Saturday, December 12, 2009

తెలుగు వెలుగు ...... simply blasting

హమ్మయ్య ,
ఇకనైనా నేను తమిళియన్ కాదు , మాకు ఒక రాష్ట్రం వుంది. మాది ఆంద్ర ప్రదేశ్ అని మా నార్త్ వాళ్లకు ఇక చెప్పాల్సిన అవసరం ఇక లేదు.
ఒక రెండు వారాల నుండి నేషనల్ న్యూస్ చానెల్స్ వాళ్ళ పుణ్యమా అని నాకు ఒక బాధ తప్పింది.
నిన్న మొన్నటి వరకు నాకు నచ్చనిది , తెలుగు వాళ్లకి ఒక రాష్ట్రం వుంది అని తెలియదు అని చెపితే!
నా పంజాబ్ , ఢిల్లీ colleagues కి ఈ విషయం తెలియదు లెండి.

ఇప్పుడు మన KCR పుణ్యమా అని తెలుగు వారి పవర్ , వాళ్ళ ఆత్మ గౌరవం క్షమించాలి తెలంగాణా వాళ్ళ ఆత్మ గౌరవం...... ప్రపంచానికి అంతా తెలిసింది.

ఇప్పుడు ప్రతి ఛానల్ లోను మన ఆంధ్ర , తెలంగాణా రగిలి పోతుంది. నిన్న మొన్న టి వరకు నాకు సరిగ్గా ప్రచారం జరగలీడు అని అనుకునే చోటా మోటా నాయకులు అందరు చక్కగా టి. వి. లో తన్నుకున్టున్నారు. స్టూడెంట్స్ చక్కగా ఎగ్జామ్స్ కి డుమ్మా కొడుతున్నారు. వాళ్లకి బుద్ధి చెప్పాల్సిన ప్రోఫెసోర్స్ , మీరైనా సాధించండి ,మీ వెనక మేము వున్నాం అని ముందుకు తోస్తున్నారు.

దానికి తోడూ నన్ను కొట్టింది --- ప్రాంత పోలీసు అని వీళ్ళ అరుపులు , కేకలు. ఇలాంటివి సమాజానికి మంచిది కాదు , కులం పేరు అడిగితె చెప్పు తో కొట్టండి అని slogans ఇచే టి వి వాళ్ళు కూడా , వీటినే ప్రధానంగా చూపిస్తున్నారు.



మొన్న ఒకరు అన్నం తినలేదు అని మన సోనియా తన birth day కి అయినా తింటాడు అని వాళ్ళు అడిగింది ఇచారు. చాలా బాగుంది.ఈ రోజు విజయవాడ లో ఇంకా కొంత మంది కూడా రెడీ అయ్యారు.వాళ్ళు అడిగింది ఇస్తే , పాపం మన దేశం లో నిజం గా "food కి lottery" కొట్టే వాళ్ళు చాలా మంది వున్నారు , వాళ్ళు కూడా 50 రూపాయలు పెట్టి ఒక banner కొనుక్కుని , నాకు ఇది కావాలి అని నిరాహార దీక్ష చేస్తే ఆ అమ్మ పుణ్యమా అని కొద్దిగా డబ్బులు , టి వి వాళ్ళ పుణ్యమా అని కొద్దిగా పేరు వస్తుంది.

ఇక్కడ మనకి చాలా కష్టాలు వుండో చ్చు. మనల్ని చాలా మంది మోసం చెయ్యొచు . వీటి అన్నిటికే కారణం మా పక్కింటి వాడు అనుకుంటే నే అస్సలు ప్రాబ్లం.



మన అతి తెలివి నాయకులూ చేస్తున్న వాటి పరిణామాలు ఇప్పటికే మొదలు అయ్యాయి.
మన రాష్ట్రానికి రాష్ట్రపతి పాలన రావోచు.
మన రాష్ట్రం వైపు కొన్నాళ్ళు చూడొద్దు అని అమెరికా తన పౌరులకు జాగ్రత్తలు.
మన రాష్ట్రం లో ఎందుకు కంపెనీ పెట్టామా అని MNCs వాళ్ళ బాధ.(bcos our clients are facing severe problem with our absence).
యే హైదరాబాద్ కావాలి అనుకున్నమూ దానికి ఇక ముందు companies రాక పొవచు.

