Friday, July 13, 2018

నా corporate కథలు... 2.Bench కష్టాలు Part 2

                                                                     అది  Bench లో ఆనందంగా కాలం గడిపేస్తున్నసమయం.ఒక రోజు(బుధవారం) నాకు Resource Manager assistant నుండి ఫోన్ వచ్చింది at 10am. ఎక్కడ ఉన్నారు? అని అడిగారు. ఇక్కడే మా పాత కంపెనీ Managerని కలవ టానికి వచాను అని చెప్పాను.త్వరగా ఆఫీసు కి రండి, మీటింగ్ ఉంది అన్నారు.నాకు ఒక గంట పడుతుంది అని చెప్పాను.పర్వాలేదు రండి అని అన్నారు.

          అనవసరంగా మా వెధవ batch ని  follow అయ్యాను. ఈ రోజు నన్ను పట్టేసుకుంటారు అని అనుకుంటూ , ఆఫీసుకి వెళ్లటానికి రెడీ అయ్యాను.ఈ లోగ ఇంకో ఫోన్.మా batch వాడు. నీకు ఫోన్ వచ్చిందా అన్నాడు, ఆ వచ్చింది అందుకే బయలు దేరాను అని చెప్పాను."ఎంత time లో ఆఫీసు కి వస్తాను అన్నావ్? "అని అడిగాడు.నీకు తెలుసు కదా మా ఇంటి దగ్గరి నుండి ఒక గంట పడుతుంది , అందుకే 1 hour అని చెప్పాను అని అన్నాను.

నువ్వు చాలా ధైర్యవంతుడివి , నేను  10 నిమిషాలు అనే చెప్పాను.ముందు మా ఇంటికి రా, ఇద్దరం కలిసి వెళ్దాం అని అన్నాడు.hmm, వాడి ఇల్లు KPHB, మా ఇల్లు Nizampet Road.ఆ రోజు మా దురదృష్టం ఇంకా బాగుంది.వాడిని తీసుకుని Hitech city వైపు వెళ్తుంటే big traffic jam.

ఆ సమయం లో వాడి ఫోన్ రింగ్ అయ్యింది.వాడు నా బైక్ నడుపుతున్నాడు.ఆ ఫోన్ నాకు ఇచ్చి మాట్లాడు అన్నాడు.ఎవరో అమ్మాయి ఫోన్ చేసింది అన్నాను. పర్వాలేదు మాట్లాడు అన్నాడు.ఆ అమ్మాయి మాతో పాటు bench లో ఉన్న్న అమ్మాయి. తనకి కూడా ఫోన్ వచ్చింది అట.ఎక్కడ ఉన్నావ్ అని అడిగితె , "Resource Manager room బయట ఉన్నాను ! " అని చెప్పింది అట. ఇప్పుడే ఇంటి దగ్గర బయలు దేరాను, ఇంకో 2 గంటల్లో అక్కడ ఉంటాను.వాళ్ళు అడిగితె బయట కనపడ్డాను అని చెప్పండి అని request చేసింది.hmmm, వీళ్ళు నాకన్నా ఘనులే అని అనుకున్నాను.

మేము Meeting Room లోకి వెళ్ళిన ఒక గంట తర్వాత మా Resource Manager వచ్చి same class పీకి (Attitude is life)వెళ్ళారు.ఆ తర్వాత గంటకి ఆ అమ్మాయి వచ్చింది.

నా corporate కథలు... 5.నా విదేశి యానం - U.K/USA/Canada/Malaysia - Part 2

                                                  మరి కొన్ని రోజుల తర్వాత, మళ్లీ మా manager గారు నన్ను పిలిచారు , రమణ గారు మీరు రేపు పొద్దున్న ఒక client interview కి వెళ్ళాలి, రేపు సాయంత్రం USAకి వెళ్ళాలి అని చెప్పారు.సరే అని నా సీట్ దగ్గరికి వెళ్లి కూర్చునాను. మళ్లీ శ్రీనివాస్ గారు congratz  చెప్పారు. ఈ సారి నేను ఎవ్వరికి అసలు విషయం చెప్పలేదు.........(మీకు చెప్పీస్తునాను- నాకు Passport ఇంకా రాలేదు!).
 
USA Chance :
                                తర్వాతి రోజు Client నుండి Phone రాలేదు.నేను వెళ్లి manager గారికి ఆ విషయం చెప్పాను.Manager గారు విషయం కనుక్కుని చెపుతాను అని అన్నారు.తర్వాతి రోజు పొద్దూన్న చెప్పారు, ఆ Project మనకు రాలేదు.మీరు బాధ పడకండి , నేను మీకోసం ఇంకో మంచి Project చూస్తాను అన్నారు.

నేను మాత్రం ప్రశాంతంగా నా seatలో కూర్చొని ఆనందంగా ఉన్నాను. Passport apply చేసే  ప్రయత్నాలు మానలేదు.

