Thursday, December 30, 2010

jan 6th 2011....ఏమి జరుగుతుంది.....? (నాకు తెల్సుగా)

Jan 5th Evening ...live interview in TV9....taking the views from various persons n their updates r following.

రాజకీయ పార్టీ లు : No comments, రేపు సాయంత్రం మాట్లాడు కుందాం.
House Wives :Gas రేట్లు బాగా పెరిగాయి. ఇంకా కూరగాయలు కొనలేక పోతున్నాం.

Lower class man: ఏమి కొనలేని స్థితి లో వున్నాం. ఎలా బతకాలో అర్థం కావటం లేదు.

Middle class man: petrol రేట్లు బాగా పెరిగాయి.same with remaining things also.కూరగాయల రేట్లు = మాంసం రేట్లు , కాబట్టి chicken, mutton best.

మంతెన సత్యనారాయణ: మీరు సాఖహారులుగా వుండండి , మాసం తినవద్దు.

రైతు: పంటలు పండటం లేదు, అప్పులు బాగా పెరిగాయి ... నిన్నటి వరకు నాతొ పొలానికి వచ్చిన మా పక్కింటి రైతు చచిపోయాడు.....అయినా బాధ లేదు ...కాని రేపు నేను అదే స్థానంలో వుంటాను అని తలచుకుంటూ వునప్పుడు మాత్రం భయం వేస్తుంది.

TV reporter :ఈ వెధవ గోల వినలేక చస్తున్నాం........ పక్కన కొత్త సినిమా హీరొయిన్ వచ్చింది అట అటు వెళ్దాం.

కొత్త సినిమా హీరొయిన్:చాల బాగా వచాను. ఈ సినిమా ఒక బ్లాక్ బస్టర్ అవుతుంది.నేను బాగున్నాను. thanx to director n producer sir for providing me the oppostunity.

Weather deparment:చలి ఇంకా బాగా పెరుగుతుంది.

PG/UG Students (telangana ) : మాకు ప్రత్యెక రాష్ట్రం కావాలి.(ఈ సెమిస్టరు ఎగ్జామ్స్ పెట్టకూడదు. మేము ఎవర్ని కొట్టినా , తన్నినా , ఏమి తగల పెట్టినా మమ్మల్ని ఏమి అన కూడదు)

Inter/lower class students(telangana/seemandhra ):మాకు holidays కావాలి, అది చాలు.

PG/UG Students (seemandhra): u know this already.

IT Companies: ఏదో ఒకటి జరిగి ఈ గొడవలు ఆగితే బాగుంటుంది. ఇక్కడ ఉండాలో లేక పక్క రాష్ట్రాలకు వెళ్ళాలో తెలిసిపోతుంది.

Jan 6th Evening:

నేను : మా ఇంట్లో టీవీ లో , రోడ్ల మీద తన్నుకుంటున్న జనాల్ని చూసి ఓహో లోకం చాలా పాడు ఐపూతుంది(మనసులో ).......

అమ్మా ...ఒక రోటి వెయ్యి ఆకలిగా వుంది....

(phone lo) ఒరేయ్ రేపు నాకు holiday .....so dont go anywhere we will play video games.

Saturday, December 11, 2010

మేము చదువుకుంటాం ..................(Political Satire....!)

సమయం : 2013 , Dec ఉదయం :11:30

భారత రాష్ట్రపతి ప్రతిభ పాటిల్ ఇంకా యావత్ దేశం ఎదురు చూస్తున్న సందర్భం అది. కారణం అప్పటి వరకు ఎక్కడో 9 వ స్థానం లో వున్నా ఆంధ్రప్రదేశ్ ఒక్కసారిగా రెండు సంవత్సరాల్లో మొదటి స్థానానికి వచ్చే సింది. ఒక్క రెండు సంవత్సరాల్లో ఈ ఘనత భారత దేశం లో ......., నిజం చెప్పాలి అంటే ప్రపంచంలో కూడా ఎవ్వరు సాధించ లేదు.ఈ ఘనత సాధించినందుకు Andhra Pradesh C.M.ని రాష్ట్రపతి భవన్ కి పిలిచారు.