ఈ రాష్ట్రం కోసం కష్ట పడుతున్న ప్రతి ఒక్కళ్ళకి నమస్కారాలు , మీరు చేస్తున్న వాటికి పర్వ్యసానం యేమి అవుతుందో ఒక్క సారి ఆలోచించండి. జరగాల్సిన నష్టం ఇప్పుడే మొదలయ్యింది.
ఇది పూర్తిగా జరిగితే ఈ రోజు మిమ్మల్ని పొగిడిన వాళ్ళే రేపు .......
ఇక నైన future కోసం ఆలోచించండి, not for urs.......for our state.

Saturday, March 14, 2009

దెయ్యం .........భూతం ....ఆత్మ! [Ramana certificate:U/U]

మీరు దేవుణ్ణి నమ్ముతారా! ఐతే దెయ్యాన్ని కూడా నమ్మాలి.
Proof : గాలిని చూపించు , ప్రాణాన్ని చూపించు.......దేవుణ్ణి చూపించు , దెయ్యం కూడా అంతే!
నీకు ఏమి పోయేకాలమ్ వచ్చింది వీటి పైన పడ్డావ్ అంటారా!మొన్న అరుంధతిలో ఈ డైలాగ్ విన్న వెంటనే , నేను చిన్నప్పుడు చదివిన ఒక article గుర్తుకు వచ్చింది.It is worth of reading......
-------------------------------------
దెయ్యాలు నిజంగానే వున్నాయి అండి. వాటి ఫ్రెండ్స్ మన భూతాలు మరియు ఆత్మలు.
Question : ఇంతకూ దెయ్యాలు ఎలా వస్తాయి!
Answer : పిచ్చి వాడా ఇది కూడా తెలియదా ? ఎన్ని సినిమాలలో చూసాం. ఎవరికి అయినా బాగా తీరని కోరికలతో చని పోయినప్పుడు, లేక వాళ్ళను పిచ్చి పిచ్చిగా బాధ పెట్టి చంపీస్తే వాళ్ళు ఇలా తయ్యారు అవుతారు.
Good answer , మీకు నిజంగానే cinema knowledge బాగా వుంది.
ఒక్కసారి మనం మన ఆదివారాన్ని గుర్తు చేసుకుందాం. అంటే దెయ్యాలు ఆదివారం వస్తాయి అని కాదు. సాధారణంగా చాలా మంది ఆదివారం మాంసాహారానికి వెళ్తారు కదా. అది ఎలా వస్తుంది? కొన్ని కోళ్ళు , చేపలు , మేకలు , గొర్రెలు ........ఇలా వాళ్ళ వాళ్ళ ఆనందాన్ని బట్టి .......వాటి వాటి ప్రాణాల్ని తీసీస్తారు కదా.......
చాలా బాగా చెప్పావ్ నువ్వు , ఇప్పుడైనా ఈ మాంసం తినే వెధవలకి బుధి వస్తుంది .......అని అనుకోవద్దు.
