Wednesday, June 30, 2010

save the tiger.... పులులను రక్షించండి ....! yes, u can do it

ఇది నిజంగా నిజమే నండి మన దేశంలో పులులు చాల చాల తక్కువ వున్నాయి.
ఉన్న వాటిని ఇప్పుడు కాపాడక పొతే ఇక ముందు ముందు అస్సలు పులులు వుండవు.
వాటిని కూడా graphics లో చోసుకోవాలి.

పోయిన నెలలో మా company కి వచ్చి Aircel వాళ్ళు వాటిని రక్షించండి అని చెప్పారు.
నాకు ఒక చిన్న doubt వచ్చింది. నా చిన్నప్పటి నుండి ఇప్పటి వరకు నేను ఒక్క పులిని కూడా చంపలేదు, ఇంకా కనీసం దగ్గర నుండి కూడా చూడలేదు.

ఇన ఒక వేళ అది దారి తప్పి kphb లో ఉన్న మా ఇంటికి వస్తే దానికి chicken పెట్టాలో mutton పెట్టాలో అని ఆలోచిస్తామా చెప్పండి , ముందు మనం పారిపోతాం కదా అని నా ఫ్రెండ్తో అన్నాను. సర్లే వాళ్ళు ఏమి చెపుతారో విందాం అని వెళ్ళాం.

వాళ్ళు మా హస్త ముద్రలు తీసుకుని మీరు మాట ఇచారు , ఇక నుండి మీరు పులులను చంపే వాళ్ళను ప్రోత్సాహించోడు అని అన్నారు , నాకు మాత్రం "వాడి మీదకి ఒక పులిని వదలాలి " అన్నంత కోపం వచ్చింది.
పులి ని TV లో చూడటం తప్ప బయట చూడని వాళ్ళ దగ్గరకు వచ్చి ఇలా అంటాడా ? ఇక పులి ని వేటాడే వాళ్ళను ప్రోత్సహిమ్చోద్దు అంటాడా ? అలాంటి వాళ్ళు వుంటారు అని తెలిస్తే ముందు నా ప్రాజెక్ట్ మార్చని మా మేనేజర్ని వాడి పక్కన వుండే HR ని యీమైన చెయ్యమని వాడినే బతిమిలాడుకునే వాడిని కదా!

సర్లెండి వాడికి తెలియక అలా అన్నాడు , ఇప్పుడు మీకు నా ప్రశ్న.........
పులి మీ ఇంటికి వస్తే మీరు ఏమి చేస్తారు?
ans:
options:
1.పారిపోతాం
2.TV9 కి ఫోన్ చేస్తాం
3.we will inform to police
4.వాటికి ఫుడ్ పెట్టి ఆడుకోటానికి place చూపిస్తాం


మీ సమాధానం యీమైనా కాని , నిజంగా మీ దగ్గరకు ఒక పులి వస్తే కొద్దిగా మా ఇంటికి పంపించండి, కాసేపు మా office లోఅది కూడా మా మేనేజర్ room లో దాచి మళ్లీ మీ దగ్గరికే పంపించి వేస్తాను.
Awaiting for a positive response (with tigers)..........................