------------

ప్రధాన ప్రతిపక్షం మేము లేక పొతే ఆ credit అంతా ఆ చెయ్యి పార్టీ వాళ్ళే కొట్టీస్తారు అని , ప్రతిపక్ష నాయకుడు అనుకొని తను కూడా ఆ సభకు బయలు దేరుతాడు. ఇంకా ఎంతైనా తాము కూడా దగ్గిర వుంది కొంత మందిని కాలేజీ లో చేరిపించారు కదా.

వీళ్ళు అందరు వెళ్తున్నారు అని Morning News Paper లో చుసిన ఇంకో Party అధ్యక్షుడు , ఇన్నాళ్ళు సినిమాల్లో చాలా గొప్పగా వున్నాను... కనీసం ఇలాంటి చిన్న చిన్న వార్తలు కూడా Paperలు చూసి తెలుకోవాల్సి వస్తుంది.... ఛి దీనమ్మ జీవితం ! అని అనుకుని ...... ఈ బహుమతి రావటానికి ఆ రోజు Assembly లో నేను ఇచ్చిన మద్దతు కూడా ఒక కారణం కదా ..... నేను వెళ్తే కూడా బాగుంటుంది అని అనుకుని Delhi బయలు దేరాడు .

అరె ఏంది భాయ్...... గీ C.M.కు ఆ Award రావటానికి ఆ రోజు Assemblyలో మేము చేసిన లొల్లే గదా కారణం. గాని వీళ్ళు దురహంకారం తో నన్ను పిల్వకుండా, తను ఒక్కడే Delhi వెళ్తాడా....... ఆడకు పొయ్యి ఆడనే తేల్చుకుంటా ....... అని అనుకుని ఇంకో అధ్యక్షుడు కూడా Delhi బయలు దేరాడు.


మా నాన్న వుంటే తను ఆ సభకు వెళ్లి ఆ బహుమతి తీసుకునే వాడు, కాని దాని (100% literacy in A.P.)వెనుక మా కృషి కూడా వుంది కదా ... నీను కూడా వెళ్తే ఎలా వుంటుంది అని ఒక యువ నాయకుడు అనుకున్నాడు. మరీ ఆ సభ పేరు పెట్టుకుని వెళ్ళటం బాగోదు కదా అని అనుకుని, పక్క వారి సలహా మేరకు "Delhi Pollution బాధితుల " ఓదార్పు యాత్ర అని అక్కడకు బయలు దేరాడు.
=======================

Time: 11:35am,Dec,2013
సభ ప్రారంభం అయ్యింది , AP CM గారు వేదిక పైకి వచ్చి తన ఉపన్యాసం ప్రారంభించారు. ప్రియమైన భారత ప్రజలకు నా వందనాలు.ఈ రోజు Literacy లోAndhra Pradesh Number:1 గా వుంది అంటే దానికి కారణం నేను ఒక్కడ్ని కాదు. ..............ఈ విజయం నాది మాత్రమె కాదు, దీని వెనుక మ రాస్ష్త్ర ప్రతిపక్షంలొ వున్న ప్రతి ఒక్కరిది. ఈ విజయాన్ని నెను మా రాష్త్రంలొ వున్న అన్ని party ల అధ్యక్షులకు అంకితం ఇస్తున్నాను........................ఒక్క లొక్ సత్త అధినెతకు తప్ప.ఐనా ఆ విజయం వెనుక వున్న కథని ప్రస్తుతానికి నెను చెప్పలెను.ఈ రొజు సాయంత్రం మా అమ్మ ముందు Media తొ చెపుతాను.ఆ సమయానికి మా ప్రతిపక్ష మిత్రులు కూదా అక్కదు రావాలి అని సభాముఖంగా వెదుకుంతున్నాను.