జగదీస్ చంద్రబోస్ అనే ఆటను మొక్కలకి కూడా ప్రాణం వుంటుంది అని చెప్పారు............!
ఇలా మొక్కలు , జంతువులు అని మనం తేడా లేకుండా చంపేస్తూ వుంటే , అవి కూడా మనల్ని చంపే ఈ మనుషుల్ని యీమైనా చెయ్యాలి అనే తీరని కొరికతో చచ్చి పోతాయి........
So as per our normal theory->"ఎవరికి అయినా బాగా తీరని కోరికలతో చని పోయినప్పుడు, లేక వాళ్ళను పిచ్చి పిచ్చిగా బాధ పెట్టి చంపీస్తే వాళ్ళు దెయ్యాలుగా మారతారు".
అలా మన చుట్టూ కొన్ని వేల....కాదు కాదు కొన్ని లక్షల ..... hmmmm,ఇది కూడా తక్కువే...... కొన్ని కోట్ల ఆత్మలు తిరుగుతూ వుండాలి.
మరి దెయ్యాలు నిజం ఐతే , మన తెలుగు సినిమా వాళ్ళు కోడి పగ , గొర్రి ఆత్మ, మేక చేసిన సవాల్ ....ఇలాంటి సినిమాలు తియ్యాలి.
కాని నేను ఇప్పటి వరకు ఇలాంటివి(movies) చూడ లేదు. కాబట్టి నేను దెయ్యాల్ని నమ్మటం కొద్దిగా కష్టం.......ఇంకా చెప్పాలి అంటే , కనపడే మీ మేనేజర్ ( మేనేజర్లు ఎవరైనా ఈ పోస్ట్ చదివితే క్షమించండి! సాధారణంగా employs కి మేనేజర్ లు అలానే అనిపిస్తూ వుంటారు !) దెయ్యం అంటే నమ్ముతానేమో కాని , కనపడని దెయ్యాల్ని ఎలా నమ్మాలి అండి!
-----------------------------
నాకు తెలిసి నా చిన్నప్పటి నుండి ఒకే ఒక్క దెయ్యం వుంది ......అది కూడా కొరివి దెయ్యం..... మళ్లీ ఇది ఎక్కడి నుండి వచ్చింది అంటారా .....మరి నా ఫ్రెండ్స్ చెప్పీవారు, వాళ్ళు స్మశానంలో ఏమి లేక పోయినా మంటలను చూసాం అని. మరీ ఫ్రెండ్స్ని నమ్మక పొతే ఇంకా ఎవర్ని నమ్ముతాము .......
కాని మా 7th క్లాసు లో మా సైన్సు సర్ ఏడుకొండల రావు గారు అది కూడా తప్పు అని చెప్పేసారు.
గాలి ( ఆక్సిజెన్) + calcium (bones)-> కొరివి దెయ్యం అదేనండి "మంటలు " అని తీల్చి చెప్పేసారు......
---------------------
ఇక అప్పటి నుండి మనకు దెయ్యం లేదు భూతం లేదు....... యీమైనా వుంటే మేనేజర్ మాత్రం వున్నారు!