అలా Passport లేకుండా U.S.A వెళ్ళే ఛాన్స్ వచ్చి , వెళ్ళింది...................!
Canada Chance:
          ఇంతలో నాకు సంబంధించిన Technology మీద interviews జరిగి , నేను ఇంకో Team లోకి వెళ్లాను.
                       నా passport కూడా చేతికి వచ్చింది.

                                             ఒక రోజు నా పాత colleague , Narasimha కనపడితే ఏవో పిచ్చాపాటి మాట్లాడుతున్నప్పుడు , వాళ్ళు వెతుకుతున్న Technology మీద నేను పని చేసి ఉన్నాను అని అర్థం అయ్యింది. దానితో తాను ఎగిరి గంతు వేసాడు. నాకు ఏమి అర్థం కాలేదు!
వాళ్లకి  Canada వెళ్ళేటందుకు ఒక వ్యక్తి కావాలి. మా General Manager తో మాట్లాడి  phone చేస్తాను అని చెప్పాడు.సరే ఈ సారి ఏమి అయ్యిద్దో చూద్దాం అనుకున్నాను.
                                              సరిగ్గా అర్థ రాత్రి నాకు ఫోన్ వచ్చింది. నరసింహ వాళ్ళ  General Manager గారు మాట్లాడారు...... ఆయనకీ అర్థం అయ్యింది, ఇక ఆలస్యం చెయ్యకుండా మా  General Manager పేరు అడిగారు. ఇంకో 2 రోజుల్లో సిద్ధంగా ఉండండి మా Team లో కి వచ్చేయ్యటానికి అని చెప్పి  phone disconnect చేశారు.

               2 కాస్త 4 అయ్యింది , 4 కాస్త 8 అయ్యింది ...నాకు అర్థం కాలేదు. Narasimhaకి ఫోన్ చేసాను. ఏమి అయ్యిందో తెలియదు రమణ , నాకు 4 Resumeలు పంపించారు. వీటిలో ఒక్కళ్లని Select చేసుకుని Canada తీసుకెళ్లండి అని చెప్పారు. వీళ్లల్లో ఒక్కడికి కూడా నాకు కావాల్సిన Technology రాదు. నువ్వే వెళ్లి మీ General Managerని అడుగు అని చెప్పాడు.
General Manager Meeting:
Me : sir, నేను Onsite - Canadaకి XYZ Team GM అడిగితె,  నా CV పంపించాను.
మీ దగ్గర అది ఆగిందని విన్నాను.
GM:  అవును రమణ , నేనే ఆపాను.
Me: ఎందుకని  sir?
GM:  ఆ Canada chance కేవలం 3 నెలలు మాత్రమే , నాకేమో నిన్ను అమెరికా permanent గా పంపాలని ఉంది!
Me: ముందు Canada చూడండి  sir, వాళ్లకి కావాల్సిన Technology నాకు వచ్చు. అందుకే వాళ్ళు నన్ను అడిగారు.
GM: నువ్వు ఎన్ని ఐన చెప్పు  రమణ , నాకు నిన్ను అమెరికా మాత్రమే పంపాలని ఉంది.
Me: Ok sir, meet you later........
అలా  వెళ్లిన మా GM ఆణిముత్యం team ,  ఒక 6 నెలలు అక్కడ ఉండి , ఏవో కొన్ని Management escalationsతో మళ్ళీ వెనక్కు వచ్చి పడ్డారు.


ఇంతలో  నా Team లో అడిగారు మలేషియా ఎవరు వెళ్తారు అని....!మా Team mate కిరణ్ resign చేసాడు , వెంటనే అతన్ని మలేషియా పంపిస్తాం ఆగు అని చెప్పారు. తాను చాలా తెలివైన వాడు (ఇంతకూ ముందు Team lead గా పని చేసి ఎంతో కొంత  Corporate పొలిటిక్స్ నేర్చుకున్న వాడు).మీ చావు మీరు చావండి. నన్ను వదిలెయ్యండి అని చెప్పాడు. 
                       ఇంతలో నాకు ఒక జాబ్ వచ్చింది. వెంటనే మలేషియా వెళ్ళటానికి నన్ను పట్టుకున్నారు. నేను over- action చేస్తూ ఏమి చెప్పానో తెలుసా ...........................!
                            నేను USA కంపెనీ కి APAC-EMEA టీం కి పని చెయ్యాలి. నేను ప్రతి నెల ఒక Europe, Asia countryకి వెళ్ళాలీ...............!

