Saturday, November 9, 2013

నేతి బీరకాయలో నెయ్యి లేనట్టు , రైతు బజారు లో ------లు ఉండరు (JNTU,HYD)....!

గత నెల అనుకోకుండా JNTU , Hyd రైతు బజారుకి వెళ్లాను.చాలా ఆశ్చర్యం వేసింది......!అక్కడ ఉన్న కూరగాయలు చూసి కాదండి, ఆ ఎదురుగా కొంచెం దూరంగా ఒక స్థలములో పెద్ద కూరగాయల కొట్ట్లు ల ను చూసి , ఇంకా ఆ కొట్టులలో కూరగాయలు కొనుక్కునే జనాలను చూసి.

వీళ్ళు ఏమైనా పిచోల్ల్ల్లా ! ఎదురుగా రైతు బజారు పెట్టుకొని ఇక్కడ కూరగాయలు కొంటున్నారు అనుకొంటూ రైతు బజారు లోపలకి వెళ్లాను.........


Incident 1 :

Entrance దగ్గరే బైకు పార్కింగ్ ఫీజు 5 రూపాయలు. లోపల చాలా కూరగాయలు ఉన్నాయి , కాని వాటిలో మంచివి మనం వేళ్ళ మీద లెక్కించ వచ్చు.
ఉన్న వాటిలో కొన్ని మంచివి తీసుకొని వెళ్దాము కదా అని అడిగితె వాళ్ళ రెస్పాన్స్ ఇలా ఉంది.
Me: ఆ  టమోటాలు ఎంత ?
Vendor(Not sure whether he is farmer) :  1 kg = 42 రూపాయలు
Me: Board మీద 35 అనే ఉంది కదా!...?
Vendor : అవి నిన్నటి రేట్లు సార్
Me: సరే మంచివి నేను ఏరుకుంటాను...
Vendor : మీరు ఎరుకుంటే  1kg = 50 రూపాయలు , నేను  ఇచ్చినవి తీసుకుంటే  1 kg = 42 రూపాయలు
Me: వద్దులే బాబు...!
Vendor: రైతు బజారు మొత్తం వెతికినా మీకు మంచి టమోటాలు దొరకవు మీరు మళ్ళీ నా దగ్గరకే రావాలి అన్నాడు......

తను చెప్పింది నిజమే ........ ఇతని దగ్గర తప్ప , ఎవరి దగ్గరా మంచివి లేవు.తననే కారణం  అడిగాను.
రేటు ఎక్కువగా ఉన్న కూరగాయలను మేము బయట market లో అమ్ముకుంటాం! వాటిలో  బాగోని వాటిని market వాళ్ళు మాకు ఇచ్చేస్తారు.వాటిని ఇక్కడకు తెచ్చి అమ్ముతాము అన్నాడు!

Incident 2:


ఇంకోసారి అనుకోకుండా అక్కడ Rose పూలు తీసుకుని , అమ్మిన ముసలమ్మకు 10 రూపాయలు ఇచ్చాను, తన దగ్గర బంతి పూలు చూసి ఒక 10 రూపయలవి ఇమ్మని అడిగాను.తను 20 కి తక్కువ ఇవ్వను అని చెప్పింది.నా దగ్గర చూస్తే చిల్లర 10 రూపాయలు మాత్రమె ఉన్నాయి. తనని 10 రూపయలవి ఇస్తే ఇవ్వు లేదా 500 కి చిల్లర ఉంటె ఇవ్వు అన్నాను.తను చిల్లర లేదు సర్ అని అంది , అలా అని 10 రూపయలవి ఇవ్వను అని అంది.ఇంకేమి చేస్తాం అని అనుకుంటూ వెనక్కి తిరిగాను.వెంటనే ఆ ముసలమ్మ Roses కి  డబ్బులు ఇవ్వండి అని అంది.....!