హమ్మయ్య ప్రధాన ప్రతి పక్షం నాయకునిగా ఇన్ని సంవత్సరాలికి నెను చెసిన ఒక పనికి ఆ C.M. నన్ను మెచుకున్నాదు.ఇక్కదకు వచినందుకు చాలా బాగుంది అని అనుకుంతూ .......ఆ CM వాల్ల అమ్మ దగ్గరకు పసుపు నాయకుదు బయలుదెరాదు.

మా బావ చెప్పినట్టు ఇంట్లో కూర్చుని సినెమాలు చూసుకుని ఉంటే .....ఈ credit అంతా పక్క వాళ్ళకు పోయేది. సాయాంత్రం maa బావకు ఈ విషయం చెపుతాను కానీ ముందు ఆ C.M. వాళ్ళ అమ్మ ఇంటికి వెళ్ళాలి అని ఈ పార్టీ అధ్యక్షుడు కూడా బయలు డేరాడు.

గిడి సంగతి ఆక్కడే చూద్దాం అని ఇంకొక నాయకుడు కూడా బయలుదేరాడు.


వామ్మో దాని దగ్గరికి వెళ్తే నన్ను ఆడుకుంటది, ఎలా ఎలా అని ఆలోచించి ..... ఇంతదూరం వచ్చాం కదా .....అక్కడకు కూడా వెళ్దాం , ఎందుకు వచావ్ అని మనల్ని అడగదు , ఒకవేళ అడిగితే తన(AMMA)ని ఓదార్చటానికి వ ఛా ను ( ఎంతైనా ఆ అమ్మ కూడా Delhi Pollution లో తిరుగుతుంది కదా నా యాత్ర ఇక్కడ నుండే start చేస్తున్నాను అని చెపుతాను) అని యువ నాయకుడు అనుకున్నాడు.
======================

Time : 4pm ,Dec....2013.
Place:10,Janapath,Delhi......Media Point

అందరు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. AP CM Mike తీసుకుని Speech ని మొదలు పెట్టారు. యావత్ భారత దేశం ఉత్ఖమ్ట్ గా ఎదురు చూస్తుంది.
"ప్రియమైన ప్రజలకు వందనాలు, ఆ రోజు మా అసెంబ్లీ లో మా ప్రతిపక్ష సోదరుడు చేసిన ఒక సలహాని మా మిగతా ప్రతిపక్ష సోదరులు అంతా సమర్థిమ్చారు.ఆ రోజు నేను అనుకొలీదు ఆది మాకు ఇంత పేరు టెస్తుంది అని. అలానే ప్రతి కథలో villan ఉన్నట్టు ఆ రోజు లోక్ సత్తా నాయకుడు గారు కూడా అక్కడ ఉన్నారు. ఏదో IAS చదువుకుని ఆ పని చీసుకోవటం చేతకాక , కొత్త పార్టీ పెట్టి మాయా సభలోకి క్షమించాలి, మా సభలోకి వాచాడు. ఆ రోజు అతను చెప్పిన మాట విని ఉంటే నిజంగా మా AP Litecacy స్థానం 9 లో అలానే ఉండే ది. "


ఆ రోజు చరితలో లిఖించ తగ్గ రోజు , నేను C.M. గా ఒక నిర్ణయం తీసుకున్నాను, అది "దేశ భక్తితో లేదా ప్రాంత భక్తితో లేదా మత భక్తితో అల్లర్లు చేసి వీధుల్లో కనపడిన Buses/ cars/ vehicle లను కాల్చటం లేదా నాశనం చెయ్యటం .........ఇంకా దారిన పోయే పక్క ప్రాంతం వాడిని కొత్టటం .......ఇలాంటి వాటిని చేసిన విద్యార్థులను , వారి పైన ఉన్న caseలను తీసీసాను. ఆ ఒక్క నిర్ణయం ఈ రోజు మమ్మల్ని ఇక్కడ దేశం మొత్తం గర్వపడే లా ఉంచింది.