                       

Sunday, July 1, 2018

నా corporate కథలు... 4.నా విదేశి యానం - U.K/USA/Canada/Malaysia - Part 1

                                                     అలా రెండు నెలలు Project చేసిన తర్వాత మళ్లీ back to bench.ఈసారి bench లో ఉన్నవాళ్ళు హడలి పోయేలా , మా Resource Manager ఒక మెయిల్ పెట్టాడు.ఇంకొక నెలలో మీకు Hyderabadలో జాబు వస్తే చెయ్యండి. లేదంటే నేను ఎక్కడకి పంపిస్తే అక్కడకు(Bangalore/Chennai/Kerala/Mumbai) వెళ్లి job చెయ్య టానికి ready గా ఉండండి.మీకు ఏమైనా  Attitude Problems ఉంటె నా దగ్గరకు రండి అని చెప్పాడు.కొంత మంది పెళ్లి ఐన వాళ్ళు వెళ్లి వాళ్ళ కష్టాలు చెప్పు కున్నారు. "వాళ్ళు అందరికి  మంచి Attitude లేదు " అని ఒక ముద్ర వచ్చింది.ఇక నేను ముందుకు వెళ్ళలేను , వెనక్కి వెళ్ళ లేను. ......................ముందుకు వెళ్తే నాకు Attitude Problem ఉంది అంటారు , వెనక్కి వెళ్తే పక్క రాష్ట్రాలకి వెళ్లి పనులు చెయ్యాలి.అలాంటి సమయంలో మా శ్రీనివాస్ గారు ఒక Project లోకి నన్ను రమ్మన్నారు.ఆ Technology నాకు తెలియదు.కొంచెం కూడా రాదు.దానికి వెళ్ళకపోతే , హైదరాబాద్ దాటి బయటకు వెళ్ళాలి.నా కళ్ళ ముందే ఇద్దరినీ చెన్నై పంపారు.ఇంగ్లీష్ సినిమా లో లాగా only 1 option to stay in Hyderabad.చివరకు నాకు రాక పొఇనా వెళ్ళాను......

వెళ్ళిన మొదటి రోజే కొత్త manager అడిగారు - నీకు technology రాదు కదా! అని. నీర్చుకుంటాను అని చెప్పాను.ఆ అమ్మాయి దగ్గర కొంచెం నేర్చుకో , ఇంకొంచెం ఆ అబ్బాయి దగ్గర నేర్చుకో అని నన్ను పంపించారు.
ఆ అమ్మాయి , చేసే కొంచెం workకి చాలా కష్ట  పడుతున్నట్టు buildup ఇచ్చేది. తన కింద ఉన్న juniors ని కసురుతూ , విసురుతూ ఉండేది................................ ఇంకో కొత్త వెధవ వచ్చాడు, వీడికి కూడా నేర్పించాలా అని మొఖం పెట్టింది......!తన దగ్గ ఒక 10 నిముషాలు ఉన్న తర్వాత నా జీవితం మీద నాకే విరక్తి కలిగింది!....................................మా శ్రీనివాస్ గారికి ఆ విషయం వెంటనే అర్థం అయ్యినట్టు ఉంది. తను వచ్చి ఆ అమ్మాయిని "Technology మీద ఒక పుస్తకం ఉంటె ఇవ్వండి చాలు , మీరు ఇతనికి ఏమి చెప్పనవసరం లేదు అని చెప్పారు."She gave me a book.బ్రతుకు జీవుడా! అని అనుకుంటూ , అక్కడి నుండి నా సీట్ దగ్గరకు వెళ్లాను.

UK Chance :
                            వారం రోజులు గడిచాయి.ఆ manager మళ్లీ   నా దగ్గరకు వచ్చి , రమణ గారు మీరు urgent గా U.K వెళ్ళాలి. మీకు అభ్యంతరం ఏమైనా ఉందా? అన్నారు.నాకు ఏమి లేదు అన్నాను.ఐతే మీరు ఆ అబ్బాయి దగ్గర మిగతా Technology నేర్చుకుని Ready  గా ఉండండి అని చెప్పి, తను వెళ్లి పోయారు.శ్రీనివాస్ గారు వెంటనే congratz చెప్పారు. తనని బయటకి తీసుకు వెళ్లి చెప్పాను- సర్ , "నాకు  Passport లేదు".శ్రీనివాస్ గారు నన్ను Passport Apply చెయ్యండి త్వరగా అని చెప్పారు.
                                     అలా ఒక పక్క రాని Technologyని నేర్చుకొంటూ , ఇంకో పక్క లేని Passport apply చేస్తూ ఉండగా......మా Manager చెప్పారు : రమణ గారు UK Chance వేరే location లో  ఉన్న వాళ్ళు తీసుకున్నారు.ప్రస్తుతానికి మీరు Technology ఇంకా నేర్చుకోండి అని చెప్పారు.
                                         అలా Passport లేకుండా U.K   ఛాన్స్  వచ్చింది , ఇంకా చెప్పాలి అంటే వెళ్ళింది కూడా!