Friday, March 6, 2009

24*7......కనిపించని ఆ నాలుగో సింహం !

ఈ రోజు శనివారం కదండీ ! నా మనసులోకి మళ్లీ వైరాగ్యం వచ్చే సింది.hmmm , కొద్దిగా అర్థం అయ్యేలా చెప్పరా బాబు అంటారా...అదే నండి మాములుగా శనివారం , ఆదివారం శలవలు కదా , కాని నేను 24*7 project లో పని చేస్తున్నా .ఈ రోజు చాలా బాధగా వుంది. నా చిన్నప్పటి ఫ్రెండ్ కూడా వస్తున్నాడు నన్ను కలవటానికి.ఐతే సంతోషం గా వుండమంటారా! వాడు వచ్చేది నా ఆఫీసు కి!
---------------
ఒక్క సారి నా స్కూల్ డేస్ గుర్తుకు వచ్చేసాయ్. ఒరేయ్ మన సర్ ఆదివారం ప్రైవేటు క్లాసు పెట్టారు అని ఎవడైనా చెపితే, వాళ్ళను వెళ్లొద్దు అని , దాని వల్ల మనకు exam లో ఆ topics ఇవ్వరు కదా అని పిచి పిచి సలహాలు కూడా ఇచే వాడిని.నేను leader కాబట్టి నేను చెప్పిందే వేదం!మా వాళ్ళు చక్కగా follow అయ్యేవారు.ఇక ఇంట్లో మాత్రం ప్రైవేటు క్లాసు అని క్రికెట్ ఆడు కోవటానికి వెళ్లి పోయీవాళ్ళం.మా వాళ్ళ దృష్టి లో మాకు ప్రతి ఆదివారం ప్రైవేటు క్లాసు వుండేది!
---------------
సరిగ్గా 2 సంవత్సరాల క్రితం నాకు తెలిసింది , నేను night shift చెయ్యాలని, మా ఇంట్లో అడిగాను మానేయ్యనా అని ! ఇంటి దగ్గరే వుంటావు కదా ప్రాబ్లం వుండదులే అన్నారు. ఐనా కష్టమీమో అన్నాను. అప్పుడు మా నాన్న క్లాసు పీకారు. night shift గురించి ఇంకా 24*7 గురించి నీకు ఏమి తెలుసురా ! నువ్వు ఇంకా పిల్లాడివి ఈ దేశం మొత్తం కూడా nightshift చేసే వాళ్ళ మీదే ఆధార పడి పని చేస్తున్ది.Doctors , truck drivers , police ,bus and train drivers , politicians , border soldiers .........ఇలా వీళ్ళంతా రాత్రనకా పగలనకా కష్ట పడుతుంటే , నీకు ఏమి తెలియటం లేదు.!అది వినగానే ఏదో మన సాయి కుమార్ డైలాగ్ వుంది కదా ఆ "కనపడని నాలుగో సింహం యేరా ఈ పోలీసు ....కాదు కాదు ఈ రమణ గాడు" అని అనిపించింది.
------------------------------
కాని ఆ తర్వాత మొదలయ్యింది ....... మాకు 1 month night shift and one month day shift .మా టీం లో వున్నా అందరు రెగ్యులర్ గా 1 month nightshift complete చేసి 1 week hospital లో గడిపేస్తారు.ఇక కాస్తో కుస్తో , మాములుగా వున్దేది నేను కాబట్టి చాలా సార్లు నేనుnee night shift కూడా చేస్తాలె అని వాళ్ళ బదులు కూడా చీసేవాడిని.1st లో నేను కూడా పట్టించు కొలేదు. ఈ మధ్యనే మా అమ్మ చెపుతుంది..... మా ఇంటి పక్కన కొత్తగా వచ్చే వాళ్ళు ఎప్పుడూ తన దగ్గర బాధ పడతారు అట! ఏమని అంటారా ....." పాపం మీ అబ్బాయి పని పాట చెయ్యకుండా ఎప్పుడు అలా ఇంట్లో వుంటుంటే మీకు మాత్రం బాధగా వుండదా ! మాకు తెలిసిన చోట చిన్న వుద్యోగం ఇప్పిస్తాం చీస్తాడా అని! "
ఇక ఫ్రెండ్స్ ఐతే నన్ను కాంటాక్ట్ లిస్టు లో నుండి డిలీట్ చేసి సంవత్సరం పైనే అవుతుంది!
వీడు మనిషి కాడు. ఒక టైం లేదు, ఒక పండగ లేదు. ఒక హాలిడే లేదు. ............. ఇలా వుంటుంది అన్న మాట.
------------------------
ఇలాంటి పిచ్చి పిచ్చి కండిషన్స్ మధ్యలో బ్రతికే నా లాంటి సోదర సోదరి మణులకు నా ఈ post అంకితం.
ఇక వాళ్లకి ఒక గర్ల్ / బాయ్ ఫ్రెండ్ వుంటే ఆ జీవితం పూర్తిగా నరకం.
-------------
నాకు మాత్రం ఇంకొక 6 months time వుంది to move out of this project.Im eagerly waiting for that day.

Saturday, February 14, 2009

నేను దేవుడ్ని ! ..............మీరు కూడా ఏమో!

చాలా రోజుల తర్వాత నా బ్లాగ్ గుర్తుకు వచ్చింది......నిజం చెప్పాలి అంటే గుర్తుకు వచ్చేలా చేసింది.....ఎవరంటారా! మన సినిమాలు అండి. నా ఘోష ఎవరకి వినిపిద్దామా అంకుంటుంటే ఇలా మళ్లీ బ్లాగ్ గుర్తుకు వచ్చింది.

So this blog is completely dedicated for our film industry.