విలేఖరి : అర్థం అయ్యేటట్టు చెప్పండి .....
CM: నేను ఆ నిర్ణయం తీసుకున్న వారం రోజుల తర్వాత అస్సలు result ivvatam start అయ్యింది. సమాజంలో అన్నాళ్ళు పని పాత లేకుండా అంటరాని వారుగా , అందరి ఛీత్కారాలు ఎదుర్కున్న కొంత మంది.....

విలేఖరి : ఎవరా కొంతమంది ?
CM:అదేనయ్య మీరు , నిజంగా మీ media వారు rowdies, గూండాలు అని వారికి పేరు పెట్టారు కదా వాళ్లే....... వాళ్ళు అంతా వాళ్ళకి దగ్గర్లో ఉన్న COLLEGE లో చేరారు.రాత్రన కా ,పగలనకా కష్టపడి చదివి ..... వాళ్ళు చదవటమే కాక వాళ్ళ చుట్టూ పక్కల ఉన్న వాళ్ళను కూడా Degree చదివించారు. వాళ్ళు Degree complete ఐనా కానీ అక్కడే ఉంది ఇంకో Degree చదివే వాళ్ళు.
ఏమయ్యా secretry దాన్ని యీమంటారు ....ఆ double degree, ఇంకా triple degree చదివే వాళ్ళు. అలా వాళ్ళను చూసి మిగతా వాళ్ళు కూడా చదవటం start చీశారు.Finally our state beconme No:1 in India ....ఇక నేను ఉంటాను ...మరో సారి ఈ గొప్పతనం అంతా నాది కాదు , ఆ పక్కన నుండి చూస్తున్న మా గడ్డం గారిది , ఇంకా హీరొ గారిది , ఇంకా పెద్ద ముక్కాయనది ....

============================

ఇది చూసిన BBC వాళ్ళు Andhra Pradesh లో ఒక program చేద్దాం అని వచ్చారు . వారు నేరు గా హైడెరాబ్యాడ్ లో ఉన్న ఒక పెద్ద college కి వెళ్లారు. ఒక 40 సంవత్సరాలు ఉన్న పెద్దాయన పుస్తకాలు చేత్తో 4 books ఇంకా వెనకాల పెద్ద బాగ్తో కనిపించాడు.

BBC:ఓ పెద్దాయానా మాకు నీ interview కావాలి.
పె:నేనా interview నా , అన్నా .... అని పిలవగానే పక్కనుండి ఇంకో పెద్దాయన వచ్చి , ఎవర్రా మీరు అని అడుగుతాడు.
BBC: మేము BBC channel వాళ్ళం ,మాకు interview కావాలి
పే2 : మాకు ETV, TV9,SAKSHI ,GEMINI, MAA TV తప్ప మిగతావీ తెల్వదు , ఐనా మీ channel యీమైనా కొత్తగా పెట్టారా ...... యీమైనా కానీ ఈ మధ్య మన Andhra Pradesh లో channels బాగా పెరిగాయి అని అన్నాడు.
BBC: మేము English news channel వాళ్ళం , మాది పెట్టి చాలా ఏళ్లు అయ్యింది అన్నారు.
పే 2: ఒహో ! సర్లే ...మ వాడు మీకు అన్ని నిజలే చెపుతాడు కానీ మా వాడు తన getup తో వస్తాడు అని చెప్పగా BBC వాళ్ళు తమ camera on చేసుకున్నారు.
=========


