Sunday, August 24, 2008

ఎంత మార్పు ........!Telugu->Hindi(x)->English...!!!

తెలుగు భాషలో నాకు నచని పదము = " ఆంగ్లము "
------
ఇది మాత్రం నేను అస్సలు వూహించనిది. మా చిన్నప్పుడు ఇలాంటి వుద్యోగ్గాలు లేవు కదా..!మా కృష్ణ జిల్లా లో అందరి లానే , నాకు కూడా తెలుగు అంటే విపరీతమైన ఇష్టం. చిన్నప్పుడు తెలుగులో 100/100 మార్కులు వచ్చిన ట్రాక్ రికార్డు కూడా వుండి లెండి!ఏదో చిన్నప్పుడు మార్క్స్ కోసం ఆ హిందీ ఇంకా ఇంగ్లీష్ లను బాగా బట్టి కొట్టే వాళ్ళం.
****ఇక చిన్నప్పుడు మా స్కూల్ పక్కన వుండే ఇంగ్లీష్ మీడియం స్కూల్ పిల్లలు ఇంగ్లీష్ లో మాట్లాడుకునే వారు బయట రోడ్ల మీద. అప్పుడు మేము అనుకునే వాళ్ళం " వీళ్ళు బాగా ఎక్కువ[over] చీస్తున్నారు రా "***
ఇంజనీరింగ్ కూడా విజయవాడ లో నే , కాబట్టి అంతగా ప్రాబ్లం కూడా రాలేదు.ఇక విషయం లోకి వద్దాం!జాబు వెతుక్కూవటం కోసం హైదరాబాద్ బస్ ఎక్కినప్పుడు కూడా నేను అనుకొలేదు, నాతో పాటు కొత్తగా భాష గొడవలు కూడా హైదరాబాద్ కి వస్తున్నా యి అని!
----------
మొదటి సారిగా నాకు లైఫ్ లో ఒక అమ్మాయిని చంపాలని అనిపించింది కూడా అప్పుడే !తనే మా ఇంటి ఓనరు!, తెలంగాణ శకుంతల లాగా వుంటుంది. (లోకల్ ) కాబట్టి ప్రతి విషయాన్ని డిమాండ్ చీస్తున్నట్టు చెప్పీది! మా వైపు డిమాండ్స్ అయినా కాని రిక్వెస్ట్[Request] లాగా చెపుతారు. నేను వచ్చిన రెండవ రోజే ఒక గొడవ. అప్పుడు అనుకున్నా నా 1st శాలరీ రాగానే, రౌడీ లను పెట్టి ఆమెను కొట్టించాలి అని!ఇక బయటకు వెళ్తే , షాప్ వాడు హిందీ లో మాట్లాడే వాడు. మొదట్లో కొద్దిగా భయం వీసింది ,ఇక్కడ వుండాలంటే minimum hindi అయినా కావాలి అని!కాని మనకు రాదే!.
-----
అలా ఒక వారం గడిచిన తర్వాత, మా ఫ్రెండ్ విశ్వనాధ్ గాడు కనిపించాడు , నాకైతే చాలా ఆనందం వేసింది. వాడిని కలిస్తే ఇంగ్లీష్ భాష ముఖ్యం రా మన వేటకి అని చెప్పాడు. ఇక ఇద్దరం కలిసి Russels అనే ఒక institute కి వెళ్ళాం. అక్కడ receptionist అడిగిన మొదటి ప్రశ్న :మీరు 10th వరకు which medium?తెలుసు కదా :తెలుగు జాతి మనది ,నిండుగా వెలుగు జాతి మనది!మా వాడు మాత్రం Englishmedium .నేను తనకి దొరికి పోయాను. ఇక ఇంగ్లీష్ వల్ల వుపయోగాలు , coaching తీసుకూక పూవటం వల్ల వచ్చే ఇబ్బందులు అనే 16 marks question కి answer చెప్పింది.అయినా నేను పట్టించు కోలేదు, కారణం : 6 వేలు అడిగారు.
తర్వాత సరిగ్గా ఒక నెలకి jobfair కి వెళ్ళాం. నేను నా ఫ్రెండ్స్( విజయవాడ). మొదటి సారి వెళ్ళటం. కాబట్టి మాకు అంటా చాలా హడావిడిగా కనిపించింది. నిజం చెప్పాలంటే వాళ్లతో యీమి మాట్లాడాలో కూడా తెలియలీడు. మన దగ్గర ఒక ఆయుథం వుంది కదా! అదే కాపీ (copy )కొట్టటం.మా వాళ్ళను పక్కన వుండమని చెప్పి , కొద్దిగా ఓవర్[over] చీస్తున్న ఒకడి ని ఫాలో అయ్యాను , వాడి వెనకాలా 10 నిముషాలు తిరిగితే నాకు కొన్ని sentences వచ్చాయి. [1.is freshers applicable for this job? 2.is this company located in hyderabad? 3.wat is your basic requirement?].
అలా మా ఆ రోజు గండం గడిచింది.
ఇక మళ్లీ నోయిడా వెళ్ళినప్పుడు తప్పలేదు , హిందీ తప్పని సరిగా మాట్లాడాను.లేక పోతె కొద్దిగా కూడా పని జరగదు కదా..! నాకు హిందీ ఎలా వచ్చు అని అనుకుంటున్నారా..! చిన్నప్పుడు నేను నేర్చుకుంది , ఇంకా మన దూరదర్శన్ లో చూసిన అమితాబ్ బచన్ సినిమాల ప్రభావం లెండి! ఈ మధ్యన పాఠశాల కి వెళ్ళినప్పుడు , మా హిందీ teacher కి ఈ విషయాలు అన్ని చెప్పి తనకు థాంక్స్ కూడా చెప్పాలెండి!ఇక మా మేనేజర్ గాడు నోయిడా వాడు , వాడు మాత్రం హిందీ లో మాట్లాడేవాడు , నేను మాత్రం ఇంగ్లీష్ లో రిప్లై ఇచే వాడిని. ఆటను తప్ప మిగతా ఎవరైనాఆఫీసు లో హిందీ లో మాట్లాడి తే , వాళ్లకు చెప్పే వాడిని , నాకు హిందీ రాదు , ఇంగ్లీష్ లో మాట్లాడండి అని! తర్వాత తర్వాత అది కూడా చెప్పకుండా కేవలం ఇంగ్లీష్ లో మాట్లాడు తుంటే వాళ్ళే మారే వారు.
----------------
కాని ఇప్పడు మళ్లీ హైదరాబాద్ కి వచ్చిన తర్వాత మా team members:9 persons
2-andhra
1-local hyderabadi
1-chennai
1-Orissa
1-Noida
1-Punjabi
2-Kerala
చూసారు కదా ...ఒక చిన్న భారత దేశం వుంది! ఇక తప్పదు కాబట్టి , నాకు నచని ఇంగ్లీష్ ని తప్పని సరిగా వాడుతున్నాను. అప్పుడప్పుడు అనుకుంటాను "రమణ నువ్వు చాలా ఎక్కువ[over] చీస్తున్నావు రా అని!"