నేను షాక్ , పక్కనే ఉంది ఇదంతా చూస్తున్న మా ఆవిడ షాక్. ఇందాకే కదా ఇచ్చింది అంటే , ఆ ముసలమ్మ  పక్కనే ఉన్న ఇంకొకడు(vendor) మీరు  10కి ఇలా చేస్తారా అన్నాడు.......! hmm ,  ఏమి చేస్తాం అనుకొంటూ ఇంకొక 10 ఇచ్చాను.

Incident 3:

కరివేపాకు కథ : "తెలంగాణా కరివేపాకు Vs ఆంద్ర user "....వినటానికే చెత్తలా ఉంది....! మరి ఇక చదవండి

అందరు చాలా తేలిగ్గా తీసిపారేస్తారు! కాని రెండు సార్లు అది నన్ను తీసి పారేసింది ఆ రైతు బజారు లో!
ఒక 2 రూపాయలది ఇవ్వరా బాబు అంటే,  ఇవ్వను అంటాడు. Min 5 Rupees sir అంటాడు.మొదటి సారి తీసుకోలేదు.కాని రెండో సారి అవసరం కదా అని తీసు కున్నాను.5 Rupees కి ఒక కొమ్మ మొత్తం ఇచ్చే స్తాడు.కాని చిన్న రెబ్బను 2 rupeesకి ఇవ్వరు అట....

మొన్న అనుకోకుండా మా సీనియర్ శ్రీనివాస్ గారితో పైనవన్నీ చెప్పాను.తన response , in his words " మీరు చాలా better అండి, మొన్న అక్కడే ఒకడిని 3 రూపాయలకు కరివేపాకు ఇమ్మని అడిగితె నాకు ఇవ్వలేదు , కాని నా వెనక ఉన్న ఇంకొకడు 2 రూపాయలకు కరివేపాకు ఇమ్మని అడిగితె వెంటనే వాడికి ఇచ్చాడు.తనను కారణం అడిగితే ఇలా చెప్పాడు అట: ఆ 2 రూపాయలు ఇచిన వాడు మా తెలంగాణా సర్! మీరేమో ఆంధ్ర !మీకు 5 రూపాయలు కి ఐతే ఇస్తాను.....!

ఇది విన్న నాకు ఏమనాలో అర్థం కాలేదు.


మా శ్రీనివాస్ గారు అన్నారు " వాళ్ళు నిజంగా రైతులు ఐతే ఇలాంటివి ఉండవండి! నేతి బీరకాయలో నెయ్యి లేనట్టు , రైతు బజారు లో రైతులు ఉండరు!" నిజంగా రైతు ఐతే ఎవరికైనా ఇస్తారు. వీళ్లేమో మంచి వ్యాపారస్తులు , ఎవరైతే ఎక్కువకు తీసుకుంటారో వీళ్ళకి బాగా తెలుసు!



 

Saturday, March 23, 2013

Hyderabad నెక్లెస్ రోడ్ దోపిడీ !!!!!

చాల రోజుల తర్వాత నా గర్ల్ ఫ్రెండ్ ను తీసుకుని నెక్లెస్ రోడ్ వెళ్లాను.

Following are series of incidents happened within 30 mins:

ఇద్దరం సీరియస్ గా మాట్లాడుకుంటుంటే , ఒక begger వచ్చాడు. ఆకలి గా ఉంది ఒక 5 rupees ఇవ్వండి అన్నాడు.ఒక్కసారిగా మానవత్వం గుర్తుకు వచ్చింది .నా దగ్గర change లేదు, సరే  ఈ 10 తీసుకో అని ఇచ్చాను.
అంత serious discussion లో తను disturb చేసాడు అని అనుకుని, పాపం ఒక వ్యక్తి  ఆకలి తీరుతుంది అనుకుంటూ మా   discussion continue చేసాము.