మన పెద్దాయన hyderabad అమ్మాయిల లాగా(like talibans) ముసుగు వేసుకున్నాడు. నిజం చెప్పాలి కదా నా జాగ్రత్తాలో నీను ఉండాలి , ఎవ్వరూ నన్ను గుర్తుపట్టా కుండా ఇలా అని వాళ్ళకు చెప్పాడు.
Interview :
BBC :మీరు ఈ వయసులో college కి రావటం ఎలా ఉంది?
పే1: చాలా బాగుంది, నిజానికి ఇంతకు ముందు కొద్దిగా ఇబ్బందిగా ఉండీది , ఇప్పుడు అంతా బాగుంది.
BBC: ఇంతకు ముందు అంటే , College లో join అయ్యిన కొత్తలోనా ......
పే1 : కాదండి , మా C.M. గారు ఆ rule పెట్టక ముందు .....
ప్ 2: ఒరే వాళ్ళకి అర్థం అయ్యీలా చెప్పారా...
పే1: ఇంతకు ముందు ఆ రూల్ లేక ముందు యీదైన దొంగతనం చెయ్యగానే మమ్మల్ని police లు police stationలో పెట్టె వల్లు.కాని ఇప్పుడు మేము students కదా మ జోలికి vaallu raaru.
next year , నా వోటు మా CM గారికే.
BBC:మరి మీరు ఇక్కడ ఉంటే మీ ఇంట్లో వాళ్ళకు డబ్బులు ఎలాగా .......
పే1 : ఆ దిగులు కూడా నాకు లేదు అండీ,మా నాన్న ఇక్కడే Degree join అయ్యాడు. మా ఆవిడ పక్కనే ఉన్నUnivercity hostel లో ఉంటుంది , తను Btech చేస్తుంది. మా అబ్బాయి Phd చేస్తున్నాడు. నా ఈడు వాళ్ళు అందరు ఇక్కడే ఉన్నారు. అంతా కలిసి చదువుకుంటాం , కలిసి దొంగతనాలకి , కొట్లాట లకి వెళ్తాం.
BBC: ఒహో అలా వచిన డబ్బు ల్‌తో చదువుతారా....
పే1: కాదండి , మేము మన గవర్న్‌మెంట్ Fee- Reimbursement పథకం వల్ల ఒక course అయ్యిన తర్వాత ఇంకో దానిలో join అవుతునామ్.
BBC:మీరు మ ద్వారా GOVERNMENTని ఏమైనా అడుగుడాం అని అనుకుంటున్నారా?
పే1: ఔనండి , నాకు ఒక చిన్న సందీహం ఉండండి , మీము అంతా ఇక్కడ ఈ COLLEGE లో ఉండగా ఆ police station లు ఎందుకు దండగ. వాటిని కూడా colleges గా మారిస్తే ఇంకా కొంత మంది చదువుకుంటారు గా.......

Thursday, November 11, 2010

ఒక ప్రేతాత్మ ఘోష (Warning: Brave hearted persons please donot read this)

ఇది కల్పనతో కూడిన ఒక యదార్థ గాథ, చదవండి మీకే తెలుస్తుంది.
------------------------------
xyz అనే వూరిలో రాజు రాణి అనే ప్రేమికులు వుండే వారు. అన్ని కథలో లాగా వీరి కులాలు కూడా వేరు.Raju blongs to A +ve and Rani belongs to B -ve.

వీరి ప్రేమ విషయం తెలిసిన రాణి తండ్రి ఒక రోజు , రాజు ని తమ ఇంటికి పిలిచి వాళ్ళ ప్రేమ విషయం కొన్ని ప్రశ్నలు అడుగుతాడు (similar to one to one session),దానికి రాజు మంచి answers ఇస్తాడు. దానితో రాణి తండ్రి వీళ్ళ పెళ్లికి ఒప్పుకుంటాడు. హమ్మయ్య అనుకుని రాజు తన ఇంటికి తిరిగి వెళ్తాడు.

