారి పవర్ , వాళ్ళ ఆత్మ గౌరవం క్షమించాలి తెలంగాణా వాళ్ళ ఆత్మ గౌరవం...... ప్రపంచానికి అంతా తెలిసింది.
ఇప్పుడు ప్రతి ఛానల్ లోను మన ఆంధ్ర , తెలంగాణా రగిలి పోతుంది. నిన్న మొన్న టి వరకు నాకు సరిగ్గా ప్రచారం జరగలీడు అని అనుకునే చోటా మోటా నాయకులు అందరు చక్కగా టి. వి. లో తన్నుకున్టున్నారు. స్టూడెంట్స్ చక్కగా ఎగ్జామ్స్ కి డుమ్మా కొడుతున్నారు. వాళ్లకి బుద్ధి చెప్పాల్సిన ప్రోఫెసోర్స్ , మీరైనా సాధించండి ,మీ వెనక మేము వున్నాం అని ముందుకు తోస్తున్నారు.
దానికి తోడూ నన్ను కొట్టింది --- ప్రాంత పోలీసు అని వీళ్ళ అరుపులు , కేకలు. ఇలాంటివి సమాజానికి మంచిది కాదు , కులం పేరు అడిగితె చెప్పు తో కొట్టండి అని slogans ఇచే టి వి వాళ్ళు కూడా , వీటినే ప్రధానంగా చూపిస్తున్నారు.
మొన్న ఒకరు అన్నం తినలేదు అని మన సోనియా తన birth day కి అయినా తింటాడు అని వాళ్ళు అడిగింది ఇచారు. చాలా బాగుంది.ఈ రోజు విజయవాడ లో ఇంకా కొంత మంది కూడా రెడీ అయ్యారు.వాళ్ళు అడిగింది ఇస్తే , పాపం మన దేశం లో నిజం గా "food కి lottery" కొట్టే వాళ్ళు చాలా మంది వున్నారు , వాళ్ళు కూడా 50 రూపాయలు పెట్టి ఒక banner కొనుక్కుని , నాకు ఇది కావాలి అని నిరాహార దీక్ష చేస్తే ఆ అమ్మ పుణ్యమా అని కొద్దిగా డబ్బులు , టి వి వాళ్ళ పుణ్యమా అని కొద్దిగా పేరు వస్తుంది.
ఇక్కడ మనకి చాలా కష్టాలు వుండో చ్చు. మనల్ని చాలా మంది మోసం చెయ్యొచు . వీటి అన్నిటికే కారణం మా పక్కింటి వాడు అనుకుంటే నే అస్సలు ప్రాబ్లం.
మన అతి తెలివి నాయకులూ చేస్తున్న వాటి పరిణామాలు ఇప్పటికే మొదలు అయ్యాయి.
మన రాష్ట్రానికి రాష్ట్రపతి పాలన రావోచు.
మన రాష్ట్రం వైపు కొన్నాళ్ళు చూడొద్దు అని అమెరికా తన పౌరులకు జాగ్రత్తలు.
మన రాష్ట్రం లో ఎందుకు కంపెనీ పెట్టామా అని MNCs వాళ్ళ బాధ.(bcos our clients are facing severe problem with our absence).
యే హైదరాబాద్ కావాలి అనుకున్నమూ దానికి ఇక ముందు companies రాక పొవచు.
ఈ రాష్ట్రం కోసం కష్ట పడుతున్న ప్రతి ఒక్కళ్ళకి నమస్కారాలు , మీరు చేస్తున్న వాటికి పర్వ్యసానం యేమి అవుతుందో ఒక్క సారి ఆలోచించండి. జరగాల్సిన నష్టం ఇప్పుడే మొదలయ్యింది.
ఇది పూర్తిగా జరిగితే ఈ రోజు మిమ్మల్ని పొగిడిన వాళ్ళే రేపు .......
ఇక నైన future కోసం ఆలోచించండి, not for urs.......for our state.
1 comment:
Good.
Post a Comment