----------------------------------------------
నిన్ననే అరుంధతి కి వెళ్లాను.నాకు చాలా ఆశ్చర్యం వేసిన్ది, ఎందుకంటారా ఇది ఒక A certified movie.(Ofcourse there are two type of A certificates for movies.)
కాని ఇలాంటి మూవీ ని చూడటానికి జనాలు పిచి పిచి గా వస్తున్నారు. (నేను కూడా వెళ్లాను లెండి.)ఈ కోడి రామకృష్ణ గారు తన పరిధిని దాటి మరి , చాల చెత్తగా క్రూరత్వం గా చాలా చాలా చక్కగా చూపించారు. ఇలాంటి మూర్ఖత్వం మన రాజమౌళి గారి దగ్గర చూసాను మళ్లీ ఇప్పుడు ఈయన తయారు అయ్యాడు. పాపం వీళ్ళు మాత్రం యీమి చేస్తారు లెండి. మన తెలుగు జనాలు అలా తయారు అయ్యారు!(ఇది మాత్రం కొద్దిగా ఆలోచించాలి , ఎందుకంటె శంకర్ దాదా , హ్యాపీ డేస్ ,ఆ నలుగురు , గమ్యం ....ఇలాంటి సినిమాలను హిట్ చేసిన వాళ్లు సింహాద్రి ,సమరసింహారెడ్డి , ఇంద్ర లాంటి వాటిని కూడా హిట్ చేసారు.........యెంత విచిత్రం!)
-------------------------
ఇంతకూ నీ బాధ ఏమిటి అంటారా! వాళ్లు technology ని use చేస్తున్నారు.tats gud, however need to use that in a properway.ఇలా మనుషుల్ని భయ పెట్టటానికి , భయం కర మైన వాటిని ,ఇంకా భయం కరంగా చూపెట్ట తానికి మాత్రమె వాళ్లు టెక్నాలజి ని వాడుతున్నారు. ఇంకొక చిన్న విషయం , నా చిన్నప్పుడు టివి లో సినిమా వస్తున్నప్పుడు మా తాతయ్య ఫై టింగ్ సీన్స్ లో అరిచేవాడు , వాణ్ని తన్ను , కొట్టు ......అని! Im really hatsoff to the Telugu industry directors, who are using this scene in their movies.......కాని కొద్దిగా డిఫరెంట్ గా .........hmmmm...ఇంకా వెలగలేదా !....అదేనండి హీరో పక్కన వున్న జనాలు అరుస్తారుగా , వాణ్ని (villanni )చంపేయి అన్నా , చంపెయ్యి .......పాపం హీరో మాత్రం ఏమి చేస్తాడు! వాళ్లు చెప్పినట్టు చేసీస్తాడు! (వాళ్లు = జనాలు / డైరెక్టర్ / రైటర్ ........మనం యెమనుకోవాలి !)ఇక నేను హీరోయిన్ గురించి అస్సలు మాట్లాడదలచు కోలేదు. ఎందుకలా అంటారా .....నా మొదటి బ్లాగ్ చదవండి మీకే తెలుస్తూంది!........ఈ మధ్యనే మన మూవీ ఇండస్ట్రీ లో ప్రయోగాలు మొదలయ్యాయి. ఇవి కొన్ని చెత్తగా మరి కొన్ని ఇంకా చెత్తగా తయారు అయ్యాయి.ఈ మధ్య అలాంటి చెత్త వాటి లోనుండి వచ్చిన నేను దేవుడ్ని ........అనబడు ఒక ఉత్తమ చెత్త చిత్రాన్ని చూసాను!( in my view telugu n tamil industired are same)అప్పుడు అనిపించింది "దీన్ని తీసిన బాల ఒక దేవుడు , చూసిన నేను కూడా ఒక దేవుడ్ని" అని.
---------------------------------------
మా అమ్మమ్మ అంటుంది ఇప్పటి సినిమాలు ఏమి చూస్తాం రా వీళ్ళకి నటన రాదు , కనీసం వొంటి మీద బట్టలు కూడా సరైనవి వుండవు అని.........
--------------
ఈ బ్లాగ్ మాత్రం చాలా కోపంతో రాసింది..........so you might see this post as a different one, when compared to all of previous posts.....Im so sorry abt tat...however this is the truth!
=============
సరే ఇంత రాసావ్ మరి మేము ఎలా దేవుల్లం అవుతాము అంటారా.......! మీరు కూడా నాలా ఇలాంటి పిచి పిచిగా సినిమాలను భరిస్తూ వుంటే మీరు కూడా దీవుడే!