కాని తరవాతి రోజు ఈనాడు జిల్లా edition లో రాజు అనే వ్యక్తీ దుర్మరణం అని వస్తుంది.(Back ground story : రాణి తండ్రి ఆ వూరు inspectorకి10 వేలు ఇస్తాడు , ఇంకా ఆ ఈనాడు విలేఖరికి Etv లో anchor గా job ఇప్పిస్తాడు.So u may imagine ,how bad he was ...!)

============================

రాజు చనిపోయినప్పుడు అతని జేబులో వున్న రాణి అని రాయబడిన రుమాలుని (అది రాజు రక్తం తో తడిసి వుంటుంది ) policeలు , రాణి కి ఇచ్చారు. రాజు తీపి గుర్తుగా దాన్ని దాచుకుందాం అని Rani అనుకుంటుంది. అందుకని ఆ రక్తపు మరకలు పూగోట్ట టానికి ఆ రుమాలుని వుతుకుతుంది ,అయినా కాని ఆ మరకలు పోవు.

====================
యీమి చెయ్యాలా అని ఆలో చిస్తూ నిద్రపోతుంది.అప్పుడు తనకు ఒక విచిత్ర మైన కల వస్తుంది : అది యీమి టంటే : రాణి కళ్ళ ముందు ఒక మెరుపు మెరుస్తుంది ఆ మెరుపు నుండి రాజు వచ్చి రాణి కి ఒక విషయం చెపుతాడు, అది ఏమిటో తనకు అర్థం కాదు. వెంటనే రాణి ఉలికి పది లెగిసి టైం చూస్తుంది.అప్పుడు టైం సరిగ్గా 4:30am.

రాణి తనకు రాజు కలలో వచ్చిన విషయం తన అమ్మాకు చెప్పింది. వాళ్ళ అమ్మ , నువ్వు చాల depressionలో వున్నావు అమ్మా, అందుకని నీకు పిచ్చి పిచ్చి కలలు వస్తున్నాయి అని చెప్పి వూరడిస్తుంది.

కాని ఎంతైనా తల్ల్లి మనసు కదా , తరవాత రోజు సాయంత్రం రాణి తల్లి ఆ రుమాలుని వుతుకుతుంది, అయినా ఆ ఆరిన రక్తపు మరకలు పోవు. విచిత్రంగా ఆ రోజు రాత్రి రాజు , రాణి తల్లి కలలో వచ్చి ఏదో చెపుతాడు , కాని రాణి తల్లికి కూడా అర్థం కాదు. రాణి తల్లికి భయం వేసి ఈ విషయాన్ని రాణి తండ్రికి చెపుతుంది. రాణి తండ్రి వీరిద్దరిని బాగా తిడతాడు , ఆ రాజు గురించి మీరు ఎక్కువ think చెయ్యూద్దు అని అంటాడు.మరుసటి రోజు రాత్రికి same కల మన రాణి తండ్రికి వస్తుంది.
ఈ సారి రాణి తండ్రికి నిజమగానే భయం వేస్తుంది. ఆ రాజు గాడు దెయ్యం లాగా మారి తమ కుటుంబాన్ని పీడిస్తున్నాడు అని అర్థం అవుతుంది. ఇక క్షణం కూడా ఆలస్యం చెయ్యకుండా పక్క వూరి స్మసాసనం లో వుండే అఘోరా ని సంప్రదిస్తాడు.

=======================

ఆ అఘోర చెప్పినట్టు , మంత్రించిన ముగ్గులు , నిమకాయలు ఇంకా గుమది కాయలు , వంకాయలు (పుచ్చులు లేనివి), బెండకాయలు (లేతవి ), ఇవన్ని వాళ్ళ ఇంటి గేటు ముందు గొయ్యి తవ్వి పాతుతాడు.


