ఇది కల్పనతో కూడిన ఒక యదార్థ గాథ, చదవండి మీకే తెలుస్తుంది.
------------------------------
xyz అనే వూరిలో రాజు రాణి అనే ప్రేమికులు వుండే వారు. అన్ని కథలో లాగా వీరి కులాలు కూడా వేరు.Raju blongs to A +ve and Rani belongs to B -ve.
వీరి ప్రేమ విషయం తెలిసిన రాణి తండ్రి ఒక రోజు , రాజు ని తమ ఇంటికి పిలిచి వాళ్ళ ప్రేమ విషయం కొన్ని ప్రశ్నలు అడుగుతాడు (similar to one to one session),దానికి రాజు మంచి answers ఇస్తాడు. దానితో రాణి తండ్రి వీళ్ళ పెళ్లికి ఒప్పుకుంటాడు. హమ్మయ్య అనుకుని రాజు తన ఇంటికి తిరిగి వెళ్తాడు.
కాని తరవాతి రోజు ఈనాడు జిల్లా edition లో రాజు అనే వ్యక్తీ దుర్మరణం అని వస్తుంది.(Back ground story : రాణి తండ్రి ఆ వూరు inspectorకి10 వేలు ఇస్తాడు , ఇంకా ఆ ఈనాడు విలేఖరికి Etv లో anchor గా job ఇప్పిస్తాడు.So u may imagine ,how bad he was ...!)
============================
రాజు చనిపోయినప్పుడు అతని జేబులో వున్న రాణి అని రాయబడిన రుమాలుని (అది రాజు రక్తం తో తడిసి వుంటుంది ) policeలు , రాణి కి ఇచ్చారు. రాజు తీపి గుర్తుగా దాన్ని దాచుకుందాం అని Rani అనుకుంటుంది. అందుకని ఆ రక్తపు మరకలు పూగోట్ట టానికి ఆ రుమాలుని వుతుకుతుంది ,అయినా కాని ఆ మరకలు పోవు.
====================
యీమి చెయ్యాలా అని ఆలో చిస్తూ నిద్రపోతుంది.అప్పుడు తనకు ఒక విచిత్ర మైన కల వస్తుంది : అది యీమి టంటే : రాణి కళ్ళ ముందు ఒక మెరుపు మెరుస్తుంది ఆ మెరుపు నుండి రాజు వచ్చి రాణి కి ఒక విషయం చెపుతాడు, అది ఏమిటో తనకు అర్థం కాదు. వెంటనే రాణి ఉలికి పది లెగిసి టైం చూస్తుంది.అప్పుడు టైం సరిగ్గా 4:30am.
రాణి తనకు రాజు కలలో వచ్చిన విషయం తన అమ్మాకు చెప్పింది. వాళ్ళ అమ్మ , నువ్వు చాల depressionలో వున్నావు అమ్మా, అందుకని నీకు పిచ్చి పిచ్చి కలలు వస్తున్నాయి అని చెప్పి వూరడిస్తుంది.
కాని ఎంతైనా తల్ల్లి మనసు కదా , తరవాత రోజు సాయంత్రం రాణి తల్లి ఆ రుమాలుని వుతుకుతుంది, అయినా ఆ ఆరిన రక్తపు మరకలు పోవు. విచిత్రంగా ఆ రోజు రాత్రి రాజు , రాణి తల్లి కలలో వచ్చి ఏదో చెపుతాడు , కాని రాణి తల్లికి కూడా అర్థం కాదు. రాణి తల్లికి భయం వేసి ఈ విషయాన్ని రాణి తండ్రికి చెపుతుంది. రాణి తండ్రి వీరిద్దరిని బాగా తిడతాడు , ఆ రాజు గురించి మీరు ఎక్కువ think చెయ్యూద్దు అని అంటాడు.మరుసటి రోజు రాత్రికి same కల మన రాణి తండ్రికి వస్తుంది.
ఈ సారి రాణి తండ్రికి నిజమగానే భయం వేస్తుంది. ఆ రాజు గాడు దెయ్యం లాగా మారి తమ కుటుంబాన్ని పీడిస్తున్నాడు అని అర్థం అవుతుంది. ఇక క్షణం కూడా ఆలస్యం చెయ్యకుండా పక్క వూరి స్మసాసనం లో వుండే అఘోరా ని సంప్రదిస్తాడు.
=======================
ఆ అఘోర చెప్పినట్టు , మంత్రించిన ముగ్గులు , నిమకాయలు ఇంకా గుమది కాయలు , వంకాయలు (పుచ్చులు లేనివి), బెండకాయలు (లేతవి ), ఇవన్ని వాళ్ళ ఇంటి గేటు ముందు గొయ్యి తవ్వి పాతుతాడు.
ఆ మరుసటి రాత్రి సమయం సరిగ్గా 4:30 am, మళ్ళీ అదే కల అందరికి , అంటే రాణి కి , రాణి తల్లికి , రాణి తండ్రికి , అఘోరకి కూడా వస్తుంది . ఆ కలలో మళ్లీ మెరుపు వస్తుంది , దాని నుండి రాజు వస్తాడు.ఇప్పుడు వీళ్ళందరికీ ఆ అఘోర చేసిన పూజలు ఫలించి రాజు చెప్పే మాటలు ( ప్రేతాత్మ మాటలు ) అర్థం అవుతాయి.
ఇంతకూ రాజు యీమి అంటాడు అంటే : "మీరు కొత్త Tide వాడండి ఆ రుమాలు కొత్తది లాగా మెరుస్తుంది".
=================
Note: ఇది నేను ఎక్కడో 3 సంవత్సరాల క్రితం చదివిన కథ , నా type లో కొని మార్పులు చెయ్యటం జరిగింది.