ఇంకో 5  minutes తర్వాత  ఒక చిన్న పిల్లాడు వచ్చి రోజ్ flower కొనండి సర్ అన్నాడు.వొద్దు తమ్ముడు అని చక్క్కగా చెప్పాను .ఐనా  వెళ్ళటం లేదు .ఒక rose తీసుకోండి  అక్కకు ఇవ్వండి అన్నాడు .ఒక serious look ఇచ్చి వెళ్ళిపో అన్నాను.This time he asked my gal friend.తను కూడా వొద్దు అంది.ఇక వెళ్ళిపోయాడు.
మా serious discussion ఇంకా continue అవుతుంది.

ఇంకో 5  minutes తర్వాత  ఒక ముసలామి వచ్చింది.తన దగ్గర కొన్ని వేరుసనగలు ఇంకా ఇలాంటివి ఉన్నాయి.ఏదైనా తీసుకోండి సర్ అంది.తనకు చెప్పాను , మాకు ఏమి వద్దు ...కావాలి అంటే మేము అడుగుతాము అని.అప్పుడు తను , అందరి లాగ అడుక్కొంటే మీరు డబ్బులు ఇస్తారు , కాని కొనుక్కోండి అంటే మాత్రం నా లాంటి వాళ్ళ దగ్గర కొనరా అంది! I was shocked.తనకు చెప్పాను , మేము కొద్దిగా serious matter మాట్లాడు కుంటున్నాం మమ్మల్ని disturb చెయ్యొద్దు , మాకు అవసరం లేదు అని. "మీరు ఏదైనా తీసుకుంటే కాని నేను ఇక్కడ నుండి  వెళ్ళాను అని మా దగ్గర అలానే  ఉంది."So gave her one more 10.

ఇంకో 5  minutes తర్వాత ఒకచిలక జోస్యం వాడు.తను మంచి వాడిలా ఉన్నాడు.వొద్దు అనగానే వెళ్ళిపోయాడు.


ఇంకో 5  minutes తర్వాత పాటలు పాడే వాళ్ళు వచారు. హోలీ సందర్భంగా కామునికి money ఇవ్వాలి అట.వాళ్లకు చెప్ప్పాను మమ్మల్ని disturb చెయ్యొద్దు ఇక్కడ నుండి వెళ్ళండి అని .వాళ్ళు పిచ్చి పిచ్చి పాటలు పాడి నా సహనాన్ని ఇంకా తినేశారు.(I thought of going for reverse attack.)సరే పదండి నేను కూడా మీతో పాటలు పాడతాను అందరం కలిసి తిరుగుదాము అన్నాను . Seems to be they are seniors,my plan failed.వాళ్ళు చాలా పెద్దగా  పాడటం  మొదలు పెట్టారు. నాకు చికాకు వచ్చింది.So lost one more 10 rupees.


ఇంకో 5  minutes తర్వాత మళ్ళీ  చిలక జోస్యం వాడు.వీడికి  ఇంతకూ ముందే చెప్పాను  కదా మళ్ళీ వచ్చాడు అనుకుంటూ , వొద్దు అని చెప్పాను.తను చాలా decent గా వెళ్ళిపోయాడు.



ఇంకో 5  minutes తర్వాత ఈసారి ఒక కొజ్జ వ్యక్తి.దేవుడా ! మాకు ఈ శిక్ష  ఏమిటి అనుకుంటూ , తనని  వెళ్ళిపొమ్మని చెప్పాను.తను కూడా చాల cool గా  వెళ్ళిపోయాడు.


ఇంకో 5  minutes తర్వాత మళ్ళీ  అదే  చిలక జోస్యం వాడు.సర్ జ్యోతిష్కం చెప్పించుకుంటారా అని!నాకు ఏమి చెయ్యాలో అర్థం కాలేదు!



నా girl friend  చెప్పింది  , Ramana నీకు  ఇచ్చిన time అయ్యిపోయింది నేను  వెళ్తున్నాను అని !
Moral of the story : మీరు  నెక్లెస్ రోడ్ వెళ్తే , not sure whether u may loose money...but surely u will loose u r concentration n u r time.