ఆ మరుసటి రాత్రి సమయం సరిగ్గా 4:30 am, మళ్ళీ అదే కల అందరికి , అంటే రాణి కి , రాణి తల్లికి , రాణి తండ్రికి , అఘోరకి కూడా వస్తుంది . ఆ కలలో మళ్లీ మెరుపు వస్తుంది , దాని నుండి రాజు వస్తాడు.ఇప్పుడు వీళ్ళందరికీ ఆ అఘోర చేసిన పూజలు ఫలించి రాజు చెప్పే మాటలు ( ప్రేతాత్మ మాటలు ) అర్థం అవుతాయి.
ఇంతకూ రాజు యీమి అంటాడు అంటే : "మీరు కొత్త Tide వాడండి ఆ రుమాలు కొత్తది లాగా మెరుస్తుంది".

=================

Note: ఇది నేను ఎక్కడో 3 సంవత్సరాల క్రితం చదివిన కథ , నా type లో కొని మార్పులు చెయ్యటం జరిగింది.

Wednesday, June 30, 2010

save the tiger.... పులులను రక్షించండి ....! yes, u can do it

ఇది నిజంగా నిజమే నండి మన దేశంలో పులులు చాల చాల తక్కువ వున్నాయి.
ఉన్న వాటిని ఇప్పుడు కాపాడక పొతే ఇక ముందు ముందు అస్సలు పులులు వుండవు.
వాటిని కూడా graphics లో చోసుకోవాలి.

పోయిన నెలలో మా company కి వచ్చి Aircel వాళ్ళు వాటిని రక్షించండి అని చెప్పారు.
నాకు ఒక చిన్న doubt వచ్చింది. నా చిన్నప్పటి నుండి ఇప్పటి వరకు నేను ఒక్క పులిని కూడా చంపలేదు, ఇంకా కనీసం దగ్గర నుండి కూడా చూడలేదు.

ఇన ఒక వేళ అది దారి తప్పి kphb లో ఉన్న మా ఇంటికి వస్తే దానికి chicken పెట్టాలో mutton పెట్టాలో అని ఆలోచిస్తామా చెప్పండి , ముందు మనం పారిపోతాం కదా అని నా ఫ్రెండ్తో అన్నాను. సర్లే వాళ్ళు ఏమి చెపుతారో విందాం అని వెళ్ళాం.

వాళ్ళు మా హస్త ముద్రలు తీసుకుని మీరు మాట ఇచారు , ఇక నుండి మీరు పులులను చంపే వాళ్ళను ప్రోత్సాహించోడు అని అన్నారు , నాకు మాత్రం "వాడి మీదకి ఒక పులిని వదలాలి " అన్నంత కోపం వచ్చింది.
పులి ని TV లో చూడటం తప్ప బయట చూడని వాళ్ళ దగ్గరకు వచ్చి ఇలా అంటాడా ? ఇక పులి ని వేటాడే వాళ్ళను ప్రోత్సహిమ్చోద్దు అంటాడా ? అలాంటి వాళ్ళు వుంటారు అని తెలిస్తే ముందు నా ప్రాజెక్ట్ మార్చని మా మేనేజర్ని వాడి పక్కన వుండే HR ని యీమైన చెయ్యమని వాడినే బతిమిలాడుకునే వాడిని కదా!

సర్లెండి వాడికి తెలియక అలా అన్నాడు , ఇప్పుడు మీకు నా ప్రశ్న.........
పులి మీ ఇంటికి వస్తే మీరు ఏమి చేస్తారు?
ans:
options:
1.పారిపోతాం
2.TV9 కి ఫోన్ చేస్తాం
3.we will inform to police
4.వాటికి ఫుడ్ పెట్టి ఆడుకోటానికి place చూపిస్తాం


మీ సమాధానం యీమైనా కాని , నిజంగా మీ దగ్గరకు ఒక పులి వస్తే కొద్దిగా మా ఇంటికి పంపించండి, కాసేపు మా office లోఅది కూడా మా మేనేజర్ room లో దాచి మళ్లీ మీ దగ్గరికే పంపించి వేస్తాను.
Awaiting for a positive response (with tigers)..........................