ఈ రోజు శనివారం కదండీ ! నా మనసులోకి మళ్లీ వైరాగ్యం వచ్చే సింది.hmmm , కొద్దిగా అర్థం అయ్యేలా చెప్పరా బాబు అంటారా...అదే నండి మాములుగా శనివారం , ఆదివారం శలవలు కదా , కాని నేను 24*7 project లో పని చేస్తున్నా .ఈ రోజు చాలా బాధగా వుంది. నా చిన్నప్పటి ఫ్రెండ్ కూడా వస్తున్నాడు నన్ను కలవటానికి.ఐతే సంతోషం గా వుండమంటారా! వాడు వచ్చేది నా ఆఫీసు కి!
---------------
ఒక్క సారి నా స్కూల్ డేస్ గుర్తుకు వచ్చేసాయ్. ఒరేయ్ మన సర్ ఆదివారం ప్రైవేటు క్లాసు పెట్టారు అని ఎవడైనా చెపితే, వాళ్ళను వెళ్లొద్దు అని , దాని వల్ల మనకు exam లో ఆ topics ఇవ్వరు కదా అని పిచి పిచి సలహాలు కూడా ఇచే వాడిని.నేను leader కాబట్టి నేను చెప్పిందే వేదం!మా వాళ్ళు చక్కగా follow అయ్యేవారు.ఇక ఇంట్లో మాత్రం ప్రైవేటు క్లాసు అని క్రికెట్ ఆడు కోవటానికి వెళ్లి పోయీవాళ్ళం.మా వాళ్ళ దృష్టి లో మాకు ప్రతి ఆదివారం ప్రైవేటు క్లాసు వుండేది!
---------------
సరిగ్గా 2 సంవత్సరాల క్రితం నాకు తెలిసింది , నేను night shift చెయ్యాలని, మా ఇంట్లో అడిగాను మానేయ్యనా అని ! ఇంటి దగ్గరే వుంటావు కదా ప్రాబ్లం వుండదులే అన్నారు. ఐనా కష్టమీమో అన్నాను. అప్పుడు మా నాన్న క్లాసు పీకారు. night shift గురించి ఇంకా 24*7 గురించి నీకు ఏమి తెలుసురా ! నువ్వు ఇంకా పిల్లాడివి ఈ దేశం మొత్తం కూడా nightshift చేసే వాళ్ళ మీదే ఆధార పడి పని చేస్తున్ది.Doctors , truck drivers , police ,bus and train drivers , politicians , border soldiers .........ఇలా వీళ్ళంతా రాత్రనకా పగలనకా కష్ట పడుతుంటే , నీకు ఏమి తెలియటం లేదు.!అది వినగానే ఏదో మన సాయి కుమార్ డైలాగ్ వుంది కదా ఆ "కనపడని నాలుగో సింహం యేరా ఈ పోలీసు ....కాదు కాదు ఈ రమణ గాడు" అని అనిపించింది.
------------------------------
కాని ఆ తర్వాత మొదలయ్యింది ....... మాకు 1 month night shift and one month day shift .మా టీం లో వున్నా అందరు రెగ్యులర్ గా 1 month nightshift complete చేసి 1 week hospital లో గడిపేస్తారు.ఇక కాస్తో కుస్తో , మాములుగా వున్దేది నేను కాబట్టి చాలా సార్లు నేనుnee night shift కూడా చేస్తాలె అని వాళ్ళ బదులు కూడా చీసేవాడిని.1st లో నేను కూడా పట్టించు కొలేదు. ఈ మధ్యనే మా అమ్మ చెపుతుంది..... మా ఇంటి పక్కన కొత్తగా వచ్చే వాళ్ళు ఎప్పుడూ తన దగ్గర బాధ పడతారు అట! ఏమని అంటారా ....." పాపం మీ అబ్బాయి పని పాట చెయ్యకుండా ఎప్పుడు అలా ఇంట్లో వుంటుంటే మీకు మాత్రం బాధగా వుండదా ! మాకు తెలిసిన చోట చిన్న వుద్యోగం ఇప్పిస్తాం చీస్తాడా అని! "
ఇక ఫ్రెండ్స్ ఐతే నన్ను కాంటాక్ట్ లిస్టు లో నుండి డిలీట్ చేసి సంవత్సరం పైనే అవుతుంది!
వీడు మనిషి కాడు. ఒక టైం లేదు, ఒక పండగ లేదు. ఒక హాలిడే లేదు. ............. ఇలా వుంటుంది అన్న మాట.
------------------------
ఇలాంటి పిచ్చి పిచ్చి కండిషన్స్ మధ్యలో బ్రతికే నా లాంటి సోదర సోదరి మణులకు నా ఈ post అంకితం.
ఇక వాళ్లకి ఒక గర్ల్ / బాయ్ ఫ్రెండ్ వుంటే ఆ జీవితం పూర్తిగా నరకం.
-------------
నాకు మాత్రం ఇంకొక 6 months time వుంది to move out of this project.Im eagerly waiting for that day.
4 comments:
హ హ్హ హ్హా భలే ఉంది మీ నాన్నగారి ఉపదేశం ;)
కనబడని నాలుగో సింహం .. కాల్ సెంటార్లో నైట్ షిఫ్టు వర్కర్ .. నిజమే.. ఈనాడూ ఈ చరాచర జగత్తంతా వాళ్ళ సపోర్టు లేకుండా నడవదు కదా! :)
ప్చ్ ....రమణ గారూ !:(
మీరు సైతం ......:)
జీడిపప్పు గారు ,
ఇది మచ్చుకు ఒకటే నండి!
----------
కొత్త పాళీ గారు,
ధన్య వాదములు అండి. మా కష్టాలు అర్థం చేసుకున్నన్దుకు. (కాని నేను కాల్ సెంటర్ వాణ్ని కాదండి! ఇది మాత్రం కొద్దిగా బాధతో!)
-----------
పరిమళం గారు ,
ఏమి చేస్తామ్ అండి , evry dog has its day...so waiting for tat day.....
Post a Comment